మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ప్రపంచంలో తొలిసారిగా ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు అందరికి అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం ప్రభావం చూపే సూక్ష్మజీవుల నివారిణి ' డ్యురోకియా'ఆవిష్కరించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి


189 రూపాయల నుంచి అందుబాటులో ఉండే తదుపరితరం సూక్ష్మజీవుల నివారిణి ' డ్యురోకియా' 99.99% సూక్ష్మజీవులను నిర్మూలించి ఉపయోగించిన 35 రోజుల వరకు ప్రభావం చూపుతుంది--- శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’

Posted On: 16 APR 2021 3:00PM by PIB Hyderabad

ప్రపంచంలో తొలిసారిగా ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు సూక్ష్మజీవులను నిర్మూలించడానికి తక్కువ ఖర్చుతో ఎక్కువకాలం ప్రభావం చూపే విధంగా అభివృద్ధి చేసిన  ' డ్యురోకియా' సిరీస్ ను కేంద్రవిద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ఈ రోజు వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్  బయోమెడికల్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ఎఫోకేర్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు డాక్టర్ జ్యోత్స్నేండు గిరి నాయకత్వంలో పరిశోధకులు దీనిని అభివృద్ధి చేశారు. దీనిని ఐటిఐసి, ఐఐటి హైదరాబాద్ లో పరీక్షించి కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని సమర్ధంగా ఎదుర్కొనేలా అభివృద్ధి చేశారు. వినూత్నంగా ఎక్కువకాలం ప్రభావం చూపేలా  ' డ్యురోకియా' సిరీస్ ను పరిశోధకులు అభివృద్ధి చేశారు.  ' డ్యురోకియా' ఆవిష్కరణ కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ బోర్డ్ అఫ్ గవర్నర్స్ చైర్మన్ శ్రీ. బి. వి. ఆర్. మోహన్ రెడ్డి, ఈఎస్ఐసి  మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, హైదరాబాద్  వ్యవస్థాపక డీన్   ప్రొఫెసర్ ఎం.శ్రీనివాస్, హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బి. ఎస్. మూర్తి, ఐఐటీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ రమేష్ పోఖ్రియాల్ భారత దేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధిసాధించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరెంద్రమోది ఆశయాలకు అనుగుణంగా  ' డ్యురోకియా'ను అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. తదుపరి తరానికి చెందిన ఈ ' డ్యురోకియా' సూక్ష్మక్రిములను అతి తక్కువ ఖర్చుతో నిర్మూలిస్తుంది అన్నారు. 189 రూపాయల ఖరీదు చేసే ' డ్యురోకియా' 99.99% క్రిములను వెంటనే నిర్మూలిస్తుందని వాడిన 35 రోజుల వరకు ప్రభావం చూపిస్తుందని మంత్రి వివరించారు. ఉపయోగించిన వెంటనే క్రిములను ( 60 సెకన్లలో) నిర్మూలించి, ఎక్కువ కాలం ప్రభావం చూపే ' డ్యురోకియా' ప్రస్తుత విపత్కర పరిస్థితిలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.సూక్ష్మ క్రిములను నిర్మూలించడానికి ' డ్యురోకియా' పనిచేసే విధానాన్ని కేంద్రప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రయోగశాలు పరీక్షించి ఆమోదించాయని, దీనిని హైదరాబాద్ ఐఐటీ ప్రాంగణంలో పరీక్షించారని ఆయన అన్నారు. 

  ' డ్యురోకియా'ని అభివృద్ధి చేసిన పరిశోధకులను అభినందించిన మంత్రి ఇటువంటి విప్లవాత్మక ఆవిష్కరణలకు హైదరాబాద్ ఐఐటీ వేదిక కావాలని అన్నారు. 

హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బి. ఎస్. మూర్తి ప్రజలకు ప్రయోజనం కలిగించే ఉత్పత్తుల పరిశోధనల్లో తమ సంస్థ ముందుంటుందని అన్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో తమ సంస్థ తక్కువ ఖర్చుతో వెంటిలేటర్లు, సమర్ధంగా పనిచేసే మాస్కులను, మొబైల్ యాపులను, వేగంగా కోవిడ్ పరీక్షలు నిర్వహించే కిట్లను అభివృద్ధి చేసి అందించిందని ఆయన చెప్పారు. కోవిడ్ నిర్మూలనకు సాగుతున్న ప్రయత్నాలకు తాము కొత్తగా అభివృద్ధి చేసిన  ' డ్యురోకియా' ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ప్రజాసంక్షేమం కోసం జరిగిన ఆవిష్కరణగా ఆయన ' డ్యురోకియా' ను అభివర్ణించారు. 

వినూత్నమైన “డురోకియా టెక్నాలజీ” ను ఉపయోగించి దురోకియా ఎస్, డురోకియా ఎమ్, డురోకియా హెచ్, మరియు డురోకియా హెచ్ ఆక్వాలను అభివృద్ధి చేశారు. కోవిడ్-19 వైరస్ ను వ్యాప్తి చేసే క్రిములను ఇవి వేగంగా సంహరిస్తాయి. క్షేత్ర స్థాయిలో పరీక్షించిన ఈ ఉత్పత్తులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రయోగశాలలు ఆమోదించాయి. 

ఈ ఉత్పత్తుల పూర్తి వివరాలు www.keabiotech.com లో అందుబాటులో ఉంటాయి. 

అత్యంత సమర్ధంగా పనిచేస్తూ అందరికి అందుబాటులో వుండే విధంగా వీటిని ఐఐటి హైదరాబాద్ బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం డాక్టర్ జ్యోత్స్నేండు గిరి నేతృత్వంలోని బృందం అభివృద్ధి చేసింది.  డాక్టర్ సునీల్ కుమార్ యాదవ, డాక్టర్ ఖాసిమ్ ఎమ్, శ్రీమతి మీనాక్షి చౌహాన్, మరియు శ్రీమతి రూబీ సింగ్, శ్రీమతి సుపర్ణబాసు, శ్రీమతి ఉజ్మా హసన్, శ్రీ జయకుమార్ మరియు డాక్టర్ పురంది రూప మణి  ఈ ఆవిష్కరణ బృందంలో సభ్యులుగా వున్నారు. 

***



(Release ID: 1712264) Visitor Counter : 195