ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశంలో 11.44 కోట్లు దాటిన మొత్తం టీకాల పంపిణీ
గత 24 గంటలలో 33 లక్షలకు పైగా టీకాలు
10 రాష్ట్రాలనుంచే 81% కొత్త కోవిడ్ కేసులు
చికిత్సలో ఉన్నవారిలో 67.16% మంది ఐదు రాష్ట్రాలవారే
Posted On:
15 APR 2021 12:33PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా వేసిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య ఈ రోజు 11.44 కోట్లు దాటింది. ఏప్రిల్ 11 నుంచి 11 వరకు నాలుగు రోజులపాటు పాటించిన టీకా ఉత్సవ్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల సిబ్బందికి టీకాలిచ్చారు. టీకా ఉత్సవ్ వలన టీకాల సంఖ్య ఒక్క సారిగా కోటీ 28 లక్షల 98 వేల 314 డోసులు పెరిగింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 16,98,138 శిబిరాల ద్వారా 11,44,93,238 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో 90,64,527 డోసులు ఆరోగ్య సిబ్బంది కిచ్చిన మొదటి డోసులు, 56,04,197 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన 1,02,13,563 మొదటి డోసులు, 50,64,862 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన 4,34,71,031 మొదటి డోసులు, 27,47,019 రెండో డోసులు, 45-6- ఏళ్ళ మధ్య ఉన్నవారికిచ్చిన 3,74,30,078 మొదటి డోసులు, 8,97,961 రెండో డోసులు ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ళ్ళ మధ్య వారు
|
60 పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
90,64,5287
|
56,04,197
|
1,02,13,563
|
50,64,862
|
3,74,30,078
|
8,97,961
|
4,34,71,031
|
27,47,019
|
11,44,93,238
|
మొత్తం కోవిడ్ టీకాలలో 59.76% వాటా ఎనిమిది రాష్ట్రాలదే కావటం గమనార్హం.
ఈ ఎనిమిది రాష్ట్రాలలో ఇచ్చిన టీకా డోసుల సమాచారాన్ని ఈ క్రింది చిత్రపటం చూపుతుంది.
గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 33 లక్షలకు పైగా టీకా డోసులు ఇచ్చారు.
టీకాల కార్యక్రమం మొదలైన 89వ రోజైన ఏప్రిల్ 14 నాడు 33,13,848 టీకాలిచ్చారు. అందులో 28,77,473 మంది లబ్ధిదారులు 44,864 శిబిరాల ద్వారా మొదటి డోస్ అందుకోగా 4,36,375 మంది రెండో డోస్ తీసుకున్నారు.
తేదీ: ఏప్రిల్ 14, 2021 (89వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ మధ్యవారు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
15,841
|
23,125
|
77,321
|
54,089
|
17,79,634
|
79,626
|
10,04,677
|
2,79,535
|
28,77,473
|
4,36,375
|
భారత్ లో రోజువారీ కోక్రింవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటలలో 2,00,739 కొత్త కరోనా కేసులు వచ్చాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, చత్తీస్ గఢ్, కర్నాటక, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ తో కూడిన 10 రాష్ట్రాలలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రాలవాటా 80.76% కాగా మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో 58,952 కేసులు, ఉత్తరప్రదేశ్ లో 20,439, ఢిల్లీలో 17,282 కేసులు వచ్చాయి.
క్రింద చూపిన విధంగా పదహారు రాష్టాలలొ కోవిడ్ కేసుల పెరుగుదల కనబడుతోంది.
భారత దేశంలో మొత్తం చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు 14,71,877 కు చేరాయి. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 10.46%. గత 24 గంటలలో నికరంగా చికిత్సలో ఉన్న కేసులు గత 24 గంటలలో 1,06,173 పెరిగాయి. ఐదు రాష్ట్రాలు - మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, కేరళ కలిసి చికిత్సలో ఉన్న కేసులలో 67.16% వాటా ఉండటం గమనార్హం. ఒక్క మహారాష్ట్రలోనే 43.54% వాటా కెసులు ఉండటం చెప్పుకోదగిన పరిణామం.
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 1,24,29,564 కు చేరింది. జాతీయ సగటు కోలుకున్నవారి శాతం 88.31%.
గడిచిన 24 గంటలలో 93,52 8 మంది కోవిడ్ నుంచి కోలుకొని బైటపడ్దారు.
గత 24 గంటలలో 1,038 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఇందులో పది రాష్ట్రాలవాటా 82.27% కాగా, మహారాష్ట్రలో అత్యధికంగా 278 మంది, ఆ తరువాత చత్తీస్ గఢ్ లో 120 మంది కోవిడ్ తో చనిపోయారు.
గత 24 గంటలలో కోవిడ్ తో చనిపొయినవారు ఒక్కరు కూడా లేని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తొమ్మిది ఉన్నాయి. అవి: డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మొజోరణ్, మణిపూర్, లక్షదీవులు, అరుణాచల్ ప్రదేశ్
****
(Release ID: 1712029)
Visitor Counter : 221
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam