ప్రధాన మంత్రి కార్యాలయం
భగవద్ గీత కు స్వామి చిద్భవానంద జీ వ్యాఖ్యానం తాలూకు కిండల్ కథనాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి
గీత మనను ఆలోచించేలా చేస్తుంది, ప్రశ్నలు వేసేలా మనకు స్ఫూర్తి ని కలిగిస్తుంది, చర్చించేలా ప్రోత్సహిస్తుంది, మన బుద్ధి ని ఏ విషయాన్ని అయినా స్వీకరించేందుకు సిద్ధం గా ఉంచుతుంది : ప్రధాన మంత్రి
Posted On:
11 MAR 2021 11:25AM by PIB Hyderabad
భగవద్ గీత కు స్వామి చిద్భవానంద జీ వ్యాఖ్యానం తాలూకు కిండల్ మాధ్యమ కథనాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఆవిష్కరించారు.
భగవద్ గీత కు స్వామి చిద్భవానంద జీ వ్యాఖ్యానం తాలూకు ఇ-బుక్ వర్శను ను ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తూ, దీనిని తీసుకురావాలని చేసిన ప్రయత్నాన్ని కొనియాడారు. గీత తాలూకు పవిత్రమైన ఆలోచనల లో మరింత మంది యువజనులు అనుబంధాన్ని ఏర్పరచుకొనేందుకు ఈ ప్రయాస వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు. సంప్రదాయాలు, సాంకేతిక విజ్ఞానం కలగలిసి పోయాయి అని ప్రధానమంత్రి అన్నారు. ఈ ఇ-బుక్ శాశ్వతమైన గీత కు, భవ్యమైనటువంటి తమిళ సంస్కృతి కి మధ్య ఉన్న బంధాన్ని మరింత గా గాఢతరం చేస్తుంది అని కూడా ఆయన అన్నారు. ఈ ఇ-బుక్ ప్రపంచం అంతటా విస్తరించి ఉన్నటువంటి ప్రవాసీ తమిళులు దీని ని సులభం గా చదువుకొనేటట్లు చేయగలదన్నారు. ప్రవాసీ తమిళులు అనేక రంగాల లో కొత్త శిఖరాల ను అందుకొన్నందుకు, వారు వెళ్ళిన చోటల్లా తమిళ సంస్కృతి తాలూకు గొప్పతనాన్ని వారి వెంట తీసుకు పోతున్నందుకు వారిని ఆయన ప్రశంసించారు.
స్వామి చిద్భవానంద జీ కి ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ఘటిస్తూ, స్వామి చిద్భవానంద జీ బుద్ధి, దేహం, హృదయం, ఆత్మ.. అన్నీ భారతదేశ పునరుత్థానం కోసమే అంకితం అయ్యాయి అని పేర్కొన్నారు. స్వామి వివేకానంద మద్రాసు ఉపన్యాసాలు స్వామి చిద్భవానంద జీ కు ప్రేరణ ను అందించాయని, దానితో ఆయన దేశ ప్రజలనే అన్నింటి కన్నా మిన్న గా ఎంచి ప్రజల కు సేవ చేశారని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. ఒక పక్క స్వామి చిద్భవానంద జీ కి స్వామి వివేకానంద నుంచి ప్రేరణ లభిస్తే, మరొక పక్క ఆయన (చిద్భవానంద జీ) తన పవిత్ర కార్యాల తో ప్రపంచాని కి స్ఫూర్తి ని ఇవ్వసాగారు అని కూడా శ్రీ మోదీ అన్నారు. స్వామి చిద్భవానంద జీ పవిత్ర కార్యాలను ముందుకు తీసుకు పోతున్నందుకు, అలాగే సముదాయ సేవ లో, ఆరోగ్య సంరక్షణ లో, విద్య లో ప్రశంసనీయమైన కృషి ని చేస్తున్నందుకు శ్రీ రామకృష్ణ మఠాన్ని శ్రీ మోదీ ప్రశంసించారు.
గీత లోని అందం ఆ గ్రంథం లోని గాఢత, వైవిధ్యం, సరళత్వం లలో వ్యక్తం అవుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఆచార్య వినోబా భావే గీత ను గురించి మాట్లాడుతూ, తాను నడుస్తూ పడిపోతే తనను ఒడి లోకి తీసుకొనే ఒక మాతృమూర్తి వంటిదే గీత అన్నారని శ్రీ మోదీ గుర్తు చేశారు. మహా నాయకులైన మహాత్మ గాంధీ, లోక్ మాన్య తిలక్, మహాకవి సుబ్రమణ్య భారతి వంటి వారు గీత నుంచి ప్రేరణ ను పొందారని శ్రీ మోదీ వివరించారు. గీత మనను ఆలోచించేటట్లు చేస్తుంది, ప్రశ్నించేటట్లుగా మనలో స్ఫూర్తి ని ఉదయింపచేస్తుంది, చర్చించవలసిందిగా మనలను ప్రోత్సహిస్తుంది, ఏదైనా ఒక విషయాన్ని స్వీకరించేందుకు సిద్ధం గా మన బుద్ధి ని ఉంచేటట్టుగా చేస్తుంది అని ఆయన చెప్పారు. గీత ద్వారా స్ఫూర్తి ని పొందిన ఏ వ్యక్తి అయినా ప్రకృతి పట్ల ఎల్లప్పటికీ దయ ను కలిగి ఉంటారు, మరి వారి స్వభావం ప్రజాస్వామికమైందిగా మారుతుంది అని కూడా శ్రీ మోదీ అన్నారు.
