ప్రధాన మంత్రి కార్యాలయం
జమ్ము & కశ్మీర్ ప్రజల పట్ల ప్రభుత్వాని కి ఉన్నటువంటి విశ్వాసం మరియు కర్తవ్యం పై ఆధారపడి 370వ అధికరణం యొక్క రద్దు చేయడమైందన్న ప్రధాన మంత్రి
రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై లోక్ సభ లో ఆయన సమాధానమిచ్చారు
Posted On:
06 FEB 2020 4:48PM by PIB Hyderabad
జమ్ము & కశ్మీర్ ను దేశం లోని మిగతా ప్రాంతాల తో సంపూర్ణం గా ఏకీకృతం చేసేందుకు రాజ్యాంగ 370వ అధికరణం యొక్క రద్దు బాట పరచిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న లోక్ సభ లో సమాధానాన్ని ఇచ్చారు.
జమ్ము, కశ్మీర్ ను భారతదేశ కిరీటం గా ప్రధాన మంత్రి అభివర్ణించారు. జమ్ము, కశ్మీర్ యొక్క వాస్తవిక గుర్తింపు, దాని యొక్క సూఫీ సంప్రదాయం లోన అన్ని విశ్వాసాల పట్ల దాని సమానత్వ వైఖరి లో ఇమిడి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రాంతాన్ని వెనుకపట్టునే వదలివేయజాలము, ఈ ప్రాంతాన్ని తుపాకులు, బాంబులు, హింస, మరియు వేర్పాటువాదాల తో సతమతమైనటువంటి ఒక ప్రాంతం గా మాత్రమే ప్రస్తావించజాలము అని ప్రధాన మంత్రి అన్నారు.
1990వ సంవత్సరం జనవరి 19వ తేదీ ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, చాలా మంది ప్రజలు వారిని జమ్ము, కశ్మీర్ నుండి గెంటివేసిన కారణం గా వారి యొక్క గుర్తింపు ను కోల్పోవలసి వచ్చిందని చెప్పారు.
ప్రధాన మంత్రి తన దీర్ఘ సమాధానం లో ఆ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న పరిస్థితి ని గురించి విపులం గా వివరించారు. రాజ్యాంగ 370వ అధికరణాన్ని జమ్ము, కశ్మీర్ ప్రజల పట్ల పరిపూర్ణ నమ్మకం తో రద్దు చేయడం జరిగిందని, మరి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరచే ప్రక్రియ శరవేగం గా సాగుతోందని ఆయన అన్నారు.
ఆ ప్రాంతం పై విధించిన ఆంక్షల ను క్రమం గా తొలగించడం జరుగుతోందని ప్రధాన మంత్రి తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతం లోని వివిధ ప్రాంతాల కు కేంద్ర మంత్రులు వెళ్తూ ప్రజల వద్ద నుండి ప్రత్యక్ష స్పందనల ను ఆలకిస్తున్నారని, ఆ ప్రతిస్పందనల ప్రాతిపదిక న ప్రభుత్వం తప్పక కార్యాచరణ కు పూనుకొంటుందని ప్రధాన మంత్రి అన్నారు.
జమ్ము, కశ్మీర్ ప్రజల సంక్షేమం కోసం మరియు ఆ ప్రాంత సర్వతోముఖ అభివృద్ధి కోసం కృషి చేసేందుకు తన ప్రభుత్వం వచన బద్ధురాలై ఉందని ప్రధాన మంత్రి అన్నారు.
లద్దాఖ్ ను నిష్ప్రభావ కేంద్ర పాలిత ప్రాంతం గా తీర్చిదిద్దడం జరుగుతుందని ప్రధాన మంత్రి తెలిపారు.
***
(Release ID: 1708289)