ప్రధాన మంత్రి కార్యాలయం

వారాణ‌సీ ని 2020వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 16వ తేదీ న సంద‌ర్శించ‌నున్న‌ ప్ర‌ధాన మంత్రి


దీన్‌ ద‌యాళ్ ఉపాధ్యాయ మెమోరియ‌ల్ ను దేశ ప్ర‌జ‌ల కు అంకితం చేస్తారు; దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్ర‌హాన్ని కూడా ప్రధాన మంత్రి ఆవిష్క‌రించ‌నున్నారు

3 జ్యోతిర్లింగ యాత్రాస్థలాలు- వారాణ‌సీ, ఉజ్జై న్ మరియు ఓంకారేశ్వ‌ర్ ల‌ ను క‌లుపుతూ సాగే మ‌హాకాల్ ఎక్స్ ప్రెస్ ప్రారంభ సూచ‌కం గా ఆ రైలు కు జెండా ను చూపుతారు

వారాణసీ లో 430 ప‌డ‌క‌ల తో కూడిన ఒక సూప‌ర్ స్పెశాలిటి గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్ స‌హా అనేక అభివృద్ధి ప‌థ‌కాల‌ ను ప్రారంభించడం/ దేశ ప్ర‌జ‌ల కు అంకితమివ్వడం చేయనున్నారు

Posted On: 14 FEB 2020 2:09PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌న పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గమైన వారాణ‌సీ లో 2020వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 16వ తేదీ న ఒక రోజు పర్యటన ను చేపట్టనున్నారు.

 

శ్రీ జ‌గ‌ద్గురు విశ్వారాధ్య‌ గురుకుల్ యొక్క శ‌తాబ్ధి ఉత్స‌వాల ముగింపు కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి పాలుపంచుకోవ‌ల‌సివుంది.  19 భాషల లో శ్రీ సిద్ధాంత్ శిఖామ‌ణి గ్రంథ్‌ యొక్క అనువాద గ్రంథాన్ని మ‌రియు త‌త్సంబంధిత మొబైల్ యాప్ ను కూడా శ్రీ మోదీ ఆవిష్క‌రించ‌నున్నారు.

 

ఆ త‌రువాత పండిత్ దీన్‌ ద‌యాళ్ ఉపాధ్యాయ స్మార‌క కేంద్రాన్ని దేశ ప్ర‌జ‌ల కు శ్రీ న‌రేంద్ర మోదీ అంకితం చేస్తారు. ఈ కార్య‌క్ర‌మం లో భాగం గా పండిత దీన్‌ ద‌యాళ్ ఉపాధ్యాయ యొక్క 63 అడుగుల ఎత్త‌యిన పంచ‌ లోహ విగ్ర‌హాన్ని కూడా ప్ర‌ధాన మంత్రి ఆవిష్క‌రిస్తారు. ఇది ఈ నేత కు దేశం లో కెల్లా అత్యంత పెద్ద‌ విగ్ర‌హం కానున్నది. ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దడం కోసం 200 మంది కి పైగా చేతివృత్తుల వారు గ‌డ‌చిన ఒక సంవ‌త్స‌ర కాలం గా రాత్రింబ‌గ‌ళ్ళు శ్ర‌మిస్తూ వ‌చ్చారు.

 

ఈ స్మార‌క కేంద్రం లో పండిత్ దీన్‌ ద‌యాళ్ ఉపాధ్యాయ జీవ‌నాన్ని మ‌రియు అప్ప‌టి కాలాన్ని సూచించేట‌టువంటి రాతి చెక్క‌డం ప‌నులు కూడా చోటు చేసుకొన్నాయి. సుమారు గా 30 మంది ఒడిశా చేతి పని వారు మ‌రియు క‌ళాకారులు గ‌డ‌చిన ఒక సంవ‌త్స‌ర కాలం లో ఈ ప‌థ‌కం ప‌నుల లో నిమ‌గ్నమయ్యారు.

 

ప్ర‌ధాన మంత్రి త‌ద‌నంత‌రం, ఒక సార్వ‌జ‌నిక కార్య‌క్ర‌మం లో పాల్గొని 30కి పైగా ప‌థ‌కాల‌ ను దేశ ప్ర‌జ‌ల‌ కు అంకితం చేస్తారు. వీటిలో కాశీ హిందూ విశ్వ‌విద్యాల‌యం (బిహెచ్‌యు)లో ఏర్పాటు చేసిన 430 ప‌డ‌క‌లు క‌లిగిన సూప‌ర్ స్పెశాలిటి గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిటల్, ఇంకా

 74 ప‌డ‌క‌ల తో కూడిన మ‌నోరోగ చికిత్స ఆసుప‌త్రి కూడా ఉంటాయి.

 

 ఐఆర్ సిటిసి కి చెందిన మ‌హా కాల్ ఎక్స్ ప్రెస్ కు ప్రారంభ సూచ‌కం గా ఒక జెండా ను ప్ర‌ధాన మంత్రి- వీడియో లింక్ ద్వారా- చూపెడతారు. ఈ రైలు 3 జ్యోతిర్లింగ యాత్రా స్థలాల ను క‌లుపుతుంది. అవే- వారాణ‌సీ, ఉజ్జ‌ైన్ మ‌రియు ఓంకారేశ్వ‌ర్‌. ఈ రైలు దేశం లో రాత్రిపూట ప్ర‌యాణించే మొట్ట‌మొద‌టి ప్రైవేటు రైలు కానున్నది.

 

  • మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కాశీ ఏక్ రూప్ అనేక్ను కూడా ప్రారంభించ‌నున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ‌రియు అమెరికా స‌హా ప్ర‌పంచం లోని వివిధ దేశాల నుండి విచ్చేసే చేతి వృత్తుల వారితోను, కొనుగోలుదారుల తోను మంత్రి సంభాషిస్తారు. పండిత్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ హ‌స్తక‌ళా సంకుల్ లో రెండు రోజుల పాటు జ‌రిగే ఒక కార్య‌క్ర‌మమే కాశీ ఏక్ రూప్ అనేక్’. ఇందులో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో వివిధ ప్రాంతాల కు చెందిన ఉత్ప‌త్తుల ను ప్ర‌ద‌ర్శ‌న కు ఉంచుతారు.

 

 

***


(Release ID: 1708302) Visitor Counter : 123