ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మే 1 నుంచి వేగంగా సరళీకృతంగా కోవిడ్-19 మూడవ దశ టీకాల కార్యక్రమం


సాధ్యమైనంత త్వరగా భారతీయలందరికి టీకాలను అంబాటులోకి తీసుకొని రాడానికి ఏడాది కాలంగా కృషి చేస్తున్నాము: ప్రధానమంత్రి

ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

టీకాల ధర, సేకరణ, అర్హత మరియు టీకాలను ఇచ్చే అంశంలో మూడవ దశలో మరింత సరళమైన విధానాలు

స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధిత వర్గాలకు స్వేచ్ఛ

18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కోవిడ్ -19 కు వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు

ఉత్పత్తిని ఎక్కువ చేయడానికి ఉత్పత్తిదారులకు ప్రోత్సాహం. జాతీయ అంతర్జాతీయ సంస్థలను ప్రోత్సహించడానికి చర్యలు

ముందు నిర్ణయించిన ధరకు తమ ఉత్పత్తిలో 50%న్ని రాష్ట ప్రభుత్వాలు, బహిరంగ మార్కెట్ కు సరఫరా చేయడానికి వాక్సిన్ ఉత్పత్తిదారులు అధికారం

ఉత్పత్తిదారుల నుంచి నేరుగా అదనంగా వాక్సిన్ ను కొనుగోలు చేయడానికి, 18 ఏళ్లు పైబడి వయస్సు వున్న ఎవరికైన వాక్సిన్ వేయడానికి రాష్ట్రాలకు అధికారం

ఇదివరకటి మాదిరిగానే హెచ్ సిడబ్ల్యు, ఏఫ్ఎల్డబ్ల్యు, 45 ఏళ్ల వయస్సు పైబడినవారు లాంటి గుర్తించిన, ప్రాధాన్యతా రంగాలకు కొనసాగనున్న ఉచిత వాక్సిన్

Posted On: 19 APR 2021 7:12PM by PIB Hyderabad

దేశంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ టీకాలు వేయడానికి అనుమతించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది. సాధ్యమైనంత త్వరగా అత్యధిక సంఖ్యలో భారతీయులకు వాక్సిన్ ఇచేలా గత సంవత్సరకాలంగా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నాడని ప్రధానమంత్రి తెలిపారు.  ప్రపంచంలో అత్యంత వేగంగా భారతదేశంలో టీకాల కార్యక్రమం అమలు జరుగుతున్నదని, ఇకపై కూడా మరింత వేగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు. 

దేశంలో టీకాల కార్యక్రమాన్ని అమలు చేయడానికి జాతీయస్థాయిలో ప్రభుత్వం కొవిడ్-19 టీకాల వ్యూహాన్ని 2020 ఏప్రిల్ నుంచి ప్రణాళికాబద్ధంగా, పరిశోధన, ఉత్పత్తి, సరఫరా అంశాలను సమన్వయం చేస్తూ అమలు చేస్తోంది. ప్రపంచంలో అతి పెద్ద టీకాల కార్యక్రమాన్ని ఎటువంటి సమస్యలు లేకుండా పెద్దఎత్తున వేగంగా అమలు చేయడానికి సుస్థిర కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతోంది. 

ప్రపంచంలో అమలులో ఉన్న ఉత్తమ విధానాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీచేసిన మార్గదర్శకాలు, అంటువ్యాధులను అరికట్టడానికి ఉపకరించే విధానాల ఆధారంగా జాతీయ స్థాయిలో నిపుణులు సభ్యులుగా ఏర్పాటైన బృందం పర్యవేక్షణలో కొవిడ్-19 టీకాల కార్యక్రమం అమలు జరుగుతోంది. 

వాక్సిన్ ల లభ్యత, ప్రాధాన్యతా వర్గాలకు టీకాలు వేసిన తరువాత మిగిలిన వారికి టీకాలను ఇవ్వాలన్న అంశాలపై ప్రభుత్వం సమగ్ర విధానాన్ని అనుసరిస్తోంది. ఏప్రిల్ 30వ తేదీ నాటికి వ్యాధి బారిన పడే అవకాశం వున్న వర్గాల్లో ఎక్కువ మందికి టీకాలను వేసే కార్యక్రమం పూర్తవుతుంది. 

జాతీయ కోవిడ్-19 వ్యూహం మొదటి దశ దేశంలో 2021 జనవరి 16వ తేదీన ప్రారంభమయింది. దీనిలో హెల్త్ కేర్ వర్కర్లు  (హెచ్‌సిడబ్ల్యు) మరియు ఫ్రంట్ లైన్  వర్కర్ల   (ఎఫ్‌ఎల్‌డబ్ల్యు) ను ప్రాధాన్యతా వర్గాలుగా గుర్తించి వీరికి రక్షణ కల్పించడానికి టీకాలను ఇచ్చారు. ఈ దశ విజయవంతం కావడంతో రెండో దశ టీకాల కార్యక్రమాన్ని 2021 మార్చి ఒకటవ తేదీన ప్రారంభించారు. దీనిలో వ్యాధి బారినపడే ప్రమాదం వున్న 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలను ఇవ్వడం ప్రారంభించారు. ఈ వయస్సు వున్నవారు కొవిడ్ బారిన ఎక్కువగా పడుతున్నారు. దేశంలో 80% కోవిడ్ మరణాలు ఈ వయస్సులో వున్నవారికి సంభవిస్తున్నాయని గుర్తించారు. ఈ దశలో సామర్ధ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రైవేట్ రంగ సహకారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. 

ప్రధానమంత్రి ఆదేశాల మేరకు సంబంధిత వర్గాలు, ఉత్పత్తిదారులు, పరిశోధనాసంస్థలు, నియంత్రణదారుల మధ్య సమన్వయం సాధించడం జరిగింది. ప్రైవేట్ రంగంలో వాక్సిన్ ఉత్పత్తిని ఎక్కువ చేయడానికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం, విప్లవాత్మక నిర్ణయాలు, పరిశోధనలు, పరీక్షలు లాంటి అంశాల ద్వారా చర్యలు అమలు చేస్తూ దేశంలో అమలులో వున్న నియంత్రణ విధానాల ద్వారా టీకాల లక్ష్యాన్ని సాధించడానికి సమగ్ర వ్యూహం అమలు జరుగుతోంది. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు ఉత్పత్తిదారులతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ, అవసరమైన నిధులను గ్రాంటులు, అడ్వాన్సుల రూపంలో అందిస్తూ ఉత్పత్తిని పెంపొందించడానికి కృషి చేసి విజయం సాధించింది. 

దీని ఫలితంగా రెండు దేశీయంగా తయారైన వ్యాక్సిన్లకు (సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు భారత్ బయోటెక్) అత్యవసర వినియోగ అనుమతులు జారీ అయ్యాయి.    ప్రస్తుతం విదేశాలలో తయారవుతున్న మూడవ వ్యాక్సిన్ (స్పుత్నిక్) త్వరలో భారతదేశంలో ఉత్పత్తి చేయబడుతుంది.

టీకాల కార్యక్రమంలో తొలుత నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగ సహకారాన్ని తీసుకొంటున్నది. వ్యవస్థలు, ప్రక్రియలు సుస్థిరత సాధించడంతో ఉత్పత్తిని మరింత ఎక్కువ చేయడానికి ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు సిద్ధంగా వున్నాయి. 

మూడవ దశ టీకాల కార్యక్రమాన్ని మరింత సరళంగా వేగంగా అమలు చేయాలని నిర్ణయించారు. టీకాలను ఎక్కువమందికి అందుబాటులోకి తేవడం, ధర అంశాలపై దృష్టి సారించడం జరిగింది. దీనివల్ల వాక్సిన్ ఉత్పత్తి ఎక్కువ కావడమే కాకుండా లభ్యత కూడా పెరుగుతుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థలు ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించడానికి వీలు కలుగుతుంది. ధరల నిర్ణయం, సేకరణ అర్హత, టీకాలను ఇచ్చే కార్యక్రమం స్థానిక అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా జరిగే విధంగా మూడవ దశను రూపొందించడం జరిగింది. 

2021 మే ఒకటవ తేదీ నుంచి అమలులోకి రానున్న జాతీయ కోవిడ్ టీకాల మూడవ దశ ముఖ్యమైన అంశాలు:-

 (i) వ్యాక్సిన్ తయారీదారులు తమ నెలవారీ ఉత్పత్తిలో సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ (సిడిఎల్)  విడుదల చేసిన మోతాదులలో 50% కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తారు.  మిగిలిన 50% మోతాదులను రాష్ట్ర ప్రభుత్వాలకు,  బహిరంగ మార్కెట్లో (ఇకపై భారత ప్రభుత్వ ఛానెల్ కాకుండా దీనిని సూచిస్తారు) సరఫరా చేయడానికి అనుమతి పొందుతారు. 