శ్రీమద్ భగవద్ గీత కుంగుబాటు నుంచి, సంఘర్షణ నుంచి జనించిందని, మరి మానవ జాతి ప్రస్తుతం అదే తరహా సంఘర్షణ ల గుండా, సవాళ్ళ గుండా పయనిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. భగవద్ గీత అనేది ఆలోచనల నిధి, అది కుంగుబాటు నుంచి విజయాని కి చేసే యాత్ర కు అద్దం పడుతుంది అని ఆయన అన్నారు. ప్రపంచం ఒక విశ్వమారి కి వ్యతిరేకం గా కఠినమైనటువంటి యుద్ధాన్ని సాగిస్తున్న కాలం లో, ఆర్థికంగా సామాజికంగా పెను ప్రభావం ప్రసరించే కాలం లో శ్రీమద్ భగవద్ గీత చూపిన దారి మరింత సందర్భోచితం గా ఉంది అని ఆయన అన్నారు. మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్ళ బారి నుంచి మరొక్క సారి విజేత గా నిలబడటానికి కావలసిన బలాన్ని, సాగవలసిన దిశ ను శ్రీమద్ భగవద్ గీత అందిస్తుంది అని ఆయన అన్నారు. హృదయ వ్యాధి ని గురించి ఒక రచయిత రాసిన కథనాన్ని అదే రంగం లోని నిపుణుల ద్వారా నిగ్గు తేల్చి మరీ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రచురించిన సంగతి ని శ్రీ మోదీ ఉదాహరిస్తూ, కోవిడ్ మహమ్మారి కాలం లో గీత తాలూకు ప్రాసంగికత ను గురించి ఆ కథనం లో సుదీర్ఘం గా చర్చించడం జరిగిందన్నారు.
శ్రీమద్ భగవద్ గీత ఇచ్చేటటువంటి ప్రధాన సందేశమల్లా క్రియాశీలత్వం గురించే, ఇలా ఎందుకు అంటే ఏ పనినీ చేయకుండా ఉండటం కంటే క్రియాశీలత్వం ఎంతో మెరుగైంది అని ప్రధాన మంత్రి వివరించారు. అదే విధం గా ‘ఆత్మనిర్భర్ భారత్’ కు కీలకం గా ఉన్న అంశం సంపద ను సృష్టించడం తో పాటు ఒక్క మనను గురించే లక్ష్యపెట్టుకోవడం కాకుండా విశాల మానవ జాతి ని గురించి కూడా పట్టించుకోవడం అని ఆయన అన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ ఆవిష్కారం ప్రపంచానికి మేలు చేస్తుందని మనం నమ్ముతున్నాం అన్నారు. మానవ జాతి కి సోకిన వ్యాధి ని నయం చేయడానికి, మానవాళి కి సాయపడడానికి మన శాస్త్రవేత్త లు గీత తాలూకు స్ఫూర్తి కి అనుగుణం గా కోవిడ్ టీకామందుల ను ఏ విధం గా త్వరిత గతి న కనుగొన్నదీ ఈ సందర్భం లో శ్రీ మోదీ గుర్తు కు తెచ్చారు.
చాలా ఆచరణీయమైనవి అయినటువంటి, పొంతన కలిగినటువంటి శ్రీమద్ భగవద్ గీత బోధనల ను ఒకసారి పరిశీలించాలంటూ ప్రజలకు, ప్రత్యేకించి యువతరానికి ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. వేగవంతమైన జీవనం లో నెమ్మది ని, శాంతి ని గీత ప్రసాదిస్తుందని, అది ఎడారి లో ఒక పచ్చగడ్డి బీడు వంటిది అని ఆయన అన్నారు. అది మీ బుద్ధి లో నుంచి వైఫల్యం తాలూకు భయాన్ని పారదోలుతుంది, అది మన కార్య ఆచరణ పట్ల శ్రద్ధ ను వహించేటట్టు చేస్తుంది. గీబుద్ధి తాలూకు ఒక సకారాత్మక భావన ను అలవరచేందుకు త లోని ప్రతి అధ్యాయం లో ఎంతో కొంత పొందుపరచి ఉంది అని ఆయన చెప్పారు.
***
(Release ID: 1704104)
Visitor Counter : 284
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam