ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మహారాష్ట్ర, కర్నాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, చత్తీస్ గఢ్ లో పెరుగుతున్న కరోనా కేసులు
దేశవ్యాప్తంగా 6 కోట్ల డోసులు దాటిన కోవిడ్ టీకాలు
Posted On:
29 MAR 2021 11:17AM by PIB Hyderabad
ఎనిమిది రాష్టాలు – మహారాష్ట్ర, కర్నాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, చత్తీస్ గఢ్ లలో రోజువారీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మొత్తం గత 24 గంటలలో 68,020 కొత్త కరోనా కేసులు నమోదు కాగా ఈ ఎనిమిది రాష్ట్రాలదే అందులో 84.5% వాటా ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో 40,414 కేసులు రాగా కర్నాటకలో 3,082, పంజాబ్ లో 2,870 నమోదయ్యాయి.
పది రాష్ట్రాలలో కోవిడ్ కేసుల పెరుగుదల కనబడుతోంది. .
భారత్ లో ప్రస్తుతం కోవిడ్ తో చికిత్సపొందుతున్న వారి సంఖ్య 5,21,808 కి చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 4.33%. దీనివలన గత 24 గంటలలో పెరిగిన చికిత్సలో ఉన్న నికరపు కేసులు 35,498 గా నమోదయ్యాయి. ఈ కేసులలో 80.17 వాటా ఐదు రాష్ట్రాలదే. అవి: మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్నాటక, చత్తీస్ గఢ్.
ప్రతి పది లక్షలలో కేసుల సంఖ్య జాతీయ స్థాయిలో 8,724 కాగా, పది హేడు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అంతకంటే తక్కువ స్థాయి నమోదైంది.
పందొమ్మిది రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతి పది లక్షల జనాభాలో కేసులు జాతీయ సగటు కంటే ఎక్కువ ఉన్నాయి.
మరోవైపు దేశవ్యాప్తంగా కొవిడ్ టీకా డోసుల సంఖ్య ఆరుకోట్లు దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 9,92,483 శిబిరాల ద్వారా మొత్తం 6,05,30,435 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో ఆరోగ్య సిబ్బంది అందుకున్న 81,56,997 మొదటి విడత డోసులు, 51,78,065 రెండో విడత డోసులు, కోవిడ్ యోధులు అందుకున్న 89,12,113 మొదటి విడత డోసులు, 36,92,136 రెండో విడత డోసులు , 45-60 ఏళ్ల మధ్య వయసు ఉండి దీర్ఘకాల వ్యాధులతోబాధపడేవారు అందుకున్న 67,31,223 డోసులు, 60 ఏళ్ళు పైబడినవారు అందుకున్న 2,78,59,901 డోసులు ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ల దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
81,56,997
|
51,78,065
|
89,12,113
|
36,92,136
|
67,31,223
|
2,78,59,901
|
6,05,30,435
|
ఇప్పటిదాకా దేశమంతటా ఇచ్చిన టీకా డోసులలో 60% పైగా వాటా ఎనిమిది రాష్ట్రాలదే కావటం గమనార్హం.
టీకాల కార్యక్రమం మొదలైన 72వ రోజైన మార్చి 28 నాడు 7,465 శిబిరాల ద్వారా 2,60,653 డోసులు ఇవ్వగా అందులో మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు 2,18,798 మంది కాగా, 41,855 మంది రెండో డోస్ అందుకున్నారు.
తేదీ : మార్చి 28, 2021
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
4,189
|
2,468
|
22,067
|
39,387
|
57,561
|
1,34,981
|
2,18,798
|
41,855
|
|
|
|
|
|
|
|
|
|
ఇప్పటిదాకా కొవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య మొత్తం 1,13,55,993 కు చేరగా కోలుకున్నవారి శాతం 94.32%.
గత 24 గంటలలో 32,231 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో 17,874 మంది కోలుకున్నారు.
గడిచిన 24 గంటలలో 291 మంది కోవిడ్ తో మరణించారు. ఇందులో ఏడు రాష్ట్రాల వాటా 81.79%. మహారాష్ట్రలో అత్యధికంగా 108 కోవిడ్ మరణాలు నమొదు కాగా పంజాబ్ లో 69 మంది చనిపోయారు.
ప్రతి పది లక్షల కేసుల్లో మరణాలు జాతీయ స్థాయిలో 117 కాగా పద్దెనిమిది రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో అంతకంటే తక్కువ ఉంది.
అదే విధంగా పద్దెనిమిది రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతి పదిలక్షల్లో మరణాలు జాతీయ సగటు కంటే ఎక్కువున్నాయి
గత 24 గంటలలో నమోదైన కోవిడ్ మరణాలలో ఒక్క మరణం కూడా లేని రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పదిహేను ఉన్నాయి. అవి: అస్సాం, ఉత్తరాఖండ్, ఒడిశా, పుదుచ్చేరి, లద్దాఖ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, లక్షదీవులు, మణిపూర్, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మిజోరం, అండమాన్-నికోబార్ దీవులు, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్
***
(Release ID: 1708275)
Visitor Counter : 244
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam