ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకాలు 12.71 కోట్లకు పైనే
గత 24 గంటలలో ఇచ్చిన టీకా డోసులు 32 లక్షలు
10 రాష్ట్రాలలో 78% కొత్త కేసులు
చికిత్సలో ఉన్నవారిలో 62% మంది ఐదు రాష్ట్రాల్లోనే
జాతీయ స్థాయిలో చనిపోయినవారి శాతం 1.18% లోపు
Posted On:
20 APR 2021 11:50AM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 12.71 కోట్లు దాటింది. ఈరోజు ఉదయం 7 గంటలవరకు అందిన
సమాచారం ప్రకారం 18,83,241 శిబిరాలద్వారా 12,71,29,113 టీకా డోసులు ఇవ్వగా అందులో 10,96,59,181 మొదటి
డోసులు, 1,74,69,932 రెండో డోసులు ఉన్నాయి. ఇందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న 91,70,717 మొదటి డోసులు,
57,67,657 రెండో డోసులు, కొవిడ్ యోధులు తీసుకున్న 1,14,32,732 మొదటి డోసులు, 56,86,608 రెండో డోసులు,
60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 4,66,82,963 మొదటి డోసులు, 47,04,601 రెండో డోసులు, 45-60 ఏళ్ల మధ్య వారు
తీసుకున్న 4,23,72,769 మొదటి డోసులు, 13,11,066 రెండో డోసులు ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45 -60 ఏళ్ళ మధ్యవారు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
91,70,717
|
57,67,657
|
1,14,32,732
|
56,86,608
|
4,23,72,769
|
13,11,066
|
4,66,82,963
|
47,04,601
|
12,71,29,113
|
ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం టీకాలలో 59.33% వాటా ఎనిమిది రాష్ట్రాలదే.
గడిచిన 24 గంటలలో మొత్తం 32 లక్షలకు పైగా కోవిడ్ టీకాలిచ్చారు. టీకాల కార్యక్రమం మొదలైన 94వ రోజైన ఏప్రిల్ 19 నాడు
32,76,555 టీకాలిచ్చారు. అందులో 22,87,419 మంది లబ్ధిదారులు 45,856 శిబిరాలద్వారా మొదటి డోస్ అందుకోగా 9,89,136
మంది రెండో డోస్ తీసుకున్నారు.
తేదీ: ఏప్రిల్ 19, 2021 ( 94వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళమధ్యవారు
|
60 పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
34,586
|
47,609
|
1,68,828
|
1,54,212
|
13,06,307
|
1,73,102
|
7,77,698
|
6,14,213
|
22,87,419
|
9,89,136
|
భారతదేశంలో కొత్త కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 2,59,170 కొత్త కేసులు నమోదయ్యాయి.
పది రాష్ట్రాలు – మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కేరళ, కర్నాటక, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, తమిళ నాడు, గుజరాత్, రాజస్థాన్
లలో 77.67% కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే 58,924 కొత్త కేసులు రాగా ఆ తరువాత స్థానంలో ఉన్న
ఉత్తరప్రదేశ్ లో 28,211, ఢిల్లీలో 23,686 కేసులు నమోదయ్యాయి.
ఈ దిగువ చూపిన విధంగా ఇరవై రాష్ట్రాలలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు 20,31,977 కి చేరాయి. ఇవి దేశం మొత్తంలో నమోదైన పాజిటివ్ కేసులలో 13.26%.
గత 24 గంటలలో చికిత్సలో ఉన్న కేసులు 1,02,648 వచ్చి చేరాయి. ఐదు రాష్ట్రాలు- మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్,
కర్నాటక, కేరళ లోనే దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కేసులలో 62.07% ఉన్నాయి.
వారం వారం రోజువారీ పాజిటివ్ శాతం పెరుగుతూ ఉంది. ప్రస్తుతం అది 15.99% చేరింది.
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోవిడ్ నుంచి కోలుకున్నవారు 1,31,08,582 కు చేరుకున్నారు. కోలుకున్నవారి శాతం 85.56%.
గత 24 గంటలలో 1,54,761 మంది కోలుకున్నారు.
జాతీయ స్థాయిలో కోవిడ్ మరణాల శాతం 1.18% కి చేరింది.
గడిచిన 24 గంటలలో 1,761 మంది కరోనా కారణంగా చనిపోయారు
తాజా మరణాలలో 82.74% పది రాష్ట్రాలకు చెందినవే. మహారాష్ట్రలో అత్యధికంగా 351 మరణాలు నమోదు కాగా ఆ తరువాత
స్థానంలో ఢిల్లీలో 240 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.
తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో గత 24 గంతలలో ఒక్క కొవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: లద్దాఖ్,
డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, త్రిపుర, సిక్కిం, మిజోరం, లక్షదీవులు, నాగాలాండ్, అండమాన్-నికోబార్ దీవులు,
అరుణాచల్ ప్రదేశ్
***
(Release ID: 1712840)
Visitor Counter : 212
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam