హోం మంత్రిత్వ శాఖ

దేశంలో మహిళల భద్రత , భద్రతను పెంచడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేక చర్యలు తీసుకుంది

–ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం మహిళా సాధికారత కోసం గత 7 సంవత్సరాల్లో ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది

–మహిళా భద్రతా కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయి

– సకాలంలో , సమర్థవంతమైన పరిశోధన కోసం ఐటీఎస్ఎస్ఓ, ఎన్డీఎస్ఓ, క్రీ‌‌–మాక్ వంటి ఐటీ సేవలు, కొత్త పౌర సేవల వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.

–ఈ ఆన్‌లైన్ టూల్స్ను అన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని హోంమంత్రి అమిత్ షా సిఫార్సు చేశారు

–పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్‌లు (డబ్ల్యూహెచ్‌డీలు) ఏర్పాటు చేయడానికి, దేశంలోని అన్ని జిల్లాల్లో మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్లు (ఎహెచ్‌టియు) ఏర్పాటు / బలోపేతం చేయడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.200 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది

Posted On: 08 MAR 2021 2:10PM by PIB Hyderabad

దేశంలో మహిళల భద్రత , భద్రతను పెంచడానికి హోం మంత్రిత్వ శాఖ నిర్భయ ఫండ్ ద్వారా అనేక కార్యక్రమాలకు నిధులు అందిస్తున్నది. లైంగిక వేధింపుల కేసుల దర్యాప్తును సకాలంలో పూర్తి చేయడంతోపాటు, మహిళల భద్రతకు సంబంధించిన సమస్యలపై రాష్ట్రాలను / కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేయడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) లో ప్రత్యేక మహిళా భద్రతా విభాగం ఏర్పాటు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం మహిళా సాధికారత , వారి భద్రత , క్షేమం కోసం గత 7 సంవత్సరాల్లో అనేక చర్యలు తీసుకుంది. లైంగిక వేధింపుల వంటి ఘోరమైన ఘటనలకు వ్యతిరేకంగా కఠినమైన వైఖరి తీసుకొంది. భారత ప్రభుత్వం క్రిమినల్ లా సవరణ చట్టం 2018 ద్వారా అత్యాచార శిక్షను మరింత కఠినతరం చేసింది. చట్టంలోని సవరణలు కిందిస్థాయిలో సమర్థవంతంగా అమలు కావడానికి వివిధ కార్యక్రమాలను కేంద్ర హోంశాఖ  చేపట్టింది. వాటి పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. లైంగిక నేరాల దర్యాప్తు  వేగవంతం కోసం ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ (ఐటీఎస్ఎస్ఓ), లైంగిక నేరస్తుల జాతీయ డేటాబేస్ "(ఎన్డీఎస్ఓ), క్రి-మాక్ (క్రైమ్ మల్టీ-ఏజెన్సీ సెంటర్) , పౌర సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఐటీ కార్యక్రమాలు సమయానుసారంగా , సమర్థవంతంగా దర్యాప్తులో సహాయపడతాయి. హోం మంత్రి  అమిత్ షా  ఈ ఆన్‌లైన్ టూల్స్ను అన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు సమర్థవంతంగా ఉపయోగించాలని సిఫార్సు చేశారు.

ఐటీఎస్ఎస్ఓ , ఎన్డీఎస్ఓ

లైంగిక నేరాల ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ (ఐటీఎస్ఎస్ఓ) అనేది లైంగిక వేధింపుల కేసుల్లో పోలీసుల దర్యాప్తు సకాలంలో పూర్తి చేయడానికి  (ప్రస్తుతం క్రిమినల్ లా చట్టం 2018 ప్రకారం రెండు నెలలు), పర్యవేక్షించడానికి ప్రారంభించిన ఆన్‌లైన్ విశ్లేషణాత్మక టూల్.  తరచూ నేరాలను చేసేవారిని గుర్తించడానికి , లైంగిక నేరస్తుల గురించి హెచ్చరికలను అందుకోవడానికి నేషనల్ లైంగిక డేటాబేస్ ఆఫ్ లైంగిక అఫెండర్స్ (ఎన్డిఎస్ఓ)ను ప్రారంభించారు.  క్రిమినల్ కేసులను రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు దర్యాప్తు త్వరగా పూర్తి చేసేలా సహకరించడానికి ‘వాయిదా హెచ్చరిక విధానా’న్ని కూడా అభివృద్ధి చేశారు. దీని ప్రకారం, ఒక ప్రభుత్వ ప్రాసిక్యూటర్ ఒక క్రిమినల్ కేసులో రెండుసార్లు కంటే ఎక్కువ  వాయిదా వేస్తే, అటువంటి జాప్యాలను నివారించడానికి సీనియర్ అధికారులకు హెచ్చరికను ఈ వ్యవస్థ పంపుతుంది.

క్రి-మాక్

క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్ (క్రి-మాక్)ను గత ఏడాది మార్చి 12 న అన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ స్టేషన్లు , ఉన్నత కార్యాలయాల కోసం ప్రవేశపెట్టారు. ఘోరమైన నేరాలు , అంతర్-రాష్ట్ర నేరాల కేసులలో సమన్వయానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకునేందుకు ఈ సెంటర్ను ఉపయోగించుకోవచ్చు. నేరాలు , అంతర్-రాష్ట్ర నేరస్తులపై హెచ్చరికలు లేదా సంబంధిత సమాచారాన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ–మెయిల్ / ఎస్ఎంఎస్ ద్వారా పంపడానికి ఇది ఉపయోగపడుతుంది.

కొత్త పౌర సేవలు

మహిళలపై నేరాల సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగపడే పౌర సేవలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తన digitalpolicecitizenservice.gov.in పోర్టల్లో ప్రారంభించింది. ఈ సేవల్లో  ‘మిస్సింగ్ పర్సన్ సెర్చ్’ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.  గుర్తు తెలియని వ్యక్తి / గుర్తించని మృతదేహాల జాతీయ సమాచార నిధి ద్వారా ప్రజలు... తప్పిపోయిన తమ వారిని గుర్తించడానికి సహాయపడుతుంది.  ప్రకటిత నేరస్తుల గురించి తెలిస్తే ఆన్‌లైన్లో సమాచారాన్ని అందించడానికి సహాయపడే ‘ప్రకటిత నేరస్తులు’ అనే సర్వీసు కూడా ఇందులో ఉంది.

నిర్భయ ఫండ్ ప్రాజెక్టులు వేగవంతం

మహిళలకు రక్షణ , భద్రతను పెంచడానికి నిర్భయ ఫండ్ ద్వారా నిధులు సమకూర్చే ప్రాజెక్టులను కూడా కేంద్ర హోంశాఖ వేగంగా పర్యవేక్షిస్తోంది.  ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టం (ఈఆర్ఎస్ఎస్)’ అటువంటి ప్రాజెక్టుకు ఒక ఉదాహరణ. ఇది మనదేశంతోపాటు, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంఖ్య 112కు అత్యవసర పరిస్థితుల్లో డయల్ చేయాలి. ఈఆర్ఎస్ఎస్ ప్రస్తుతం దేశంలోని 34 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలలో పనిచేస్తోంది. మార్చి 2021 నాటికి ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతా లలో పనిచేస్తుందని భావిస్తున్నారు. 2019 ఫిబ్రవరి 18 న అధికారికంగా ప్రారంభించినప్పటి నుండి  ఈఆర్ఎస్ఎస్కు 11.48 కోట్ల ఫోన్కాల్స్ వచ్చాయి.  ప్రతిస్పందన సమయం 15.66 నిమిషాలు (31 జనవరి 2021 నాటికి) మాత్రమే. ‘112 ఇండియా’ మొబైల్ అప్లికేషన్ను 2019 ఫిబ్రవరి నుండి 9.98 లక్షల మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.  5.75 లక్షలకు పైగా యూజర్లు రిజిస్టర్ చేసుకోగా, వీరిలో 2.65 లక్షల మంది మహిళలు.

