ప్రధాన మంత్రి కార్యాలయం

జల వాయు అంశాలపై అమెరికా అధ్యక్షుని ప్రత్యేక దూత శ్రీ జాన్ కేరీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో భేటీ అయ్యారు

Posted On: 07 APR 2021 8:34PM by PIB Hyderabad

జల వాయు అంశాలపై అమెరికా అధ్యక్షుని ప్రత్యేక దూత శ్రీ జాన్ కేరీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న సమావేశమయ్యారు.

శ్రీ కేరీ అధ్యక్షుడు శ్రీ బైడెన్ తరఫు న ప్రధాన మంత్రి కి శుభాకాంక్షలు తెలిపారు.  క్వాడ్ నేత ల శిఖర సమ్మేళనం సహా ఇటీవలి కాలం లో అధ్యక్షుడు శ్రీ బైడెన్ ‌తో జరిపిన సంభాషణల ను ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు.  అధ్యక్షుడు శ్రీ బైడెన్ కు, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గారి కి తన తరఫు న శుభాకాంక్షలు అందజేయవలసిందంటూ శ్రీ కేరీ ని శ్రీ మోదీ కోరారు.

భారతదేశం లో గడచిన రెండు రోజులలోను జరిగిన సఫల, ఉత్పాదక చర్చల ను గురించి ప్రధాన మంత్రి కి శ్రీ కేరీ వివరించారు.  భారతదేశం చేపట్టిన ప్రతిష్టాత్మక నవీకరణ యోగ్య శక్తి పథకం సహా జలవాయు సంబంధిత చర్యల పట్ల ఆయన సానుకూలం గా స్పందించారు.  జలవాయు అంశాల పై ఈ నెల  22వ, 23వ తేదీలలో జరుగనున్న నేత ల శిఖర సమ్మేళనాన్ని గురించి ఆయన ప్రధాన మంత్రి కి  టూకీ గా వెల్లడించారు.

భారతదేశం పారిస్ ఒప్పందానికి అనుగుణం గా జాతీయ స్థాయి లో నిర్ధారిత సహకారాన్ని అందించడానికి కట్టుబడి ఉందని, ఈ కట్టుబాటుల ను నెరవేర్చే దిశ లో ముందడుగు వేస్తున్న కొన్ని దేశాలలో భారతదేశం ఒకటని ప్రధాన మంత్రి అన్నారు.  అమెరికా తన వైపు నుంచి భారతదేశం హరిత సాంకేతిక విజ్ఞానాన్ని తక్కువ ఖర్చు లో విస్తరించేందుకు, భారతదేశం ఆశిస్తున్నటువంటి ఆర్థిక సహాయాన్ని అందుబాటు లో ఉంచడం ద్వారా భారతదేశ జలవాయు పతకాలకు పూర్తి సమర్థన ను ఇస్తుందని శ్రీ కేరీ అన్నారు.  ప్రత్యేకించి హరిత సాంకేతిక విజ్ఞానం సంబంధిత నూతన ఆవిష్కరణలను వేగం గా అమలులోకి తీసుకు రావడం లో భారతదేశానికి, అమెరికా కు మధ్య సహకారం ఇతర దేశాల పై సకారాత్మక ప్రభావాన్ని ప్రసరించగలుగుతుందనే విషయం లో ప్రధాన మంత్రి సమ్మతి ని వ్యక్తం చేశారు.

 


 

***


(Release ID: 1710341) Visitor Counter : 224