ప్రధాన మంత్రి కార్యాలయం

స్వ‌ామిత్వ ప‌థ‌కం లో భాగం గా ఇ-ప్రాప‌ర్టీ కార్డుల పంపిణీ ని ప్రారంభించిన ప్ర‌ధాన‌ మంత్రి


4.09 ల‌క్ష‌ల మంది సంపత్తి యజమానుల కు వారి ఇ- ప్రాప‌ర్టీ కార్డుల‌ ను ఇవ్వడమైంది
 

జాతీయ పంచాయ‌త్ పురస్కారాల ను కూడా ప్ర‌ధాన‌ మంత్రి ప్రదానం చేశారు


కరోనా ను సంబాళించడం లో పంచాయతీ లు పోషించిన పాత్ర ను ఆయన అభినందించారు


ఈ కష్ట కాలాల్లో, ఏ ఒక్క కుటుంబమూ ఆకలి తో అలమటించకుండా చూడడం మన కర్తవ్యం: ప్ర‌ధాన‌ మంత్రి


‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న్ యోజన’ 80 కోట్ల మంది లబ్ధిదారుల కు 2 నెల ల పాటు ఆహార పదార్థాల ను ఉచితం గా అందిస్తుంది; ఈ పథకానికి గాను కేంద్రం 26,000 కోట్ల రూపాయల కు పైగా వెచ్చిస్తోంది: ప్ర‌ధాన‌ మంత్రి


కేంద్రం తన విధానాలు, తన కార్యక్రమాలు అన్నిటి కి పల్లెలనే కేంద్ర స్థానం లో నిలబెడుతోంది: ప్ర‌ధాన‌ మంత్రి


భారత ప్రభుత్వం ఇదివరకు ఎన్నడూ లేని విధం గా 2.25 లక్షల కోట్ల రూపాయల ను పంచాయతీల కు కేటాయించింది; ఇది పారదర్శకత్వం తాలూకు అపేక్ష ను సైతం సాకారం చేస్తుంది: ప్ర‌ధాన‌ మంత్రి

Posted On: 24 APR 2021 1:54PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ‘స్వ‌ామిత్వ ప‌థ‌కం’ లో భాగం గా ఇ- ప్రాప‌ర్టీ కార్డు ల పంపిణీ ని జాతీయ పంచాయతీ రాజ్ దినం అయినటువంటి ఈ రోజు న, అంటే శనివారం నాడు, వీడియో కాన్ఫ‌రెన్స్‌ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.  ఈ సంద‌ర్భం లో 4.09 ల‌క్ష‌ల మంది సంపత్తి యజమానుల కు వారి ఇ- ప్రాప‌ర్టీ కార్డుల‌ ను ఇవ్వడం జరిగింది.  అంతే కాదు, స్వామిత్వ పథకాన్ని దేశవ్యాప్తం గా అమలుపరచడానికి కూడా శ్రీకారం చుట్టడమైంది.  ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రి శ్రీ‌ న‌రేంద్ర‌ సింహ్ తోమ‌ర్ హాజరు అయ్యారు.  అలాగే సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పంచాయతీ రాజ్ మంత్రులు కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.


పంచాయతీ రాజ్ దినం అనేది ఎటువంటి రోజు అంటే ఆ రోజు న గ్రామీణ భారతదేశం నవనిర్మాణానికి పాటుపడదాం అంటూ మనలను మనం పునరంకితం చేసుకొనేటటువంటి రోజు అన్న మాట.  ఈ దినం మన గ్రామ పంచాయతీ లు చేసినటువంటి అసాధారణమైన కార్యాల ను గుర్తించి, ప్రశంసలు అందించవలసిన దినం అని ప్రధాన మంత్రి అన్నారు.

కరోనా ను సంబాళించడం లో పంచాయతీ లు పోషించిన భూమిక ను ప్రధాన మంత్రి అభినందించారు.  మరి పంచాయతీ లు కరోనా పల్లె ల లోకి అడుగు పెట్టకుండా ఆపడం కోసం, జాగృతి ని వ్యాప్తి చేయడం కోసం స్థానికం గా నాయకత్వాన్ని అందించాయి అని ఆయన అన్నారు.  ఎప్పటికి అప్పుడు జారీ చేస్తున్నటువంటి మార్గదర్శక సూత్రాల ను పూర్తి గా అమలులోకి తీసుకు రావడానికి పంచాయతీ లు పూచీ పడాలి అని శ్రీ నరేంద్ర మోదీ కోరారు.  ఈ సారి మనకు టీకా మందు తాలూకు రక్షణ కవచం కూడా ఉంది అని ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు.  మనం గ్రామం లోని ప్రతి ఒక్క వ్యక్తి కి టీకా మందు ను ఇప్పించేటట్లు చూద్దాం, అవసరమైనటువంటి ప్రతి ఒక్క ముందుజాగ్రత ను తీసుకొనేటట్లు చూద్దాం అంటూ ఆయన సూచన లు చేశారు.