మహిళలపై సైబర్ నేరాలను అడ్డుకోవడానికి సైబర్ క్రైమ్ ప్రివెన్షన్

మహిళలపై , పిల్లలపై నేరాలు జరగకుండా ఆపడానికి సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ పై కూడా కేంద్ర హోంశాఖ చాలా శ్రద్ధచూపుతోంది. ఇది కీలకమైన అంశమని భావిస్తోంది. ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మిజోరం, ఒడిశా, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా 14 రాష్ట్రాలు సైబర్ ఫోరెన్సిక్ లాబ్లను ఏర్పాటు చేశారు. మహిళలపై, పిల్లలపై సైబర్ నేరాలను గుర్తించడం , పరిష్కరించడానికి 13,295 పోలీసులకు, ప్రాసిక్యూటర్లకు , జ్యుడిషియల్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చారు.  అసభ్యకర సమాచారం గురించి తెలియజేసేందుకు, దానిని బ్లాక్ చేయించేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ www.cybercrime.gov.in అనే పోర్టల్‌ను కూడా ప్రారంభించింది. అసభ్య సమాచారాన్ని  72 గంటల్లో తొలగిస్తారు. కొత్త పోర్టల్‌ను 2019 ఆగస్టు 30న కేంద్ర హోంశాఖ ప్రారంభించింది.

హ్యాకర్ మ్యాన్ ఆన్ ల్యాప్టాప్

భయం, సంకోచనం లేకుండా నేరాలపై ఫిర్యాదు చేసేలా మహిళలను ప్రోత్సహించడానికి  ఢిల్లీ పోలీసులు సోషల్ వర్కర్స్ & కౌన్సిలర్లను నియమించారు.  పోలీస్ స్టేషన్లు , సబ్ డివిజన్ స్థాయి కార్యాలయాలలో వీళ్లు పనిచేస్తారు.  హింసను ఆపడానికి వ్యక్తిగత , ఉమ్మడి స్థాయిలో 19316 సెషన్లను నిర్వహించారు.  ఢిల్లీ పోలీసులు 7550 సార్లు ఆత్మ రక్షణ శిక్షణా శిబిరాలను నిర్వహించారు.  వీటిలో 14,82,481 పాఠశాల / కళాశాల బాలికలు, గృహిణులు, శ్రామిక మహిళలు , పేదవర్గాల బాలలు శిక్షణ పొందారు. 2017 , 2018 సంవత్సరాలకుగానూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ కూడా ఈ విజయాన్ని ధృవీకరించింది. 1,23,084 మంది బాలికలు / మహిళలు ఎస్పీయూడబ్ల్యూఏసీ (మహిళలు & పిల్లల కోసం ప్రత్యేక యూనిట్) నిర్వహించిన 738 ఒకరోజు వర్క్‌షాప్స్లో పాల్గొన్నారు. లింగసమానత్వం పెంచడానికి 358 వర్క్‌షాప్‌లు జరిగాయి. ఇందులో పోలీసు అధికారులతో సహా 1,22,833 మంది పాల్గొన్నారు. ఎస్పీయూడబ్ల్యూఏసీ & ఎస్యూపీఎన్ఈఆర్ (నార్త్-ఈస్ట్ రీజియన్ కోసం స్పెషల్ యూనిట్) కోసం ఒక ఆధునిక కార్యాలయం మార్చి 2020 లో పూర్తయింది. ఢిల్లీ పోలీసులు వారి నిధులతో ఈ ప్రాజెక్టును కొనసాగిస్తున్నారు.

8 నగరాల్లో సేఫ్ సిటీ ప్రాజెక్టులు

నిర్భయ ఫండ్ ద్వారా 8 నగరాల్లో (అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై,  ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో , ముంబై) సేఫ్ సిటీ ప్రాజెక్టులను అమలులో చేస్తున్నారు. భారతదేశంలో మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా నేరస్తులు , నేరాల గురించి పోలీసులను అప్రమత్తం చేయడానికి సిసిటివి కెమెరాల ఏర్పాటు చేస్తారు. డ్రోన్లను ఉపయోగిస్తారు. స్మార్ట్ లైటింగ్ సిస్టమ్స్ వంటి టెక్నాలజీ-ఎనేబుల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉంటుంది. నేరాలకు అనువైన ప్రాంతాల్లో, సందుల్లో, టాయిలెట్ల వద్ద చీకటి పడగానే స్మార్ట్లైట్ సిస్టమ్స్ ద్వారా వీధి దీపాలు వెలుగుతాయి.  గూగుల్ మ్యాప్స్‌ద్వారా ఈ ప్రాంతాలను గుర్తించవచ్చు.

ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలను బలోపేతం చేయడం

ద్వారా భారతదేశంలో న్యాయ పరిపాలనను మెరుగుపరచడానికి కేంద్ర హోంశాఖ చేసిన మరో ప్రయత్నం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలను బలోపేతం చేయడం.  ఫోరెన్సిక్ సైన్స్  నేర పరిశోధనలో ఒక ముఖ్యమైన అంశం, ఎందుకంటే ఇది ఒక నేరంలో నిందితుడిని గుర్తించడానికి, కాలక్రమాన్ని నిర్ధారించడానికి , నేరానికి సంబంధించిన ఇతర వివరాలను నిర్ణయించడంలో అధికారులకు సాయపడుతుంది. మనదేశంలో ఫోరెన్సిక్ సైన్స్ సదుపాయాలను బలోపేతం చేసి, నేర పరిశోధనను మరింత మెరుగుపరచడానికి నిర్భయ ఫండ్ కూడా నిధులు సమకూరుస్తున్నది. చండీగఢ్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సిఎఫ్ఎస్ఎల్) లో అత్యాధునిక డీఎన్ఏ విశ్లేషణ సదుపాయాన్ని 2019 డిసెంబర్ 23 న ప్రారంభించారు. సంవత్సరానికి 2 వేల కేసులను పరిశీలించేలా ప్రయోగశాలను నిర్మించారు.  లైంగిక వేధింపులు , నరహత్య, మానవ విపత్తు బాధితుల గుర్తింపు, పితృత్వ యూనిట్ , మైటోకాన్డ్రియల్ కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయబడ్డాయి.

లైంగిక వేధింపుల కేసులలో సాక్ష్యాల పరిశీలనలో ప్రామాణీకరణ కోసం, దర్యాప్తు నాణ్యతను నిర్ధారించడానికి ఫోరెన్సిక్ సైన్సెస్ సర్వీసెస్ డైరెక్టరేట్ను ఏర్పాటు చేశారు. లైంగిక వేధింపుల కేసులలో ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరించడం, నిర్వహించడం , నిల్వ చేయడానికి మార్గదర్శకాలను ఇది తెలియజేసింది. దీనితో పాటు, లైంగిక వేధింపుల ఆధారాలను సేకరించే కిట్ను కూడా ప్రవేశపెట్టింది. ఈ మార్గదర్శకాలు,  కిట్పై దర్యాప్తు అధికారులు / ప్రాసిక్యూషన్ అధికారులు / వైద్య అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. మొత్తం 13602 మంది అధికారులకు బ్యూరో ఆఫ్ పోలీస్ రిఫార్మ్స్ & డెవలప్‌మెంట్ , లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్సెస్ తర్ఫీదు ఇచ్చింది. లైంగిక వేధింపుల కేసులలో ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, నిర్వహణ , రవాణా గురించి నేర్పించారు.  బిపిఆర్ & డి (బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ & డెవలప్మెంట్) 14,950 లైంగిక వేధింపుల సాక్ష్యం సేకరణ (ఎస్ఏఈసీ) కిట్లను రాష్ట్రాల , కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిణీ చేసింది. ఈ కిట్లు లైంగిక వేధింపుల కేసులలో ఫోరెన్సిక్ సాక్ష్యాలను సమర్ధవంతంగా సేకరించడం, నిర్వహించడం , నిల్వ చేయడానికి దోహదపడతాయి.

 పోలీస్ స్టేషన్లలో ఉమెన్ హెల్ప్ డెస్క్‌లు (డబ్ల్యూహెచ్‌డీలు) ఏర్పాటు చేయడానికి, దేశంలోని అన్ని జిల్లాల్లోనూ, ప్రమాదకర సరిహద్దుల్లో కూడా మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్లను (ఎహెచ్‌టియు) ఏర్పాటు చేయడానికి / బలోపేతం చేయడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 200 కోట్లను కేటాయించారు. మహిళలు , పిల్లల భద్రత , భద్రతకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకోసం అనేక ప్రాజెక్టులు అమలవుతున్నాయి. ఇవి రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలను సురక్షిత నివాస ప్రాంతాలుగా మార్చడమే కాకుండా దేశంలోని మహిళలు స్వతంత్రంగా జీవించడానికి తోడ్పడుతాయి. 

***


(Release ID: 1703355) Visitor Counter : 1275