ప్రధాన మంత్రి కార్యాలయం

బంగ్లాదేశ్ ను సంద‌ర్శించ‌నున్న భార‌త‌దేశ ప్ర‌ధాన మంత్రి

Posted On: 16 MAR 2021 8:54PM by PIB Hyderabad

 

 

బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనా గారు ఆహ్వానించిన మీద‌ట ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 26వ‌, 27వ తేదీల ‌లో బంగ్లాదేశ్ ను సంద‌ర్శించ‌నున్నారు. 

ఈ సంద‌ర్శ‌న మూడు ప్ర‌ముఖ కార్య‌క్ర‌మాల ను స్మ‌రించుకోవ‌డం కోసం  చోటు చేసుకోనుంది.  ఆ కార్య‌క్ర‌మాల లో ఒక కార్యక్రమం కీర్తిశేషులు శేఖ్ ముజీబుర్ రహమాన్ శ‌త జ‌యంతి అయిన‌టువంటి ముజీబ్ బొర్షో కాగా, రెండో కార్యక్రమం భార‌త‌దేశాని కి, బాంగ్లాదేశ్ కు మ‌ధ్య దౌత్య సంబంధాలు ఏర్ప‌డి 50 సంవ‌త్స‌రాలు కావ‌డం; ఇక మూడో కార్యక్రమం బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం జ‌రిగి 50 సంవ‌త్స‌రాలు కావ‌డం.   ప్ర‌ధాన‌ మంత్రి ఇంత‌కు ముందు 2015వ సంవ‌త్స‌రం లో బంగ్లాదేశ్ ను సంద‌ర్శించారు.  

ప్ర‌ధాన మంత్రి త‌న సంద‌ర్శన లో భాగం గా ఈ నెల 26న బంగ్లాదేశ్ లో జ‌రుగ‌నున్న జాతీయ దినం తాలూకు కార్య‌క్ర‌మానికి గౌర‌వ అతిథి గా హాజ‌రు కానున్నారు.

ప్ర‌ధాని షేక్ హ‌సీనా గారి తో ద్వైపాక్షిక సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డం తో పాటు ప్ర‌ధాన మంత్రి పాల్గొనే కార్య‌క్ర‌మం లో భాగం గా బాంగ్లాదేశ్ అధ్య‌క్షుడు మాన్య ‌శ్రీ మొ. అబ్దుల్ హామిద్ తో భేటీ కూడా ఉంటుంది.  బంగ్లాదేశ్ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి డాక్ట‌ర్ ఎ.కె. అబ్దుల్ మోమెన్ ప్ర‌ధాన మంత్రి తో స‌మావేశం కానున్నారు.
  ప్ర‌ధాన మంత్రి బంగ్లాదేశ్ సంద‌ర్శ‌న కోవిడ్ మ‌హ‌మ్మారి త‌లెత్తిన అనంతర కాలం లో ఆయ‌న ఏదైనా ఒక విదేశానికి జరిపే తొలి ప‌ర్య‌టన కానుంది.  ఇది బంగ్లాదేశ్ కు భార‌త‌దేశం ఇస్తున్న ప్రాథ‌మ్యాన్ని ప్ర‌ముఖం గా చాటుతున్నది.


**



(Release ID: 1705494) Visitor Counter : 173