ప్రధాన మంత్రి కార్యాలయం

లోక్ సభ లో రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి ప్రధాన మంత్రి సమాధానం


ప్రజలు వేగాన్ని, పరిమాణాన్ని, దృఢ సంకల్పాన్ని మరియు నిర్ణయాత్మకత ను కోరుకుంటారన్న ప్రధాన మంత్రి

వ్యవసాయ బడ్జెటు అయిదింతలు పెరిగిందని తెలిపిన ప్రధాన మంత్రి

మరింత పెట్టుబడి, ఉత్తమమైన మౌలిక సదుపాయాలు మరియు గరిష్ట ఉద్యోగ కల్పన.. ఇవీ ప్రభుత్వ దార్శనికత అని ఆయన అన్నారు

Posted On: 06 FEB 2020 5:07PM by PIB Hyderabad

లోక్ సభ లో రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాధానాన్ని ఇస్తూ, రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ యొక్క ప్రసంగం ఆశాజనకమైనటువంటి స్ఫూర్తి ని రేకెత్తిస్తోందని, అది రానున్న కాలం లో దేశ ప్రజల ను ముందుకు తీసుకుపోయేందుకు ఒక మార్గసూచీ ని ఆవిష్కరిస్తోందని పేర్కొన్నారు.

 

‘‘మనం ఈ శతాబ్దం యొక్క మూడో దశాబ్దం లోకి ప్రవేశిస్తున్న కాలం లో ఆయన ప్రసంగం చోటు చేసుకొన్నది.  రాష్ట్రపతి గారి ప్రసంగం ఆశాజనకమైనటువంటి ఒక స్ఫూర్తి ని రేకెత్తిస్తున్నది.  అలాగే, రానున్న కాలం లో దేశ ప్రజల ను ముందుకు తీసుకుపోయేందుకు ఒక మార్గసూచీ ని కూడా అది ఆవిష్కరిస్తున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రస్తుతం దేశ ప్రజలు వేచి ఉండటానికి సిద్ధం గా లేరని ప్రధాన మంత్రి అన్నారు.  వారు వేగాన్ని మరియు పరిమాణాన్ని, దృఢ సంకల్పాన్ని మరియు నిర్ణయాత్మకత ను, సూక్ష్మగ్రాహ్యత ను, అలాగే పరిష్కారాన్ని కోరుకుంటున్నారు.  మా ప్రభుత్వం శీఘ్రగతి న కృషి చేసింది.  మరి దీని ఫలితం ఏమిటి అంటే- అయిదు సంవత్సరాల లో 37 మిలియన్ మంది బ్యాంకు అకౌంటు ను పొందారు.  11 మిలియన్ మంది వారి ఇంటి లో టాయిలెట్ ను ఏర్పరచుకొన్నారు.  13 మిలియన్ మంది ప్రజలు వారి ఇళ్ళ లో వంట గ్యాసు ను సంపాదించుకొన్నారు అని ఆయన వివరించారు.  ఒక సొంత ఇంటి ని కలిగి వుండాలన్న 2 కోట్ల మంది ప్రజల కల ప్రస్తుతం నెరవేరింది.  ఢిల్లీ లోని 1700కు పైగా అనధీకృత కాలనీ లలో 40 లక్షల మంది ఒక ఇంటి ని అమర్చుకోవాలని దీర్ఘకాలం పాటు సాగించిన నిరీక్షణ ముగిసింది అని ఆయన అన్నారు.

 

వ్యవసాయ బడ్జెటు అయిదింతలు

 

రైతు యొక్క ఆదాయాన్ని పెంచాలనేదే మా ప్రాథమ్యం గా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  అధిక ఎమ్ఎస్ పి, పంట బీమా మరియు సేద్యపు నీటి కి సంబంధించిన పథకాలు.. ఈ అంశాలు దశాబ్దుల తరబడి అనిర్ణీత స్థితి లో ఉన్నాయి.  మేము ఎమ్ఎస్ పి ని ఒకటిన్నర రెట్లు పెంచాము.  నిలచిపోయిన సాగునీటి పథకాల ను పూర్తి చేయడం కోసం ఒక లక్ష కోట్ల రూపాయలు వెచ్చించడమైంది. 

 

‘‘అయిదున్నర కోట్ల కు పైగా రైతు లు ప్రధాన మంత్రి పంట బీమా పథకం లో చేరారు.  రైతుల కు పదమూడున్నర కోట్ల రూపాయల ప్రీమియాన్ని చెల్లించడమైంది.  56 వేల కోట్ల కు పైగా బీమా క్లెయిము లు పరిష్కారం అయ్యాయి’’ అని ప్రధాన మంత్రి వివరించారు. ప్రభుత్వ పదవీకాలం లో వ్యవసాయ బడ్జెటు అయిదింతలు పెరిగినట్లు  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.  ‘‘పిఎం కిసాన్ సమ్మాన్ యోజన చాలా మంది రైతుల జీవితాల లో మార్పు ను తీసుకువస్తోంది.  45,000 కోట్ల రూపాయల సొమ్ము ను బదలాయించడమైంది.  మరి, దీని కారణం గా అనేక మంది రైతు లు లబ్ధి ని పొందారు.  ఈ పథకం లో ఏ మధ్యవర్తులు గాని, ఎటువంటి అదనపు ఫైళ్ళ సంబంధిత పని గాని లేదు’’ అని ఆయన అన్నారు.

