ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రోజువారీ కొత్త కోవిడ్ కేసులు పెరుగుతున్న

మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడు

మొత్తం చికిత్సలో ఉన్న కేసులలో మహారాష్ట్ర, కేరళ వాటా 71.69%

కేసులు పెరుగుతున్న రాష్ట్రాల పరిస్థితి గమనిస్తున్న కేంద్రం దేశవ్యాప్తంగా 2.61 కోట్ల కోవిడ్ టీకా డోసులు

Posted On: 12 MAR 2021 11:20AM by PIB Hyderabad

కొన్ని రాష్ట్రాలలో రోజువారీ కొత్త కోవిడ్ కేసులు బాగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో పెరుగుదల కనిపిస్తోంది. గత 24 గంటలలో నమోదైన కొత్త  కేసులలో  85.6% ఈ రాష్ట్రాలదే.   గత 24 గంటలలో 23,285 కొత్త కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో అత్యధికంగా  14,317 (61.48% ) కేసులు నమోదు కాగా కేరళలో  2,133, పంజాబ్ లో  1,305 కేసులు నమోదయ్యాయి.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001FWJX.jpg

ఎనిమిది రాష్ట్రాలలో కొత్త కేసుల పెరుగుదల కనబడుతోంది. 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002A998.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003GYN1.jpg

భారతదేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న మొత్తం కేసులు ప్రస్తుతం 1,97,237 కి చేరాయి. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో  1.74%. ఐదు రాష్ట్రాల మొత్తం ఇందులో   82.96% కాగా కేవలం మహారాష్ట్ర, కేరళ వాటా 71.69% ఉంది.  

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004KX7T.jpg

కేంద్ర ప్రభుత్వం కోవిడ్ పెరుగుతున్న రాష్ట్రాలమీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఆ రాష్టాలలో పరిస్థితిని క్రమం తప్పకుండా సమీక్షిస్తూ ఉంది. మహారాష్ట్ర, పంజాబ్ రాష్టాలకు ఉన్నత స్థాయి ప్రజారోగ్య బృందాలను పంపింది. ఆ రాష్టాలలో కోవిడ్ నియంత్రణ చర్యల్లో అక్కడి అధికారులకు అండగా నిలవటం ఈ బృందాల లక్ష్యం. గతంలో కూడా కేంద్రం ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మహారాష్ట్ర, కేరళ, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్నాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్మూ-కశ్మీర్ కు కేంద్ర బృందాలను పంపింది. కేంద్ర బృందాల నివేదికలను రాష్ట్రాలకు కూడా పంపటం ద్వారా వారు తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచించినట్టయింది.  కేండ్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పరిస్థితిని ఎప్పటి కప్పుడు సమీక్షిస్తోంది.

ఈ రోజు ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారాన్ని బట్టి 4,87,919 శిబిరాల ద్వారా 2,61,64,920 కోవిడ్ టీకా డోసుల పంపిణీ జరిగింది.  ఇందులో 72,23,071 మొదటి డోస్ ఆరోగ్య సిబ్బంది, 40,56,285 రెండో డోస్ ఆరోగ్య సిబ్బంది, 71,21,124 మొదటి డోస్ కోవిడ్ యోధులు,  6,72,794 రెండో డోస్ కోవిడ్ యోధులు, 45 ఏళ్ళు పైబడ్డ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు 10,30,612 మంది లబ్ధిదారులు, 60,61,034 మంది 60 ఏళ్ళు పైబడ్డవారు ఉన్నారు. 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ్ళ  దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్ళు పైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

72,23,071

40,56,285

71,21,124

6,72,794

10,30,612

60,61,034

2,61,64,920

 

టీకాల కార్యక్రమం మొదలైన 55వ రోజైన మార్చి 11న 4,80,740 టీకా డోసులిచ్చారు.  4,02,138 మంది  మొత్తం 9,751 శిబిరాల ద్వారా అందుకోగా వారు మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు. 78,602 మంది ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు రెండో డోస్ తీసుకున్నారు.   

అనేక రాష్ట్రాలలో ప్రజలు నిన్నమహాశివరాత్రి జరుపుకున్నారు. సెలవుదినం కావటంతోబాటు  చాలామంది ఉపవాసం పాటించటం వలన  వారిలో ఎ ఎన్ ఎం లు, ఆశా కార్యకర్తలు ఉండటం వలన టీకాల కార్యక్రమం కొంత మందకొడిగా సాగింది.

తేదీ: మార్చి11, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ్ళ  దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

1వ డోస్

2వ డోస్

25,961

43,091

66,465

35,511

63,554

2,46,158

4,02,138

78,602

 

ఇప్పటిదాకా మొత్తం 1,09,53,303 మంది కోవిడ్ నుంచి  కోలుకున్నారు.  గత 24 గంటలలో 15,157 మంది బాధితులు కోలుకున్నారు.   

చికిత్సలో ఉన్న కేసులు, కోలుకున్నవారి సంఖ్యను సూచించే ధోరణిని ఈ క్రింది చిత్రపటంలో చూడవచ్చు.  ఫిబ్రవరి 10 నుంచి మార్చి 12 వరకు నమోదైన ట్రెండ్ ఈ విధంగా ఉంది. కోలుకున్నవారికి, ఇంకా చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా ప్రస్తుతం 1,07,56,066 కి చేరింది .

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005GVSV.jpg

గత 24 గంటలలో 117 మంది కోవిడ్ తో మరణించారు. అందులో 82.91% మరణాలు ఆరు రాష్టాలలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 57 మంది, పంజాబ్ లో 18 మంది, కేరళలో 13 మంది చనిపోయారు.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006WAG5.jpg

గత 24 గంటలలో 19 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి:  గుజరాత్, రాజస్థాన్, చండీగఢ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, బీహార్, పుదుచ్చేరి, లక్షదీవులు, మణిపూర్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, మిజోరం, లద్దాఖ్, అండమాన్-నికోబార్ దీవులు, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్  

 

 

****



(Release ID: 1704328) Visitor Counter : 185