 (ii)పారదర్శకంగా ఉండడానికి 2021 మే ఒకటవ తేదీ లోగా తయారీదారులు తమ సరఫరాలో 50% ఉత్పత్తుల ధరను ముందుగానే ప్రకటిస్తారు.  ధరను ముందస్తుగా ప్రకటిస్తారు, అది రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉంటుంది.  మరియు 1 మే 2021 కి ముందు బహిరంగ మార్కెట్లో. ఈ ధర ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆసుపత్రులు, పారిశ్రామిక సంస్థలు మొదలైనవి తయారీదారుల నుంచి తమకు అవసరమైన వ్యాక్సిన్ మోతాదులను కొనుగోలు చేస్తాయి.   ప్రైవేట్ ఆస్పత్రులు తమ కోవిడ్ -19 వ్యాక్సిన్ సరఫరాను ప్రభుత్వం కాకుండా ఇతర వాటికి  ప్రత్యేకంగా కేటాయించిన 50% సరఫరా నుంచి  తీసుకోవలసి ఉంటుంది.   ప్రైవేట్ టీకా సరఫరాదారులు తాము నిర్ణయించిన ధరలను పారదర్శకంగా ప్రకటించవలసి ఉంటుంది. ఈ తరగతిలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ టీకాలను తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. 

 (iii)కేంద్ర ప్రభుత్వ టీకాల కేంద్రాల్లో  టీకాలు వేయడం మునుపటిలా కొనసాగుతుంది.  ఇంతకుముందు ప్రకటించిన  విధంగా అర్హతగల జనాభాకు హెల్త్ కేర్ వర్కర్స్ (హెచ్‌సిడబ్ల్యు), ఫ్రంట్ లైన్ వర్కర్స్ (ఎఫ్‌ఎల్‌డబ్ల్యు) మరియు 45 ఏళ్లు పైబడిన ప్రజలందరికీ ఉచితంగా టీకాలను వేయడంకొనసాగుతుంది. 

(iv) టీకాల కార్యక్రమం జాతీయ కార్యక్రమంగా ( ప్రభుత్వం మరియు ప్రభుత్వేతర వ్యవస్థలు) అమలు జరుగుతుంది. నిర్దేశించిన అన్ని నిబంధనలు,మార్గదర్శకాలకు లోబడి ఈ కార్యక్రమం అమలు జరుగుతుంది. అన్ని టీకాల కేంద్రాల్లో టీకాల ధరలు, లభ్యతను తెలియజేయవలసి ఉంటుంది. 

 (v)దేశంలో ఉత్పత్తి అవుతున్న అన్ని వ్యాక్సిన్లకు టీకా సరఫరా విభజన 50% ప్రభుత్వానికి.  భారతదేశం మరియు 50% ప్రభుత్వం కాకుండా వర్తిస్తుంది.   దిగుమతి చేసుకున్న పూర్తిగా వ్యాక్సిన్లను ప్రభుత్వేతర వ్యవస్థలో వాడటానికి  ప్రభుత్వం అనుమతిస్తుంది.  

 (vi)కేంద్ర ప్రభుత్వం తన  వాటా నుంచి  ఇన్ఫెక్షన్ పరిధి (క్రియాశీల కోవిడ్ కేసుల సంఖ్య), పనితీరు (పరిపాలన వేగం)  ప్రమాణాల ఆధారంగా రాష్ట్రాలు / యుటిలకు వ్యాక్సిన్లను కేటాయిస్తుంది.  టీకా యొక్క వ్యర్థం కూడా ఈ ప్రమాణంలో పరిగణించబడుతుంది. వృధాగా పోయే టీకాల పరిమాణం కేటాయింపులపై ప్రతికూల అంశంగా ఉంటుంది. .  పై ప్రమాణాల ఆధారంగా రాష్ట్రాల వారీగా కోటా నిర్ణయించబడుతుంది మరియు ముందుగానే రాష్ట్రాలకు తెలియజేయబడుతుంది. 

 

 (vii)  అన్ని ప్రాధాన్యతా తరగతులకు  అంటే 45 ఏళ్లు పైబడిన వారికి,  హెచ్‌సిడబ్ల్యులు, ఎఫ్‌ఎల్‌డబ్ల్యులకు రెండవ డోసు నిర్దిష్ట సమయంలో ఇవ్వబడుతుంది.   దీని కోసం ఒక నిర్దిష్ట మరియు కేంద్రీకృత వ్యూహ వివరాలను సంబంధిత వర్గాలకు ముందుగానే తెలియజేయబడుతుంది.

 (viii) ఈ విధానం 2021 మే 1 నుంచి  అమల్లోకి వస్తుంది. ఇది ఎప్పటికప్పుడు సమీక్షించబడుతుంది. 

 

***(Release ID: 1712779) Visitor Counter : 332