ఈ కష్టకాలాల్లో, ఏ ఒక్క కుటుంబమూ పస్తు ఉండకుండా చూడవలసిన కర్తవ్యం మనది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.  ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ లో భాగం గా ప్రతి ఒక్క పేద వ్యక్తి మే, జూన్ మాసాల లో ఆహార పదార్థాల ను ఉచితం గా అందుకొంటారు అని ఆయన తెలిపారు.  ఈ పథకం 80 కోట్ల మంది లాభితుల కు ప్రయోజనాన్ని అందిస్తుంది, కేంద్రం ఈ పథకానికి 26,000 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుంది అని ఆయన అన్నారు.  

స్వామిత్వ యోజన ను ప్రారంభించిన 6 రాష్ట్రాల లో ఒక్క సంవత్సర కాలం లోపే ఆ పథకం తాలూకు ప్రభావం ఎలా ఉందన్నది ప్రధాన మంత్రి వివరించారు.  ఈ పథకం లో భాగం గా, గ్రామం లోని సంపత్తులు అన్నిటిని డ్రోన్ ద్వారా సర్వేక్షణ జరపడమైంది; మరి ఒక సంపత్తి కార్డు ను యజమానుల కు పంపిణీ చేయడం జరిగింది.  ప్రస్తుతం 5 వేల కు పైగా గ్రామాల లో 4.09 లక్షల మంది కి అటువంటి ఇ- ప్రాపర్టీ కార్డులను ఇవ్వడమైంది.  ఈ పథకం గ్రామాల లో ఒక కొత్త విశ్వాసాన్ని పాదుగొల్పింది.  సంపత్తి తాలూకు దస్తావేజు పత్రాలు అనిశ్చితి ని తొలగించి, సంపత్తి వివాదాలకు ఆస్కారాన్ని తగ్గించి వేస్తాయి.  అదే కాలం లో, పేదల ను దోపిడీ బారి నుంచి, అవినీతి బారి నుంచి రక్షిస్తాయి.  ఇది రుణ సంభావ్యత తాలూకు సౌలభ్యాన్ని కలుగజేస్తుంది.  ‘‘ఒక రకం గా, ఈ పథకం పేదల భద్రత కు పూచీ పడుతుంది; గ్రామాలు ప్రణాళికబద్ధం గా అభివృద్ధి చెందేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగయ్యేందుకు దోహద పడుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.  రాష్ట్రాలు సర్వే ఆఫ్ ఇండియా తో ఎమ్ ఒయు పై సంతకాలు చేయాలని, అవసరమైన చోటల్లా రాష్ట్ర చట్టాల లో మార్పు తీసుకు రావాలని ఆయన అభ్యర్థించారు.   సంపత్తి కార్డు కు ఒక నిర్దిష్ట రూపాన్ని తయారు చేయడం ద్వారా ఆ కార్డు రుణ సంబంధ లాంఛనాల కు గాను ఇట్టే ఆమోదయోగ్యం గా ఉండేలా చూడాలి అంటూ బ్యాంకుల కు ఆయన సూచన చేశారు.


ప్రగతి, సాంస్కృతిక నాయకత్వం ఎల్లప్పటికీ మన గ్రామాల తోనే ఒనగూరింది అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.  ఈ కారణం గా, కేంద్రం తన విధానాలు, కార్యక్రమాలు అన్నిటా గ్రామాలనే కేంద్ర స్థానం లో నిలబెడుతోంది అని ఆయన చెప్పారు.  ‘‘నవ భారతదేశం లో గ్రామాలు సమర్థమైనవిగా, సొంత కాళ్ల మీద నిలబడగలిగేవి గా ఉండాలి అనేదే మా ప్రయాస’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

