ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి గా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన శ్రీ తీరథ్‌‌‌ సింహ్ రావ‌త్ కు అభినందనలు తెలిపిన‌ ప్ర‌ధాన మంత్రి

Posted On: 10 MAR 2021 5:20PM by PIB Hyderabad

ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి గా శ్రీ తీరథ్‌‌‌ సింహ్ రావ‌త్ ప‌ద‌వీ ప్ర‌మాణం స్వీక‌రించిన సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న కు అభినందనలు తెలిపారు.

‘‘ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి గా ప‌ద‌వీ స్వీకార ప్ర‌మాణం స్వీక‌రించిన @TIRATHSRAWAT కు ఇవే అభినంద‌న‌లు. ప‌రిపాలన ప‌రం గాను, సంస్థాగ‌త అంశాల ప‌రం గాను ఆయ‌న‌ కు అపార అనుభ‌వం ఉంది. ఆయ‌న నాయ‌క‌త్వం లో రాష్ట్రం ఎప్పటికప్పుడు పురోగ‌తి తాలూకు కొత్త శిఖ‌రాల ను అందుకొంటూ ఉంటుంద‌న్న న‌మ్మ‌కం నాలో ఉంది’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి  పేర్కొన్నారు.

***


(Release ID: 1703907)