ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఇతర దేశాల్లో అత్యవసర వినియోగానికి అధికారం (ఈయుఎ) పొందిన టీకాలకు దేశంలో అత్యవసర అనుమతులు ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం


దేశంలో టీకాల లభ్యతను ఎక్కువ చేసి టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఎక్కువమందికి అందుబాటులోకి తీసుకుని రావడానికి కేంద్రం తాజా నిర్ణయం

Posted On: 13 APR 2021 1:11PM by PIB Hyderabad

కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టి వ్యాధి ప్రబలకుండా చూడటానికి కేంద్రం సమగ్ర విధానాన్ని అనుసరిస్తోంది. దేశంలో వాక్సిన్ ని  ఉత్పత్తి, పరిశోధనలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం 2020 మేలో ముఖ్య శాస్త్రీయ సలహాదారుని నేతృత్వంలో పనిచేసే ఒక టాస్క్ ఫోర్స్ ని నెలకొల్పింది. ఆ తరువాత వాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నీతి ఆయోగ్ సభ్యుని అధ్యక్షతన 2020 ఆగస్ట్ నెలలో నిపుణుల బృందాన్ని నెలకొల్పింది. ఈ చర్యల వల్ల దేశంలో టీకాల కార్యక్రమాన్ని చేపట్టడానికి " భారతదేశంలో తయారైన" రెండు వాక్సిన్ లు అందుబాటులోకి తెచ్చిన తొలిదేశంగా భారతదేశం గుర్తింపు పొందింది. 

కోవిడ్ ను అరికట్టి, అదుపు చేయడానికి కేంద్రం టీకాల కార్యక్రమాన్ని ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తోంది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బిబిఐఎల్) ఉత్పత్తి చేస్తున్నకోవాక్సిన్ కు, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ కు  అత్యవసర వినియోగ అధికారాన్ని (ఇయుఎ) నేషనల్ రెగ్యులేటర్ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి మంజూరు చేసింది. 

దేశంలో టీకాలను మరింతగా అంబాటులోకి తెచ్చి, టీకాల కార్యక్రమాన్ని మరింత వేగంగా అమలు చేయడానికి అమలు చేయవలసిన చర్యలను 2021 ఏప్రిల్ 11వ తేదీన నీతి ఆయోగ్ సభ్యుడు ( ఆరోగ్యం) అధ్యక్షతన సమావేశమైన వాక్సిన్ లపై ఏర్పాటైన జాతీయ నిపుణుల బృందం 23వ సమావేశంలో చర్చించారు. 

వాక్సిన్ అంశాన్ని లోతుగా చర్చలు జరిపిన నిపుణుల బృందం కోవిడ్-19 కోసం అభివృద్ధి చేసి ఉత్పత్తి అవుతూ పరిమితమైన అత్యవసర వినియోగానికి అనుమతి పొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ జాబితాలో వున్న అమెరికా ఎఫ్డియే, ఈఎంఏ, బ్రిటన్ ఎంహెచ్ ఆర్ ఏ, జపాన్ పీఎండీఎ లకు భారతదేశం అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని సిఫార్సు చేసింది. కొత్త డ్రగ్స్ మరియు  క్లినికల్ ట్రయల్స్ నియమాలు 2019లోని  రెండవ షెడ్యూల్లో  సూచించిన విధంగా స్థానిక క్లినికల్ ట్రయల్ నిర్వహించే స్థానంలో పోస్ట్-అప్రూవల్ సమాంతర బ్రిడ్జింగ్ క్లినికల్ ట్రయల్ ను తప్పనిసరిగా పాటించాలన్న నిబంధనను బృందం విధించింది. 

ఇంతేకాకుండా, విదేశీ టీకాలను తీసుకున్న తొలి 100 మంది లబ్ద్ధిదారులను భద్రతా ఫలితాల కోసం ఏడు రోజులు అంచనా వేసిన తరువాత మాత్రమే వీటిని దేశవ్యాపితంగా వినియోగించడానికి అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. 

నిపుణుల బృందం చేసిన సిఫార్సులను అన్ని కోణాల నుంచి అధ్యయనం చేసిన కేంద్రం వీటికి ఆమోదం తెలిపింది. 

కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల విదేశాల్లో తయారైన టీకాలు త్వరితగతిన అందుబాటులోకి రావడమే కాకుండా, మందుల తయారీకి అవసరమైన దిగుమతులను ప్రోత్సహించి, దేశంలో ఉత్పత్తులను ఎక్కువ చేయడానికి అవకాశం కలుగుతుంది. దీనివల్ల వాక్సిన్ ల ఉత్పత్తి సామర్ధ్యం మెరుగుపడి దేశంలో వినియోగానికి వాక్సిన్ లు అందుబాటులోకి వస్తాయి. 

 

***



(Release ID: 1711548) Visitor Counter : 276