ప్రధాన మంత్రి కార్యాలయం

బంగ‌బంధు షేక్ ముజిబుర్ రహ‌మాన్ స‌మాధిని సంద‌ర్శించి నివాళుల‌ర్పించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ.

Posted On: 27 MAR 2021 12:58PM by PIB Hyderabad

 ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌న రెండు రోజుల బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈరోజు రెండోరోజు  తుంగిపారాలోగ‌ల బంగ‌బంధు షేక్ ముజిబుర్ ర‌హ‌మాన్ స‌మాధిని సంద‌ర్శించి ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు.దీనితో బంగ‌బంధుకు నివాళుల‌ర్పించేందుకు  బంగ‌బంధు సమాధి కాంప్లెక్స్ ను సంద‌ర్శించిన తొలి ప్ర‌భుత్వాధినేత శ్రీ న‌రేంద్ర‌మోదీ అయ్యారు. ఈ చ‌రిత్రాత్మ‌క ఘ‌ట్టానికి గుర్తుగా ప్ర‌ధాన‌మంత్రి  న‌రేంద్ర‌మోదీ అక్క‌డ బ‌కుల్ మొక్క‌ను నాటారు. బంగ్లాదేశ్ ప్ర‌ధాన‌మంత్రి షేక్ హ‌సీనా త‌న సోద‌రి షేక్ రెహానాతో క‌ల‌సి ఈకార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ప్ర‌ధాన‌మంత్రి , బంగ‌బంధు స‌మాధి కాంప్లెక్స్‌లోని సంద‌ర్శ‌కుల పుస్త‌కంలో సంత‌కం చేశారు.  త‌మ హ‌క్కుల కోసం,  ప్ర‌త్యేక గుర్తింపు, త‌మ‌దైన‌ సంస్కృతి  కోసం  బంగ్లాదేశ్ ప్ర‌జ‌లు సాగించిన పోరాటానికి , బంగ‌బంధు జీవితం నిలువెత్తు నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి త‌మ సందేశంలో తెలిపారు.

***

 (Release ID: 1708084) Visitor Counter : 218