ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ ఆరోగ్య దినం సందర్భం లో ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశం
Posted On:
07 APR 2021 9:51AM by PIB Hyderabad
ప్రపంచ ఆరోగ్య దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశం తాలూకు పాఠం ఈ కింది విధం గా ఉంది.
‘‘అగ్ర స్థాయి నాణ్యత కలిగిన ఆరోగ్య సంరక్షణ సేవల ను తక్కువ ఖర్చు లో ప్రజల కు అందుబాటు లో ఉంచేందుకు ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన్ ఔషధి యోజన లు సహా లెక్కలేనన్ని చర్యల ను భారత ప్రభుత్వం అమలుపరుస్తోంది. కోవిడ్-19 కి వ్యతిరేకం గా జరుగుతున్న పోరాటాన్ని పటిష్టపరచడం కోసం ప్రపంచం లోకెల్లా అత్యంత భారీదైన టీకాకరణ ఉద్యమాన్ని కూడా భారతదేశం నడుపుతోంది.
మాస్కు ను ధరించడం, చేతుల ను క్రమం తప్పక శుభ్రపరచుకొంటూ ఉండటం వంటి ఇతర జాగ్రత్తల ను అనుసరిస్తూ కోవిడ్-19 తో పోరాడటానికి సాధ్యమైన అన్ని ముందు జాగ్రత్త లను పాటించే విషయం లో మనం ప్రపంచ ఆరోగ్య దినం సందర్భం లో శ్రద్ధ తీసుకొందాం.
అదే కాలం లో, వ్యాధి నిరోధ శక్తి ని పెంచేందుకు, శరీరాన్ని దృఢం గా ఉంచుకొనేందుకు అన్ని చర్యల ను తీసుకోగలరు.
మన ప్రపంచాన్ని ఆరోగ్యదాయకమైంది గా నిలబెట్టడానికి రాత్రనక పగలనక పాటుపడుతున్న వారందరికీ మన అభినందనల ను, మన కృతజ్ఞత ను పునరుద్ఘాటించడానికి ఉద్దేశించిందే ప్రపంచ ఆరోగ్య దినం. ఈ దినం ఆరోగ్య సంరక్షణ సంబంధిత పరిశోధనల ను, నూతన ఆవిష్కరణల ను బలపరచడం లో మన నిబద్ధత ను మరో మారు నొక్కిచెప్పేందుకు ఉద్దేశించిన దినం కూడా.’’
***
(Release ID: 1710020)
Visitor Counter : 241
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam