ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్థిక బిల్లు, 2021 లో సవరణల కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
20 APR 2021 3:43PM by PIB Hyderabad
ఆర్థిక బిల్లు, 2021 లో ప్రభుత్వ సవరణ ల కు (వీటికి 2021 మార్చి నెల 28న ఆర్థిక చట్టం, 2021 పేరిట చట్టరూపాన్ని ఇవ్వడమైంది) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
ఈ ప్రతిపాదనలకు స్పష్టత ను, హేతుబద్ధత ను ఇవ్వడానికి, దానితో పాటు ఆర్థిక బిల్లు లో ప్రతిపాదించిన సవరణల విషయం లో తత్సంబంధిత ప్రయోజనాలు ఇమిడివున్న వర్గాల తాలూకు ఆందోళనలను తొలగించడానికి
ఈ సవరణలు అవసరమయ్యాయి.
ఉద్దేశ్యాలు:
ఆర్థిక బిల్లు, 2021 లలో ప్రభుత్వ సంస్కరణల తో బిల్లు లో ప్రతిపాదించినటువంటి సంస్కరణ ల ప్రభావం పై సంబంధిత వర్గాల లో ఎదురయ్యే ఆందోళనలను పరిష్కరించి పన్ను ల చెల్లింపుదారులందరి కి సమానమైనటువంటి, సమ్మిళితమైనటువంటి వాతావరణాన్ని సమకూర్చడం జరుగుతుంది.
ఆర్థిక బిల్లు, 2021 లో ప్రభుత్వం చేయదలచుకొన్న సవరణ లు ముఖ్యంగా పన్నుల తాలూకు ప్రతిపాదన లు. అవి ప్రభుత్వానికి సమయానికి ఆదాయాన్ని సంపాదించిపెట్టడం తో పాటు పన్ను ల చెల్లింపుదారుల ఫిర్యాదుల ను దూరం చేసి, తద్వారా ఇప్పుడు అమలు అవుతున్న ఏర్పాటుల ను సువ్యవస్థితం చేస్తాయి కూడా.
***
(Release ID: 1713078)
Visitor Counter : 206