ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండియా-ఫిన్‌ల్యాండ్ వర్చువల్ శిఖరాగ్ర సమ్మేళనం
Posted On:
16 MAR 2021 7:19PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , రిపబ్లిక్ ఆఫ్ ఫిన్లాండ్ ప్రధానమంత్రి , ఘనత వహించిన సన్నా మారిన్‌లు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఇరువురు నాయకులు మొత్తం ద్వైపాక్షిక అంశాలు , పరస్పర ప్రయోజనకరమైన ప్రాంతీయ, బహుళ పక్ష అంశాలను చర్చించారు.
ప్రజాస్వామిక ఉమ్మడి విలువలు, చట్టబద్ధ పాలన, సమానత్వం, భావప్రకటనా స్వేచ్ఛ, మానవహక్కుల పట్ల గౌరవం పునాదిగా ఇండియా, ఫిన్‌ల్యాండ్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ఇరువురు నాయకులు గుర్తించారు. బహుళపక్ష విధానానికి , నిబంధనల ఆధారిత అంతర్జాతీయ విధానాలకు, సుస్థిరాభివృద్ధికి , వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి కలసి పనిచేయడానికి తమ గట్టి నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు.
ప్రస్తుత ద్వైపాక్షిక చర్చల స్థితిని ఇరవురు నాయకులు సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించడానికి , ఈ సంబంధాలను వివిధ రంగాలకు వర్తింప చేయడానికి నిర్ణయించారు. దీనిని వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, విద్య, కృత్రిమ మేధ వంటి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాలు, 5జి, 6 జి, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాలకు విస్తరించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
హరిత, పరిశుభ్ర సాంకేతిక పరిజ్ఞానాల విషయంలో ఫిన్‌లాండ్ కీలక పాత్ర పోషిస్తుండడం పట్ల ప్రధానమంత్రి ప్రశంసించారు. ఇండియా సుస్థిరాభివృద్ధి దిశగా సాగిస్తున్న ప్రయత్నాలలో భారతీయ కంపెనీలతో ఫిన్లాండ్ కంపెనీలు భాగస్వాములు కావడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో, పునరుత్పాదక , జీవ ఇంధనం, సుస్థిరత, ఎడ్యుటెక్, ఫార్మా, డిజిటైజేషన్ వంటి లో విస్తృత సహకారానికి ఆయన సూచించారు.
ఇరువురు నాయకులు ప్రాంతీయ ,అంతర్జాతీయ అంశాలు, ఇండియా- యూరోపియన్ భాగస్వామ్యం, ఆర్కిటిక్ ప్రాంతంలో సహకారం, ప్రపంచ వాణిజ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి సంస్కరణలపై తమ అభిప్రాయాలను కలబోసుకున్నారు. ఆఫ్రికాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో ఇండియా , ఫిన్లాండ్‌లకు మంచి అవకాశాలు ఉన్నాయని ఇరుపక్షాలు గుర్తించాయి.
అంతర్జాతీయ సోలార్ అలయెన్సు (ఐఎస్ఎ) లో అలాగే, కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (సిడిఆర్ ఐ) లో చేరాల్సిందిగా ప్రధానమంత్రి ఫిన్లాండ్‌కు పిలుపునిచ్చారు.
ఇరువురు నాయకులు, కోవిడ్ -19 పరిస్థితి గురించి తమ వాక్సినేషన్ కార్యక్రమాల గురించి చర్చించారు. అన్ని దేశాలకు సరసమైన ధరలో కోవిడ్ వాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు అంతర్జాతీయంగా జరగవలసిన కృషి గురించి వారు చర్చించారు.
ఇండియా- ఇ.యు నాయకుల మధ్య పోర్టోలో జరగనున్న సమావేశం, అలాగే ఇండియా - నార్డిక్ శిఖరాగ్రసమ్మేళనం సందర్భంగా ఇరువురు నాయకులు తిరిగి సమావేశం కాగలమన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
(Release ID: 1705497)
Visitor Counter : 219
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam