సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
డిజిటల్ వార్తల పబ్లిషర్ల ప్రతినిధులతో సమావేశమైన కేంద్ర సమాచార ప్రసార శాఖమంత్రి శ్రీ ప్రకాశ్‌జవడేకర్
Posted On:
11 MAR 2021 6:15PM by PIB Hyderabad
కేంద్ర సమాచార ప్రసార శాఖమంత్రి శ్రీ ప్రకాశ్ జవడేకర్ ఈరోజు డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (డిఎన్‌పిఎ) ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. 2021 ఐటి ( ఇంటర్ మీడియరీ గైడ్‌లైన్స్, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ) నిబంధనల నేపథ్యంలో ఆయన ఈ వీడియో కాన్ఫరెన్సు ద్వారా వారితో ముచ్చటించారు. దైనిక్ భాస్కర్, హిందూస్థాన్ టైమ్స్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎబిపి, ఈనాడు, దైనిక్ జాగరణ్, లోక్‌మత్ సంస్థల ప్రతినిధులు ఈ సమావేవశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ జవడేకర్, కేంద్రం తీసుకువచ్చిన నూతన నిబంధనలు డిజిటల్ న్యూస్‌పబ్లిషర్లపై కొన్ని బాధ్యతలను ఉంచిందని ఆయన తెలిపారు.ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిన జర్నలిస్టుల ప్రవర్తనానియమావళిలోని నిబంధనలు, అలాగే కేబుల్‌టెలివిజన్ నెట్ వర్క్‌చట్టం కింద గల ప్రోగ్రాం కోడ్‌కు కట్టుబడి ఉండాల్సిఉంటుందని, పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈ నిబంధనలు మూడు అంచెల ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో మొదటి , రెండవ అంచెలలో డిజిటల్ పబ్లిషర్లు, వారిచే ఏర్పడిన స్వీయ నియంత్రణ కమిటీలు ఉంటాయని అన్నారు. డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు కూడా సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు ఒక సులభ ఫారంలో కొంత మౌలిక సమాచారాన్ని అందించాల్సిఉంటుందని , దీనిని ఖరారు చేయనున్నామని అన్నారు .,అలాగే వారు పరిష్కరించిన ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాల్సి ఉంటుందని అన్నారు.
ప్రింట్ మీడియా , టివి ఛానళ్లకు డిజిటల్ వర్షన్లుఉన్నాయని,అయితే సంప్రదాయ ప్లాట్‌ఫాంలో ఉన్నకంటెంట్‌నే ఇందులోనూ అవి ఉంచుతున్నాయని ఆయన అన్నారు. అయితే కొన్ని కంటెంట్‌లు కేవలం డిజిటల్ ప్లాట్‌ఫారంలో మాత్రమే ఉంటున్నవీ ఉన్నాయన్నారు. అందువల్ల సంప్రదాయ మాధ్యమాలతో సమానంగా డిజిటల్ మీడియాలోని వార్తలకూ నిబంధనలు కవర్ చేయాలని నిర్దేశిస్తున్నాయని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్నప్రతినిధులు, నూతన నిబంధనలను స్వాగతిస్తూ, టివి, న్యూస్ ప్రింట్ మీడియా కేబుల్ టెలివిజన్‌నెట్ వర్క్ చట్టం, ప్రెస్‌కౌన్సిల్ చట్ట నిబంధనలను ఎంతో కాలం నుంచి పాటిస్తూ వస్తున్నాయని తెలిపారు. డిజిటల్ వర్షెన్లకు కూడా పబ్లిషర్లు సంప్రదాయ ప్లాట్‌ఫారంలుపాటించే నిబంధనలుపాటించవలసి ఉంటుంది. అయితే కేవలం డిజిటల్ ప్లాట్‌ఫారంలో వార్తలు మాత్రమే పబ్లిష్‌చేసే వారి కంటే భిన్నంగా తమను చూడాలని ఈ ప్రతినిధులు కోరారు.
ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేసినందుకు, డిజిటల్ పబ్లిషర్ల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వీరి అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని, మీడియా పరిశ్రమ మొత్తం అభివృద్ధికి ఈ తరహా సంప్రదింపుల ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తుందని
ఆయన తెలిపారు.
***
(Release ID: 1704283)
Visitor Counter : 253