మంత్రిమండలి
సాధికార "టెక్నాలజీ గ్రూపు" ఏర్పాటు కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
19 FEB 2020 4:42PM by PIB Hyderabad
సాధికార "టెక్నాలజీ గ్రూపు’’ ను ఏర్పాటు చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
వివరణ
ప్రభుత్వ ప్రిన్సిపల్ అడ్వైజర్ అధ్యక్షత న 12 మంది సభ్యుల టెక్నాలజీ గ్రూపు ఏర్పాటు కు మంత్రిమండలి అనుమతిచ్చింది. ఆధునిక టెక్నాలజీల పై సకాలం లో సరైన విధాన పరమైన సలహాల ను ఇవ్వడం ఈ గ్రూపు యొక్క ప్రధాన బాధ్యత. టెక్నాలజీ మాపింగ్, టెక్నాలజీ ఉత్పత్తు లు, జాతీయ ప్రయోగశాలలు- ప్రభుత్వ ఆర్ & డి కేంద్రాల లో తయారుచేసిన ద్వంద్వ టెక్నాలజీ ల వాణిజ్యీకరణ, కొన్ని ప్రధాన టెక్నాలజీల ను దేశీయంగానే రూపొందించడం, టెక్నాలజీ అభివృద్ధి కి అవసరమైన ఆర్ & డి కార్యక్రమాల ఎంపిక లో కూడా ఈ గ్రూపు సహకారాన్ని అందిస్తుంది.
ప్రధాన ప్రభావం
ఆ టెక్నాలజీ గ్రూపు :-
ఎ. టెక్నాలజీ సరఫరా, టెక్నాలజీ సేకరణ వ్యూహాలు అభివృద్ధి చేయడానికి వీలుగా అత్యుత్తమ సలహాలు ఇస్తుంది.
బి. విధానం, వర్థమాన టెక్నాలజీ ల వినియోగం పై స్వంత టెక్నాలజీ ల అభివృద్ధి చేస్తుంది.
సి. ప్రభుత్వ రంగ సంస్థ లు, జాతీయ ప్రయోగ శాల లు, పరిశోధన సంస్థ లు అభివృద్ధి పరచే/ అభివృద్ధి పరచిన టెక్నాలజీ ల మనుగడ కు తగ్గ చర్యలు అమలయ్యేటట్టు చూస్తుంది.
అమలు వ్యూహం మరియు లక్ష్యాలు
టెక్నాలజీ గ్రూపు పని కి కీలకమైనటువంటి మూడు స్తంభాల లో :
- విధానపరమైన మద్దతు;
- సమీకరణ కు అవసరమైన మద్దతు; మరియు
- పరిశోధన, అభివృద్ధి ప్రతిపాదనల కు తోడ్పాటు లు
ఉన్నాయి.
టెక్నాలజీ గ్రూపు ఈ క్రింది కార్యాలకు పూచీ పడుతుంది :-
అన్ని రంగాల లో ఆర్థికాభివృద్ధి, దేశీయ పరిశ్రమ స్థిరమైన అభివృద్ధి కి దారి తీసే ఆధునిక సాంకేతికత లు రూపొందించడానికి అవసరమైన, సమర్థవంతమైన విధానాలు, వ్యూహాల రూపకల్పన;
- అన్ని రంగాల లో వర్థమాన సాంకేతికతల పై పరిశోధన కు అవసరమైన ప్రాధాన్యాలు, వ్యూహాల పై ప్రభుత్వాని కి సలహాలు అందించడం;
- దేశ వ్యాప్తం గా అందుబాటు లో ఉన్న, అభివృద్ధి చేయనున్న టెక్నాలజీ లు, టెక్నాలజీ ఉత్పత్తుల మ్యాపింగ్ ఎప్పటికప్పుడు నవీకరించడం, నిర్వహణ;
- ఎంపిక చేసిన ప్రధాన టెక్నాలజీ లు దేశీయంగానే తయారు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపకల్పన;
- టెక్నాలజీ సరఫరాదారు, సమీకరణ వ్యూహాల పై ప్రభుత్వాని కి అవసరమైన సలహా ఇవ్వడం;
- డేటా సైన్స్, కృత్రిమ మేథ ల వంటి వర్థమాన టెక్నాలజీ ల వినియోగం, విధానాల పై సొంత నైపుణ్యాలు అభివృద్ధి చేసుకొనేందుకు అన్ని మంత్రిత్వ శాఖ లు, ప్రభుత్వ శాఖ లు, రాష్ట్ర ప్రభుత్వాల ను ప్రోత్సహించడం, ఆయా విభాగాల లో శిక్షణ, సామర్థ్యాల అభివృద్ధి కి సహకరించడం;
- విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల తో సహకార, పరిశోధన భాగస్వామ్యాల ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థ లు, ప్రయోగశాల లు సుస్థిరమైన అభివృద్ధి ని సాధించేందుకు అవసరమైన విధానాల రూపకల్పన; మరియు
- పరిశోధన, అభివృద్ధి ప్రతిపాదనల కు అవసరం అయిన ప్రమాణాల మరియు ఉమ్మడి పదజాలం రూపకల్పన.
పూర్వరంగం
టెక్నాలజీ రంగం లో ప్రధానమైన అయిదు అంశాలు: ఎ. టెక్నాలజీ అభివృద్ధి కి పటిష్ఠమైన కేంద్రాల ఏర్పాటు విధానం; బి. పారిశ్రామికాభివృద్ధి సంపూర్ణంగా ఉండేందుకు దోహద పడే విధంగా అభివృద్ధి చేయవలసిన, అమలుపరుస్తున్న టెక్నాలజీల కు ప్రమాణాల నిర్దేశం. సి. పూర్తి స్థాయి లో వాణిజ్యీకరణ చేయని టెక్నాలజీ ల ద్వంద్వ వినియోగం డి. టెక్నాలజీ అభివృద్ధి ప్రయత్నాల తో అనుసంధానం కాని ఆర్ & డి కార్యక్రమాలు చేపట్టడం. ఇ. సమాజానికి, పారిశ్రామిక రంగం వినియోగానికి కూడా ప్రధానం అయిన టెక్నాలజీల మ్యాపింగ్. పైన పేర్కొన్న సమస్యల ను పరిష్కరించడం లో ఒక ప్రయత్నమే టెక్నాలజీ గ్రూపు ఏర్పాటు.
**
(Release ID: 1708402)
Visitor Counter : 190