ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ మీద పోరులో మరెన్నో శిఖరాలు అధిరోహించిన భారత్ దేశవ్యాప్తంగా 3.29 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ
నిన్న ఒక్క రోజులో 30 లక్ష టీకాలతో సరికొత్త రికార్డు 15 రోజుల్లోనే 60 ఏళ్ళకు పైబడ్డ లబ్ధిదారులు కోటిమంది
Posted On:
16 MAR 2021 11:23AM by PIB Hyderabad
కోవిడ్ మీద చేపట్టిన పోరులో భాగంగా భారతదేశం చేపడుతున్న కార్యక్రమాలు మరెన్నో శిఖరాలనధిరోహించాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి
వరకు పంపిణీ జరిగిన టీకా డోసుల సంఖ్య 3 కోట్ల 29 లక్షలు దాటింది. నిన్న ఒక్క రోజే అత్యధికంగా 30 లక్షలమంది కోవిడ్ టీకా డోసులు
అందుకున్నారు. గత 15 రోజుల్లో టీకాలు అందుకున్న 60 ఏళ్ళు పైబడ్డ లబ్ధిదారుల సంఖ్య కోటి పైబడింది. ఈ ఉదయం 7 గంటలవరకు
అందిన సమాచారం ప్రకారం 5,55,984 శిబిరాల ద్వారా 3,29,47,432 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో 74,46,983 ఆరోగ్య
సిబ్బంది మొదటి డోసులు, 44,58,616 ఆరోగ్య సిబ్బంది రెండో డోసులు, 74,74,406 కోవిడ్ యోధుల మొదటి డోసులు, 14,09,332
కోవిడ్ డోసుల రెండో డోసులు, 18,88,727 మంది 45-60 ఏళ్ళ మధ్య వయసున దీర్ఘకాల వ్యాధిగ్రస్తులైన లబ్ధిదారులు, 1,02,69,368
మంది 60 ఏళ్ళు పైబడ్డ లబ్ధిదారులు ఉన్నారు.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు
పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
74,46,983
|
44,58,616
|
74,74,406
|
14,09,332
|
18,88,727
|
1,02,69,368
|
3,29,47,432
|
టీకాల కార్యక్రమం మొదలైన 59వ రోజైన మార్చి15న మొత్తం 30,39,394 టీకా డోసులిచ్చారు. 42,919 శిబిరాలలో 26,27,099 మంది
ఆరోగ్యసిబ్బందికి, కోవిడ్ యోధులకు మొదటి డోస్, 4,12,295 మంది ఆరోగ్య సిబ్బందికి, కోవిడ్ యోధులకు రెండో డోస్ టీకాలిచ్చారు.
తేదీ: మార్చి15, 2021
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు
పైబడ్డవారు
|
మొత్తం
|
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
91,228
|
1,53,498
|
1,33,983
|
2,58,797
|
4,24,713
|
19,77,175
|
26,27,099
|
4,12,295
|
ఐదు రాష్ట్రాలలో కోవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. అవి: మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడు. గత 24 గంటల్లో
24,492 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా అందులో 79.73% ఈ ఐదు రాష్ట్రాలవే. మహారాష్ట్రలొ అత్యధికంగా ఒక్క రోజులో
15,051 కేసులు రాగా, పంజాబ్ లో 1,818, కేరళలో 1,054 కేసులు వచ్చాయి.

ఎనిమిది రాష్టాలలో కేసుల పెరుగుదల కనబడుతో ఉంది. అవి: మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్నాటక,
హర్యానా. అయితే, కేరళలో మాత్రం గత నెలరోజులుగా కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పడుతోంది.


భారతదేశంలో చికిత్సలో ఉన్న కేసులు నేటికి 2,23,432 కు చేరాయి. ఇవి మొత్తం పాజిటివ్ కేసులలో 1.96% కాగా మహారాష్ట్ర, కేరళ
పంజాబ్ కలిసి భారతదేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కేసుల్లో 76.57% వాటా .

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిపిన కోవిడ్ నిర్థారణ పరీక్షలు 22.8 కోట్లు దాటి 22,82,80,763 కు చేరింది. జాతీయ పాజిటివ్ శాతం 5%.

గత 24 గంటలలో మొత్తం 131 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలలో 82.44% కేవలం ఆరు రాష్ట్రాల్లొనే నమోదయ్యాయి.
మహారాష్ట్రలోనే 48 మంది చనిపోగా, పంజాబ్ లో 27 మంది, కేరళలో 11 మంది మరణించారు.

గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాని రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల సంఖ్య 16. అవి: రాజస్థాన్, చండీగఢ్,
జమ్మూ-కశ్మీర్, ఒడిశా, జార్ఖండ్, లక్షదీవులు, సిక్కిం, లద్దాఖ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, మేఘాలయ, మణిపూర్, త్రిపుర,
నాగాలాండ్, మిజోరం, అండమాన్-నికొబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్
***
(Release ID: 1705243)
Visitor Counter : 275