ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా 23 కోట్లకు పైగా కోవిడ్ పరీక్షలు
ఇప్పటివరకు 3.7 కోట్లకు పైగా కోవిడ్ టీకాలు
గత 24 గంటల్లో 20 లక్షలకు పైగా టీకాల పంపిణీ
Posted On:
18 MAR 2021 11:53AM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా జరిపిన కోవిడ్ నిర్థారణ పరీక్షలు ఈ రోజుకు 23 కోట్లు దాటాయి. మొత్తం 23,03,13,163 టీకా డోసుల పంపిణీ జరిగింది. మొత్తం జాతీయ స్థాయి కోవిడ్ పాజిటివ్ శాతం 5%గా నమోదు కాగా నిన్న అది 4.98% గా నమోదైంది.
భారతదేశంలో రోజుకు ప్రతి పది లక్షల జనాభాలో 140 మందికి కోవిడ్ పరీక్షలు జరుగుతున్నాయి. రోజువారీ పాజిటివ్ శాతం ఈరోజు 3.37% గా నమోదైంది.
మరోవైపు భారతదేశం మొత్తం కోవిడ్ టీకాల డోసులో 4 కోట్లకు చేరుకోవటానికి అతి చేరువలో ఉంది.
ఈ రోజు ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 6,15,267శిబిరాలలో 3,71,43,255 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో 75,68,844 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన మొదటి డోస్, 46,32,940 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన రెండో డోస్, 77,16,084 కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోస్, 19,09,528 డోసులు కోవిడ్ యోధులకిచ్చిన రెండో డోస్, 45-60 ఏళ్ల మధ్య వయస్కులైన దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకిచ్చిన 24,57,179 మొదటి డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన 1,28,58,680 మొదటి డోసులు కలిసి ఉన్నాయి.
ఆరోగ్యసిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు
పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
75,68,844
|
46,32,940
|
77,16,084
|
19,09,528
|
24,57,179
|
1,28,58,680
|
3,71,43,255
|
టీకాల కార్యక్రమం మొదలైన 61వ రోజైన మార్చి 17నాడు 20 లక్షలకు పైగా(20,78,719) టీకా డోసులు వేశారు. 28,412 శిబిరా;ల ద్వారా వెసిన డోసులలో 17,38,750 మంది లబ్ధిదారులు మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు కాగా beneficiaries were 3,39,969 మంది రెండో డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు.
తేదీ: మార్చి 17, 2021
|
ఆరోగ్యసిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు
పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
62,689
|
78,085
|
1,16,054
|
2,61,884
|
2,90,771
|
12,69,236
|
17,38,750
|
3,39,969
|
భారతదేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 2,52,364 కు చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 2.20%. గత 24 గంటలలో చికిత్సలో ఉన్న కేసుల నికర పెరుగుదల 17,958 గా నమోదైంది. ఈ క్రింది చిత్రపటం దేశంకో కోవిడ్ పరిస్థితిని చూపుతోంది.
మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలలోనే కోవిడ్ కేసుల పెరుగుదల భారీగా కొనసాగుతోంది. గత 24 గంటలలో 35,871 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా అందులో 79.54% ఈ ఐదు రాష్ట్రాలలోనే కావటం గమనార్హం. నిన్న మహారాష్ట్రలో అత్యధికంగా 16,620 కొత్త కేసులు రాగా దేశవ్యాప్తంగా కొత్తకేసులలో ఆ రాష్ట్రం వాటా 63.21%. దాని తరువాత స్థానంలో కేరళ (1792), పంజాబ్ (1492) ఉన్నాయి
పెరుగుతున్న కేసులు మొత్తం 8 రాష్టాల్లో కనబడుతున్నాయి. అవి: మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్నాటక, హర్యానా. అయితే, కేరళలో కేసుల తగ్గుదల గత నెలరోజులుగా కనబడుతోంది.
భారతదేశంలో ఇప్పటిదాకా కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య నేటికి 1,10,63,025 కు చేరింది. జాతీయ స్థాయిలొ కోలుకున్నవారి శాతం 96.41%. గత 24 గంటలలో 17,741 మంది కోవిడ్ నుంచి కోలుకొని బైటపడ్డారు.
గత 24 గంటలలో 172 మంది కోవిడ్ తో చనిపోయారు. ఈ మరణాలలో 84,88% కేవలం ఐదు రాష్టాలలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 84 మంది చనిపోగా, ఆ తరువాత స్థానాల్లో పంజాబ్ ( 35), కేరళ (13) ఉన్నాయి.
కోవిడ్ బారిన పడినవారిలో మరణాల శాతం 1.39% గా ఉండగా ఇది మరింత తగ్గుతూ వస్తోంది.
18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో గత 24 గంటలలో కోవిడ్ మరణాలేమీ నమోదు కాలేదు. అవి: రాజస్థాన్, అస్సాం, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, జార్ఖండ్, పుదుచ్చేరి, లక్షదీవులు, సిక్కిం, లద్దాఖ్, మణిపూర్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్.
****
(Release ID: 1705731)
Visitor Counter : 185
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam