ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 7.3 కోట్లు దాటిన కోవిడ్ టీకాలు 8 రాష్టాల్లో భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసులు


రాష్ట్రాలతో కోవిడ్ పరిస్థితిపై కాబినెట్ కార్యదర్శి సమీక్ష

Posted On: 03 APR 2021 11:29AM by PIB Hyderabad

కోవిడ్ మీద పొరులో భాగంగా దేశవ్యాప్తంగా అమలవుతున్న కోవిడ్ టీకాల కార్యక్రమంలో ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 7.3 కోట్లు దాటింది.  ఈ ఉదయం 7 గంటలవరకు 11,53,614 శిబిరాల ద్వారా 7,30,54,295 టీకాలిచ్చారు. ఇందులో 89,32,642 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన మొదటి డోసులు, 52,96,666 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన రెండో డోసులు, 95,71,610 డోసులు కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసులు, 39,92,094 డోసులు  కోవిడ్ యోధులకిచ్చిన రెండో డోసులు, 4,45,77,337 డొసులు 45 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన మొదటీ డోసులు,   6,83,946 డోసులు 45 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన రెండో డోసులు కలిసి ఉన్నాయి.  ఇందులో డోసులవారీగా చూస్తే  ఆరు కోట్లకు పైగా (6,30,81,589) మొదటి డోసులు, దాదాపు కోటి  (99,72,706) రెండో డోసులు ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 ఏళ్ళు పైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

89,32,642

52,96,666

95,71,610

39,92,094

4,45,77,337

6,83,946

7,30,54,295

 

టీకాల కార్యక్రమం మొదలైన 77వ రోజైన ఏప్రిల్2న 30,93,795 టీకాలిచ్చారు. అందులో   28,87,779 మంది లబ్ధిదారులకు 35,624 శిబిరాల ద్వారా మొదటి డోస్ ఇవ్వగా 2,06,016 లబ్ధిదారులకు  రెండో డోస్ టీకా ఇచ్చారు.

Date: 2nd April,2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

43,439

18,712

92,887

44,569

27,51,453

1,42,735

28,87,779

2,06,016

 

ఎనిమిది రాష్టాలు - మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్ గఢ్, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ పంజాబ్, మధ్యప్రదేశ్ లలో రోజువారీ కొత్త కోవిడ్ కేసులు బాగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటలలో కొత్తగా నమోదైన 89,129 కేసులలో 81.42% ఈ ఎనిమిది రాష్టాలలోనే కావటం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధికంగా 47,913 కేసులు రాగా, కర్నాటకలో 4,991, చత్తీస్ గఢ్ లో  4,174 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

ఈ దిగువ చూపిన విధంగా 12 రాష్ట్రాలలో కొత్త కేసుల పెరుగుదల నమోదవుతూ ఉంది.

 

 

 

దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య   6,58,909 కు చేరుకోగా ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 5.32%. గత 24 గంటలలో నికరంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య  44,213 పెరిగింది. మొదటి 10 రాష్టాలలో గత రెండు నెలలకాలంలో (ఫిబ్రవరి 3- ఏప్రిల్ 03) మధ్య  నికరంగా పెరిగిన కేసులను ఈ దిగువ చిత్రపటం  చూపుతోంది. మహారాష్ట్రలో ఈ కాలంలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య 9 రెట్ల పెరుగుదల కనబరచింది. శాతాలవారీగా చూస్తే పంజాబ్ లో అత్యధికశాతం చికిత్సలో ఉన్నవారి పెరుగుదల నమోదైంది.

ఐదు రాష్టాలు – మహారాష్ట, కర్నాటక, చత్తీస్ గఢ్, కేరళ, పంజాబ్ కలిసి మొత్తం దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కేసులలో 77.3% వాటా ఉండగా ఒక్క మహరాష్ట్రలోనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కోవిడ్ బాధితులలో  60% మేరకు (59.36%) మంది ఉన్నారు.   

 

జిల్లాల వారీగా చూస్తే దేశవ్యాప్తంగా ఉన్న కోవిడ్ బాధితులలో 50% పైగా కేవలం  10 జిల్లాల్లోనే కేంద్రీకృతమై ఉన్నారు. 

వివిధ రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పోలీస్ డైరెక్టర్ జనరల్స్, ఆరోగ్య కార్యదర్శులతో కాబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా నిన్న ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా గత రెండు వారాలలో కరోనా కేసుల పరిస్థితి కలవరం కలిగిస్తున్న 11 రాష్ట్రాలమీద ప్రధానంగా దృష్టి సారించారు. ఈ 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను తీవ్రత ఆందోళనకరంగా ఉన్నవిగా గుర్తించి తక్షణన్ చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు.  చికిత్సలో ఉన్నవారికి మెరుగైన చికిత్స అందించటం, మరణాలను నిలువరించటం మీద దృష్టి పెట్టాలని కోరారు. పరీక్షల సంఖ్య పెంచాలని, కఠినమైన నియమ్త్రణావిధానాలు పాటించాలని, వ్యాధిసోకే అవకాశమున్నవాళ్లను గుర్తించాలని, కోవిడ్ నియంత్రణకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు పాటించేట్టు చూడాలని కోరారు. అదే విధంగా, ఇంతకు ముందే రాష్ట్రాలకు సూచించిన విధంగా ప్రామాణిక చికిత్సావిధానాలు అవలంబించాలని, కేంద్రం అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎప్పటిలాగానే అన్ని రకాల వైద్య పరమైన  సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.   

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోవిడ్ బారినుంచి కోలుకొని బైటపడినవారు 1,15,69,241  మంది కాగా కోలుకున్నవారి శాతం 93.36%. గడిచిన 24 గంటలలో 44,202 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.

గత 24 గంటలలో 714 మంది కోవిడ్ బాధితులు చనిపోయారు. ఇందులో 85.85% మంది ఆరు రాష్టాలకు చెందినవారే కావటం గమనార్హం. మహారాష్టలో అత్యధికంగా 481 మంది చనిపోగా పంజాబ్ లో 57 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.  

 

గత 24 గంటలలో పదమూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: ఒడిశా, అస్సాం, లద్దాఖ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, సిక్కిం, లక్షదీవులు, మిజోరం, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్ 

***



(Release ID: 1709347) Visitor Counter : 250