ప్రధాన మంత్రి కార్యాలయం

డ్యూక్ ఆఫ్‌ ఎడిన్‌ బ‌ర్గ్ మాన్య శ్రీ ప్రిన్స్ ఫిలిప్ క‌న్నుమూత ప‌ట్లసంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి‌

నాడు పోస్టు చేయడమైనది: 09 APR 2021 5:26PM by PIB Hyderabad

డ్యూక్ ఆఫ్‌ ఎడిన్‌ బ‌ర్గ్ మాన్య శ్రీ ప్రిన్స్ ఫిలిప్ మృతి ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బ్రిటిషు ప్ర‌జ‌ల‌ కు, రాజ‌కుటుంబాని కి త‌న సంతాపాన్ని తెలిపారు.

‘‘డ్యూక్ ఆఫ్‌ ఎడిన్‌ బ‌ర్గ్ మాన్య శ్రీ ప్రిన్స్ ఫిలిప్ మ‌ర‌ణించిన సంద‌ర్భం లో బ్రిటిషు ప్ర‌జ‌ల కు, రాజ కుటుంబానికి క‌లిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. సైన్యం లో ఆయనదో విశిష్ట‌మైన కెరియర్; అనేక సాముదాయిక సేవా కార్య‌క్ర‌మాల లో ఆయన అగ్ర‌భాగాన నిల‌చారు. ఆయ‌న ఆత్మ కు శాంతి ల‌భించుగాక’’ అని ఒక ట్వీట్ లో శ్రీ న‌రేంద్ర మోదీ పేర్కొన్నారు.

***

 

 


(రిలీజ్ ఐడి: 1710759) సందర్శకుల సూచీ సంఖ్య : : 175