ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, చత్తీస్ గఢ్ లో పెరుగుతున్న కోవిడ్ కేసులు
కోవిడ్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాల పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న కేంద్రం ఇప్పటిదాకా దాదాపు 4 కోట్ల కోవిడ్ టీకాల పంపిణీ
Posted On:
19 MAR 2021 11:11AM by PIB Hyderabad
కొన్ని రాష్ట్రాలలో కోవిడ్ కేసుల పెరుగుదల కనబడుతోంది. గత 24 గంటలలో 39,726 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా అందులో 80.63% మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా ఒక రోజులోనే 25,833 కేసులు రాగా అవి నిన్నటి మొత్తం కేసుల్లో 65%. పంజాబ్ రాష్ట్రం 2,369 కేసులతో రెండో స్థానంలో ఉండగా కేరళలో 1,899 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఎనిమిది రాష్ట్రాలలో రోజువారీ కొత్త కేసుల పెరుగుదల కనబడుతోంది.
కొత్త కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని సమీక్షించటంతోబాటు కోవిడ్ నియంత్రణ చర్యలను, ప్రజారోగ్య పరిరక్షణ చర్యలను పర్యవేక్షిస్తోంది.
కేసులు పెరుగుతున్న చోట వ్యాధి నిర్థారణ పరీక్షల సంఖ్య పెంచాలని రాష్ట్రాలకు సూచించింది. ముఖ్యంగా కేసులు ఎక్కువగా ఉన్నచోట్ల ఆర్ టి – పి సి ఆర్ పరీక్షలు కనీసం 70% జరిగేలా చూడాలని ఆదేశించింది. పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు అనే త్రిముఖ వ్యూహాన్ని సమర్థంగా అనుసరించాలని రాష్ట్రాలను కోరింది. వ్యాధి నిర్థారణ అయినవారికి దగ్గరగా మెసలినవారిని కనీసం 20 మంది చొప్పున గుర్తించి 72 గంటలలోపే వారికి పరీక్షలు జరపాలని కూడా సూచించింది. వ్యాధి నిర్థారణ జరిగిన వెంటనే ఐసొలేషన్ కు తరలించి నిబంధనలకు అనుగుణంగా చికిత్స ప్రారంభించాలని కేంద్రం కోరింది.
కొత్త కేసులు వస్తున్న చోట నిఘా పెంచటంతోబాటు నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. చికిత్స మీద దృష్టి సారించి మరణాలను బాగా నియంత్రించాలని చెప్పింది. వైర్స రకాన్ని నిర్థారించటానికి వీలుగా శాంపిల్స్ ను జీనోమ్ పరీక్ష కోసం పంపాలని కూడా రాష్టాలను కోరింది. అన్ని రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలని 10 జాతీయ స్థాయి లాబ్ లతో అనుసంధానం చేశారు. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం ( ఎన్ సి డి సి) వీటికి నోడల్ సంస్థగా వ్యవహరిస్తుంది. బహిరంగ ప్రదేశాలలో గుమికూడటం, సమావేశాలు జరపటం లాంటివి జరగకుందా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం మరోమారు సూచించింది. ప్రాధాన్యతా క్రమంలో టీకాల పంపిణీ వేగంగా జరిగేట్టు చూడాలని, కోవిడ్ కు తగినట్టు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలను అప్రమత్తం చేయాలని కూడా రాష్టాలను కోరింది.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి ప్రజారోగ్య బృందాలను మహారాష్ట్ర, పంజాబ్ రాష్టాలకు హుటాహుటిన పంపింది. అక్కడ కొవిడ్ నియంత్రణ చర్యల్లో రాష్ట్రప్రభుత్వ అధికారులకు సహకరించటానికి ఈ చర్య తీసుకుంది. అంతకుముందు కూడా మహారాష్ట, కేరళ, చత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్నాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్ లకు అండగా కేంద్ర బృందాలను పంపటం తెలిసిందే. కేంద్ర బృందాల నివేదికలను ఆయా రాష్టాలకు కూడా ఇవ్వటం ద్వారా కొవిడ్ నియంత్రణ చర్యలు మరింత సమర్థంగా చేపట్టే అవకాశం ఏర్పడింది.
భారత దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య ప్రస్తుతం 2,71,282 కు చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 2.82%. గత 24 గంటలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య నికరంగా 18,918 తగ్గింది. కేవలం మహారాష్ట్ర, కేరళ, పంజాబ్ లో 76.48% చికిత్సలో ఉన్న కేసులున్నాయి.
ఈ రోజు ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 6,47,480 శిబిరాల ద్వారా దాదాపు 4 కోట్ల (3,93,39,817) టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది
76,35,188 మంది, రెండో డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది 47,15,173 మంది, మొదటొ డోస్ అందుకున్న కోవిడ్ యోధులు 78,33,278 మంది, రెండో డోస్ అందుకున్న కోవిడ్ యోధులు 21,98,414 మంది, 45-60 ఏళ్ల మధ్య ఉన్న దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు 27,79,998 మంది, 60 ఏళ్ళు పైబడ్డ లబ్ధిదారులు 1,41,77,766 మంది ఉన్నారు.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ దీర్ఘకాలవ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
76,35,188
|
47,15,173
|
78,33,278
|
21,98,414
|
27,79,998
|
1,41,77,766
|
3,93,39,817
|
టీకాల కార్యక్రమం మొదలైన 62వ రోజైన మార్చి 18న 22 లక్షలమందికి పైగా (22,02,861) టీకా డోసులందుకున్నారు. ఇందులో 18,32,287 మమ్ది లబ్ధిదారులు 32,128 శిబిరాల ద్వారా మొదటి డోస్ ( ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు) అందుకోగా 3,70,574 మంది ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు రెండో డోస్ అందుకున్నారు.
తేదీ: మార్చి 18, 2021
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ దీర్ఘకాల
వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
|
65,152
|
81,698
|
1,16,527
|
2,88,876
|
3,22,595
|
13,28,013
|
18,32,287
|
3,70,574
|
|
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్ నుంచి బైటపడినవారి సంఖ్య 1,10,83,679 కాగా, జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 96.56% కు చేరింది. గత 24 గంటలలో 16 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, ఒడిశా, ఉత్తరాఖండ్, జార్ఖండ్, లక్షదీవులు, సిక్కిం, మేఘాలయ, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, నాగాలాండ్, త్రిపుర, లద్దాఖ్, మణిపూర్, మిజోరం, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్
****
(Release ID: 1706163)
Visitor Counter : 216
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam