ఆర్థిక మంత్రిత్వ శాఖ
2020-21 ఆర్థిక సంవత్సరానికి తాత్కాలిక ప్రత్యేక్ష పన్ను వసూళ్లు దాదాపు 5% వృద్ధిని చూపుతోంది
2020-21 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాలు రూ.9.05 లక్షల కోట్లు 104.46% ప్రత్యక్ష పన్నులను సూచిస్తుంది
2020-21 ఆర్థిక సంవత్సరం కోసం అడ్వాన్స్ టాక్స్ వసూలు రూ. 4.95 లక్షల కోట్లు జరిగింది, ఇది సుమారు 6.7% వృద్ధిని చూపుతుంది
ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ -19 మహమ్మారి తీసుకువచ్చిన స్వాభావిక సవాళ్లు ఉన్నప్పటికీ, 2020-21 సంవత్సరానికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరిగాయి.
2020-21 సంవత్సరంలో రూ .2.61 లక్షల కోట్లు తిరిగి చెల్లించడం జరిగింది
Posted On:
09 APR 2021 12:22PM by PIB Hyderabad
2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నువసూళ్ల తాత్కాలిక గణాంకాల ప్రకారం నికర వసూళ్లు రూ. 9.45 లక్షల కోట్లుగా నమోదయింది. నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కార్పొరేషన్ టాక్స్ (సిఐటి) రూ .4.57 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్ను (పిఐటి) సహా సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టిటి) రూ. 4.88 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. నికర ప్రత్యక్ష పన్ను 2020-21 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాలలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ. 9.05 లక్షల కోట్లు అంటే 104.46%గా నమోదయింది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల స్థూల సేకరణ (వాపసు కోసం సర్దుబాటు చేయడానికి ముందు) రూ .12.06 లక్షల కోట్లు. ఇందులో కార్పొరేషన్ టాక్స్ (సిఐటి) రూ. 6.31 లక్షల కోట్లు, సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టిటి) తో సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను (పిఐటి) రూ. 5.75 లక్షల కోట్లు; అడ్వాన్స్ టాక్స్ రూ. 4.95 లక్షల కోట్లు; పన్ను (సెంట్రల్ టిడిఎస్‌తో సహా) రూ. 5.45 లక్షల కోట్లు; స్వీయ-అంచనా పన్ను రూ. 1.07 లక్షల కోట్లు; రెగ్యులర్ అసెస్‌మెంట్ టాక్స్ రూ. 42,372 కోట్లు; డివిడెండ్ పంపిణీ పన్ను రూ. 13,237 కోట్లు, ఇతర మైనర్ హెడ్ల కింద పన్ను రూ. 2,612 కోట్లు నమోదయ్యాయి.
చాలా సవాలుగా ఉన్న సంవత్సరం అయినప్పటికీ, 2020-21 ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్స్ టాక్స్ వసూలు రూ .4.95 లక్షల కోట్లుగా ఉంది, ఇది ముందు ఆర్థిక సంవత్సరం అడ్వాన్స్ పన్ను వసూళ్లు రూ. 4.64 లక్షల కోట్లు కంటే 6.7% వృద్ధి రేటును సూచిస్తుంది. రూ. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2.61 లక్షల కోట్లు తిరిగి వెనక్కి చెల్లించారు. మునుపటి ఆర్థిక సంవత్సరం 2019-20 తో పోలిస్తే సుమారు 42.1% పెరుగుదలను సూచిస్తూ 1.83 లక్షల కోట్లు రిఫండ్ చెల్లించడం జరిగింది.
పై గణాంకాలు ఇంకా తాత్కాలికమైన డేటా, తుది సేకరణ పెండింగ్‌లో ఉన్నాయి.
***
(Release ID: 1710675)
Visitor Counter : 291