ప్రధాన మంత్రి కార్యాలయం

గాంధీనగర్ లో వన్యజీవుల వలసజాతుల సంరక్షణ సంబంధిత 13వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీజ్ సమ్మేళనాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి


నిర్దేశిత గడువు కన్నా రెండేళ్లు ముందే పులల సంతతి రెట్టింపు లక్ష్యాన్ని సాధించిన భారతదేశం: ప్రధాన మంత్రి

సాగర ప్రాంతాల తాబేళ్ళ విధానం, సూక్ష్మ ప్లాస్టిక్ లు సృష్టిస్తున్న కాలుష్యం నిర్మూలన కు మారీన్ స్టాండింగ్ మేనేజ్ మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టనున్న భారతదేశం

Posted On: 17 FEB 2020 1:19PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా గాంధీనగర్ లో వన్య జీవుల వలస జాతుల యొక్క సంరక్షణ సంబంధిత 13వ సిఓపి సమ్మేళనాన్ని ప్రారంభించారు.

 

ఈ సందర్భం గా ఆయన  ప్రసంగిస్తూ ప్రపంచం లో అత్యంత వైవిధ్యం గల దేశాలలో భారతదేశం ఒకటి అని పేర్కొన్నారు.  ప్రపంచ భూవిస్తీర్ణం లో 2.4 శాతం వాటా గల భారతదేశం ప్రపంచ జీవ వైవిధ్యంలో 8 శాతం వాటా ను కలిగివుందని ఉద్ఘాటించారు. ఎన్నో యుగాలు గా భారతదేశం అనుసరిస్తున్న సాంస్కృతిక విలువల లో వన్యప్రాణులు, వాటి ఆవాస ప్రాంతాల సంరక్షణ  ఒక భాగం గా ఉందని, ఇది కరుణ, సహజీవన సిద్ధాంతాల ను ప్రోత్సహిస్తున్నదని ప్రధాన మంత్రి అన్నారు. మహాత్మ గాంధీ స్ఫూర్తి తో అహింస, జంతు సంరక్షణ, ప్రకృతి పరిరక్షణ సిద్ధాంతాల ను రాజ్యాంగం లో సముచితమైన రీతి న పొందుపరచడం జరిగింది. ఎన్నో చట్టాల లో, శాసనాల లో ఇది ప్రతిబింబిస్తున్నదిఅని ఆయన చెప్పారు.

 

భారతదేశంలో అడవుల విస్తీర్ణం పెంపు గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుతం భారత భౌగోళిక ప్రాంతంలో 21.67 శాతం అడవులున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. సంరక్షణ, స్థిరమైన జీవన శైలి, హరిత అభివృద్ధి నమూనాలతో వాతావరణ కార్యాచరణలో భారతదేశం నాయకత్వ స్థానంలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు. ఎలక్ర్టిక్ వాహనాలకు ప్రోత్సాహం, స్మార్ట్ సిటీల అభివృద్ధి, జల సంరక్షణకు చేస్తున్న కృషిని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. భూ ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేసేందుకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందానికి కట్టుబడిన కొద్ది దేశాల్లో ఒకటని ఆయన చెప్పారు.

 

అంతరించిపోయే ముప్పు ను ఎదుర్కొంటున్న జీవజాలం సంరక్షణ కార్యక్రమం ఎంత కేంద్రీకృతం గా సాగుతున్నదీ ఆయన వివరించారు. 2010వ సంవత్సరం నాటికి 1411 గా ఉన్న పులుల సంతతి ని 2022వ సంవత్సరానికల్లా రెట్టింపు చేసి 2967కి చేర్చాలన్న లక్ష్యాన్ని రెండేళ్ల ముందుగానే భారతదేశం సాధించిందిఅని ఆయన అన్నారు.  ఈ సమావేశానికి హాజరైన పులుల సంఖ్య ఎక్కువ గా ఉన్న దేశాలు, ఇతర దేశాలు కూడా పులుల సంరక్షణ లో తాము సాధించిన విజయాల ను పంచుకొంటూ పులుల సంరక్షణ ను పటిష్ఠం చేయడానికి చేతులు కలపాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఆసియా ప్రాంత ఏనుగు ల సంరక్షణ కు తీసుకొన్న చర్యల ను కూడా ఆయన ప్రస్తావించారు.  మంచు ప్రాంత చిరుతలు, ఆసియా ప్రాంత సింహాలు, ఒకే కొమ్ము గల ఖడ్గ మృగాలు, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ల పరిరక్షణలకు చేపడుతున్న చర్యల ను కూడా ఆయన వివరించారు. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కు గుర్తుగానే జిఐబిఐ-ద గ్రేట్మస్కట్ ను కూడా రూపొందించామని ఆయన చెప్పారు.