 

మరింత పెట్టుబడి, ఉత్తమ మౌలిక సదుపాయాలు  మరియు గరిష్ఠం గా ఉద్యోగ కల్పన లే మా యొక్క దార్శనికత

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లోక్ సభ లో మాట్లాడుతూ, తన ప్రభుత్వం కోశ సంబంధిత లోటు ను అదుపు లో ఉంచిందన్నారు.  ‘‘ధర ల పెరుగుదల సైతం అదుపు లో ఉంది.  మరి స్థూల ఆర్థిక స్థిరత్వం కూడా నెలకొంది’’ అని ఆయన వివరించారు.

 

ఇన్వెస్టర్ లలో విశ్వాసాన్ని పెంచడం కోసం, దేశ ఆర్థిక వ్యవస్థ ను పటిష్ట పరచడం కోసం ప్రభుత్వం చాలా చర్యల ను తీసుకొందని శ్రీ మోదీ వివరించారు.

 

‘‘పరిశ్రమ, సాగునీటి పారుదల, సామాజిక మౌలిక సదుపాయాలు, గ్రామీణ ప్రాంతాల లో మౌలిక సదుపాయాలు, నౌకాశ్రయాలు, జలమార్గాల రంగాల లో మేము అనేక చొరవల ను  తీసుకొన్నాము’’ అని ఆయన అన్నారు.

 

‘‘స్టాండ్-అప్ ఇండియా, ఇంకా ముద్ర ఎంతో మంది జీవితాల లో సమృద్ధి ని కొని తెస్తున్నాయి.  ముద్ర లబ్ధిదారుల లో మహిళ లు గణనీయ సంఖ్య లో ఉన్నారు.  ముద్ర యోజన లో భాగం గా ఆమోదించిన 22 కోట్ల రూపాయల కు పైగా రుణాలు కోట్లాది యువతీ యువకుల కు ప్రయోజనాన్ని అందించాయి.’’

 

‘‘ప్రభుత్వం శ్రామిక సంస్కరణల పై అది కూడాను కార్మిక సంఘాల ను సంప్రదించిన తరువాతే కసరత్తు చేస్తున్నది’’ అని ప్రధాన మంత్రి వెల్లడించారు.

 

‘‘మా దృష్టి లో మౌలిక సదుపాయాలు అంటే, ఆకాంక్ష లు మరియు కార్యసాధన ల కలబోత.  ప్రజల ను వారి యొక్క స్వప్నాల తో సంధానించడం.  ప్రజల యొక్క సృజనాత్మకత తో వినియోగదారుల ను సంధానించడం; మౌలిక సదుపాయాలు అంటే ఒక చిన్నారి ని ఆమె యొక్క పాఠశాల తోను, ఒక రైతు ను బజారు తోను, ఒక వ్యాపారస్తుడి ని అతడి యొక్క వినియోదారుల తోను జత చేయడం.  ఇది ప్రజల ను ప్రజల తో కలపడం’’ అని ప్రధాన మంత్రి వివరించారు.

 

ఇదే అంశం పై ప్రధాన మంత్రి మరింత వివరం గా మాట్లాడుతూ, భారతదేశ పురోగతి ని పరుగు పెట్టించే ఇతర అంశాల లో తదుపరి తరం మౌలిక సదుపాయాలు కూడా ఒకటి అని పేర్కొన్నారు.

 

‘‘ఇదివరకటి రోజుల లో మౌలిక సదుపాయాల కల్పన ‘ఆర్థిక పరమైన అవకాశాల’ను ఎంపిక చేసిన కొద్ది మంది కి అందించింది.  ఇక మీదట ఇలా జరుగదు.  మేము ఈ రంగాన్ని పారదర్శకం గా మార్చి వేశాము.  దీనితో పాటు, సంధానాన్ని మెరుగు పరచే దిశ గా కృషి చేస్తున్నాము’’ అని ఆయన అన్నారు.

 

‘‘రానున్న కాలం లో మేము మౌలిక సదుపాయాల రంగం లో 100 లక్షల కోట్ల రూపాయల కు పైగా పెట్టుబడి ని పెట్టబోతున్నాము.  మరి ఇది వృద్ధి కి, ఆర్థిక వ్యవస్థ కు, అలాగే ఉద్యోగ కల్పన కు అండ గా నిలవబోతోంది’’ అని ఆయన అన్నారు.

 

***

 



(Release ID: 1708291) Visitor Counter : 184