పంచాయతీల పాత్ర ను వృద్ధి చెందించడానికి తీసుకొంటున్న చర్యల ను ప్రధాన మంత్రి ఒక్కటొక్కటి గా వివరించారు.  పంచాయతీ లు కొత్త హక్కుల ను అందుకొంటున్నాయి, ఫైబర్- నెట్ తో పంచాయతీ లకు లంకె పెట్టడం జరుగుతోంది.  ప్రతి ఒక్క కుటుంబానికి నల్లా ద్వారా తాగునీటి ని అందించడానికి ఉద్దేశించినటువంటి జల్ జీవన్ మిశన్ లో వాటి భూమిక చాలా కీలకం గా ఉంది.  అదే విధం గా, ప్రతి పేద వ్యక్తి కి పక్కా ఇంటి ని సమకూర్చే ఉద్యమం గాని, లేదా గ్రామీణ ఉపాధి పథకాల నిర్వహణ గాని పంచాయతీ ల ద్వారానే నడపడం జరుగుతోంది.  వర్ధిల్లుతూ ఉన్న పంచాయతీ ల ఆర్థిక స్వతంత్ర ప్రతిపత్తి ని గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు.  పంచాయతీల కు ఇదివరకు ఎన్నడూ లేనంత గా 2.25 లక్షల కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం కేటాయించిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  ఇది ఖాతాల లో పారదర్శకత్వం తాలూకు అపేక్ష కు కూడా తోడ్పడుతుందన్నారు.  ‘ఇ-గ్రామ్ స్వరాజ్’ ద్వారా ఆన్ లైన్ చెల్లింపునకు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఏర్పాటుల ను చేసింది అని ప్రధాన మంత్రి చెప్పారు.  ఇక అన్ని చెల్లింపు లు పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (పిఎఫ్ఎమ్ఎస్) ద్వారా జరుగుతాయి.  అదే విధం గా, ఆన్ లైన్ మాధ్యమం ద్వారా నిర్వహించే లెక్క ల తనిఖీ పారదర్శకత్వానికి పూచీ పడనుంది.  అనేక పంచాయతీ లు పిఎఫ్ఎమ్ఎస్ తో ముడిపడ్డాయి అని ఆయన చెప్తూ, ఇతర పంచాయతీలు సైతం ఈ పని ని త్వరగా పూర్తి చేయవలసిందంటూ కోరారు.

త్వరలోనే స్వాతంత్ర్య 75వ సంవత్సరం లోకి ప్రవేశిస్తున్నామన్న విషయాన్ని ప్రధాన మంత్రి తన ప్రసంగం లో ప్రస్తావించి, సవాళ్ల ను అధిగమిస్తూ అభివృద్ధి చక్రాన్ని ముందుకు తీసుకుపోవాలి అని పంచాయతీల కు విజ్ఞప్తి చేశారు.  పంచాయతీ లు తమ గ్రామం పురోగతి కి గాను లక్ష్యాల ను పెట్టుకోవాలి, ఆ లక్ష్యాల ను ఒక నిర్ణీత కాల పరిమితి లోపల సాధించాలి అని ఆయన కోరారు.

 స్వ‌ామిత్వ‌ ప‌థ‌కాన్ని గురించి -


సామాజిక- ఆర్థిక‌ సాధికారిత కలిగినటువంటి, స్వావ‌లంబనయుతమైనటువంటి గ్రామీణ భార‌తదేశాన్ని ప్రోత్స‌హించేందుకు గాను  2020 ఏప్రిల్ 24 న స్వ‌ామిత్వ ( స‌ర్వే ఆఫ్ విలేజెస్ ఎండ్ మేపింగ్ విత్ ఇంప్రొవైజ్ డ్ టెక్నాల‌జీ ఇన్ విలేజ్ ఏరియా) ను ఒక కేంద్ర రంగ పథకం రూపం లో ప్ర‌ధాన‌ మంత్రి ప్రారంభించారు.  ఈ ప‌థ‌కం మేపింగ్‌ కు, స‌ర్వేక్షణ కు ఆధునిక సాంకేతిక సాధనాల ను ఉపయోగించుకొంటూ గ్రామీణ భార‌త‌దేశం రూపురేఖలను మార్చివేసే సామర్థ్యం కలిగినటువంటి పథకం.  ఇది రుణాన్ని పొందడం కోసం గాని, ఇతర ద్రవ్యపరమైన లాభాన్ని పొందడం కోసం గాని గ్రామీణులు వారి సంపత్తి ని ఒక ఆర్థిక సంపద రూపం లో వినియోగించుకొనేందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది.  ఈ ప‌థ‌కం లోకి యావద్దేశం లో సుమారుగా 6.62 ల‌క్ష‌ల గ్రామాల‌ ను 2021- 2025 మ‌ధ్య కాలం లో చేర్చడం జరుగుతుంది.

ఈ ప‌థ‌కం తాలూకు ప్రయోగాత్మక దశ ను మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క‌, హ‌రియాణా, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌ రాష్ట్రాలతో పాటు, పంజాబ్‌, రాజ‌స్థాన్ ల‌ లో ఎంపిక చేసిన గ్రామాల‌ లో 2020-21 మ‌ధ్య అమలుపరచడమైంది.



 

***
 

 



(Release ID: 1713807) Visitor Counter : 258