 

ప్రకృతి తో సామరస్యపూర్వక జీవనానికి ప్రతీక అయిన దక్షిణాసియా ప్రాంతం లోని కోలమ్సాంప్రదాయిక ప్రాంతం స్ఫూర్తితోనే సిఎమ్ఎస్ సిఒపి 13 లోగో ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. సిఎమ్ఎస్ సిఒపి 13 థీమ్ భూగోళం తో వలస జీవజాలం అనుసంధానం, వాటికి ఉమ్మడి గా స్వాగతంఅనేది భారతదేశం అనుసరిస్తున్న అతిథి దేవో భవ’’ సిద్దాంతానికి అనుగుణం గా ఉందని ఆయన చెప్పారు.

 

రాబోయే మూడు సంవత్సరాల కాలం లో ఈ కన్వెన్శన్ కు నాయకత్వం వహించే సమయం లో భారతదేశం ప్రాధాన్యాల ను కూడా ప్రధానమంత్రి వివరించారు.

 

వలస పక్షులు ఎగిరి వెళ్లే సెంట్రల్ ఆసియా గగన మార్గం లో భారతదేశం ఒక భాగం గా ఉందని తెలియచేస్తూ ఈ ప్రాంతం గుండా ఎగిరి వెళ్లే వలస పక్షులు, వాటి ఆవాస ప్రాంతాల సంరక్షణ కు సెంట్రల్ ఆసియా గగన మార్గం ద్వారా వలస వెళ్లే పక్షుల సంరక్షణ జాతీయ కార్యాచరణ విధానాన్ని భారతదేశం రూపొందిస్తున్నదని చెప్పారు. వలస పక్షుల సంరక్షణ కు కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన లో ఇతర దేశాల కు సహకరించడానికి కూడా భారతదేశం ఆనందం గా ఎదురుచూస్తున్నది. సెంట్రల్ ఆసియా గగన మార్గం లోని దేశాల క్రియాశీల సహకారం లో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించాలని భారతదేశం ఆసక్తి గా ఉందిఅని ఆయన అన్నారు.

 

ఆసియాన్, తూర్పు ఆసియా శిఖరాగ్ర దేశాల తో సహకారాన్ని పటిష్ఠం చేసుకోనున్నట్టు ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు.  భారతదేశం కీలక నాయకత్వ పాత్ర ను పోషిస్తున్న ఇండో పసిఫిక్ ఓశన్ ఇనీశియేటివ్ తో(ఐపిఒఐ) ఈ సహకారం అనుసంధానమై ఉంటుందని ఆయన అన్నారు.  2020వ సంవత్సరం నాటికి భారతదేశం సాగర తాబేళ్ల విధానం, మారీన్ స్ట్రాండింగ్ మేనేజ్ మెంట్ పాలిసి ని ఆవిష్కరించనున్నట్టు తెలిపారు.  సాగర జలాల ను కలుషితం చేస్తున్న మైక్రో ప్లాస్టిక్స్ సమస్య ను కూడా ఇది పరిష్కరిస్తుందని ఆయన అన్నారు.  ఏక వినియోగ ప్లాస్టిక్ పర్యావరణ కు హానికరం గా ఉందని, దాని వినియోగాన్ని తగ్గించేందుకు ఒక ఉద్యమ స్ఫూర్తి తో భారతదేశం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు.

 

భారతదేశం లోని పలు సంరక్షణా కేంద్రాలకు పొరుగుదేశాల్లోని సంరక్షణ కేంద్రాలతో ఉమ్మడి సరిహద్దు ఉన్నదని ప్రస్తావిస్తూ సరిహద్దు వెలుపలి ప్రాంతాల వన్యప్రాణి సంరక్షణ సహకార వ్యవస్థఏర్పాటు చేయడం ద్వారా చక్కని సానుకూల ఫలితాలు సాధించవచ్చునని ఆయన అన్నారు.

 

స్థిరమైన అభివృద్ధి సాధన కు కేంద్ర ప్రభుత్వం కట్టుబాటు ను పునరుద్ఘాటిస్తూ సునిశిత ప్రాంతాల పర్యావరణ అభివృద్ధి కి లినియర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ విధానం మార్గదర్శకసూత్రాల ను విడుదల చేయడం గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

 

అటవీ ప్రాంతాల లో నివసిస్తున్న లక్షల మంది ప్రజల ను సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్స్ఫూర్తి తో ఉమ్మడి అడవుల నిర్వహణ కమిటీ లు, పర్యావరణ అభివృద్ధి కమిటీల లో భాగస్వాములను చేస్తున్నామని, వారంతా అడవులు, జంతుసంరక్షణ కార్యక్రమాల లో చురుకుగా పాల్గొంటున్నారని ఆయన తెలిపారు.

 

 

***


(Release ID: 1708387) Visitor Counter : 96