ప్రధాన మంత్రి కార్యాలయం

సులభంగా తీసుకుపోదగ్గ 1 లక్ష ఆక్సీజన్ కాన్ సెన్ ట్రేటర్స్ ను పిఎమ్ కేర్స్ ఫండ్ ను ఉపయోగించి సేకరించడం జరుగుతుంది

డిఆర్ డిఒ అభివృద్ధిపరచిన సాంకేతిక విజ్ఞానం ఆధారం గా రూపొందినటువంటి మరో 500 పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటుల ను పిఎమ్ కేర్స్ లో భాగం గా మంజూరు చేయడం జరిగింది
 

ఈ ఆక్సీజన్ కాన్ సెన్ ట్రేటర్స్, పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటు లు డిమాండ్ క్లస్టర్ ల సమీపం లో ప్రాణవాయువు సరఫరా ను ఎంతగానో పెంచుతాయి

Posted On: 28 APR 2021 4:32PM by PIB Hyderabad

**సులభం గా తీసుకుపోదగ్గ 1 లక్ష ఆక్సీజన్ కాన్ సెన్ ట్రేటర్స్ ను పిఎమ్ కేర్స్ ఫండ్ ను ఉపయోగించి సేకరించడానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అనుమతి ని ఇచ్చారు.

కోవిడ్ నిర్వహణ కు గాను లిక్విడ్ మెడికల్ ఆక్సీజన్ (ఎల్ఎమ్ఒ) సరఫరా ను మెరుగుపరచడానికి అవసరమైన చర్యల ను గురించి చర్చించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశం లో ఈ నిర్ణయాన్ని తీసుకోవడమైంది.  ఈ  ఆక్సీజన్ కాన్ సెన్ ట్రేటర్స్ ను వీలయినంత త్వరగా సేకరించాలి, వాటి ని కేసు ల భారం అధికంగా ఉన్న రాష్ట్రాల కు అందజేయాలి అని ప్రధాన మంత్రి ఆదేశించారు.

పిఎమ్ కేర్స్ ఫండ్ నుంచి ఇంతకు ముందు అనుమతించిన 713 పిఎస్ఎ ప్లాంటుల కు తోడు,  500 కొత్త ప్రెశర్ స్వింగ్ అడ్ సార్ప్ శన్ (పిఎస్ఎ) ఆక్సీజన్ ప్లాంటుల ను పిఎమ్ కేర్స్ ఫండ్ ద్వారా మంజూరు చేయడమైంది.

పిఎస్ఎ ప్లాంటు లు జిల్లా ప్రధాన కేంద్రాలలోని ఆసుపత్రుల లో, రెండో శ్రేణి నగరాల లోని వైద్యశాలల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సీజన్ సరఫరా ను పెంచుతాయి.  ఈ 500 పిఎస్ఎ ప్లాంటుల ను డిఆర్ డిఒ, సిఎస్ఐఆర్ అభివృద్ధిపరచిన సాంకేతిక విజ్ఞానాన్ని దేశీయ తయారీదారు సంస్థ లకు బదలాయించడం ద్వారా నెలకొల్పడం జరుగుతుంది.

పిఎస్ఎ ప్లాంటుల ను నెలకొల్పడం, సులభం గా తీసుకుపోదగ్గ 1 లక్ష ఆక్సీజన్ కాన్ సెన్ ట్రేటర్స్ ను సేకరించడం డిమాండ్ క్లస్టర్ ల సమీపం లో ప్రాణవాయువు సరఫరా ను ఎంతగానో పెంచుతాయి; అక్కడి నుంచి ప్రాణ వాయువు ను ప్లాంటు ల నుంచి దవాఖానాల కు చేరవేయడం లో ప్రస్తుతం లాజిస్టిక్స్ పరంగా ఎదురవుతున్న సవాళ్ల ను పరిష్కరించడానికి వీలవుతుంది.

***(Release ID: 1714670) Visitor Counter : 41