రైల్వే మంత్రిత్వ శాఖ

ప్రయాణ సమయంలో అన్ని రకాల ప్రశ్నలు / ఫిర్యాదులు / సహాయం కోసం సమగ్ర-రైల్-మదద్-హెల్ప్‌-లైన్-నంబర్ “139” ను ప్రకటించిన - భారతీయ రైల్వే

విచారణ కోసం, రోజుకు, సగటున, 3,44,513 కాల్స్ మరియు ఎస్.ఎమ్.ఎస్. లను అందుకుంటున్న - రైల్-మదద్- హెల్ప్-లైన్-139-సర్వీసు.


# వన్-రైల్-వన్-హెల్ప్‌-లైన్-139 అందించే సేవలపై ప్రయాణీకులకు సమాచారం ఇవ్వడానికి, అవగాహన కల్పించడానికి, సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించిన - రైల్వే మంత్రిత్వ శాఖ





Posted On: 08 MAR 2021 4:25PM by PIB Hyderabad

రైల్వే ప్రయాణ సమయంలో ఫిర్యాదులు, విచారణల కోసం వివిధ హెల్ప్-‌లైన్-నంబర్లను వినియోగించడంలో ఉన్న అసౌకర్యాన్ని అధిగమించడానికి, భారతీయ రైల్వే,  ప్రయాణంలో సత్వర ఫిర్యాదుల పరిష్కారం మరియు విచారణ కోసం, అన్ని రైల్వే హెల్ప్-లైన్లను ఒకే నంబర్ 139 (రైల్-మదద్-హెల్ప్-లైన్) లోకి విలీనం చేసింది.  కొత్త హెల్ప్-లైన్-నంబర్-139,  ఇప్పటికే ఉన్న అన్ని హెల్ప్-లైన్-నంబర్లను తన పరిధిలోకి తీసుకోవడంతో,  ప్రయాణీకులకు ఈ నంబర్‌ను గుర్తుంచుకోవడంతో పాటు, ప్రయాణ సమయంలో వారి అన్ని అవసరాలకు రైల్వేతో అనుసంధానం కావడం సులభమవుతుంది. 

వివిధ రైల్వే ఫిర్యాదుల హెల్ప్-‌లైన్ సర్వీసులను గత ఏడాది నిలిపివేయడం జరిగింది.  ఇప్పుడు, హెల్ప్‌-లైన్ నెంబర్ 182 సర్వీసును కూడా 2021 ఏప్రిల్, 1వ తేదీ నుండి నిలిపివేసి, 139 నెంబరు సర్వీసుతో విలీనం చేయడం జరుగుతుంది. 

హెల్ప్-‌లైన్-139 సర్వీసు, ఇప్పుడు,  పన్నెండు భాషల్లో అందుబాటులో ఉంటుంది.  ప్రయాణీకులు ఐ.వి.ఆర్.ఎస్. (పరస్పరం మాట్లాడుకునే ప్రతిస్పందన విధానం) ను ఎంచుకోవచ్చు. లేదా, * (నక్షత్రం) గుర్తును నొక్కడం ద్వారా నేరుగా కాల్-సెంటర్ ఎగ్జిక్యూటివ్ తో అనుసంధానం కావచ్చు.  139 నెంబర్ కు ఫోను చెయ్యడానికి, స్మార్ట్-ఫోన్ అవసరం లేదు, తద్వారా మొబైల్ వినియోగదారులందరికీ ఈ సర్వీసు సులభంగా అందుబాటులో ఉంటుంది.

139 నెంబర్-హెల్ప్-‌లైన్-సర్వీసుకు, విచారణ కోసం, రోజుకు, సగటున, 3,44,513 కాల్స్ / ఎస్.ఎమ్.ఎస్.లు వస్తాయి.

139 నెంబర్-హెల్ప్-‌లైన్ (ఐ.వి.ఆర్.ఎస్.) లో లభించే సేవలు ఈ విధంగా ఉన్నాయి: 

*          భద్రత మరియు వైద్య సహాయం కోసం, ప్రయాణీకుడు 1 నెంబరు నొక్కాలి, ఇది వెంటనే సంబంధిత కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ ‌కు అనుసంధానిస్తుంది.

*          విచారణ కోసం, ప్రయాణీకుడు 2 నెంబరు నొక్కాలి. అప్పుడు ఈ కింది సేవల గురించిన సమాచారం లభిస్తుంది. పి.ఎన్.ఆర్. పరిస్థితి కి సంబంధించిన సమాచారం;  రైళ్ళ రాక,పోకల సమాచారం;  వసతి సదుపాయం; ఛార్జీల విచారణ;  టికెట్ బుకింగ్;  సిస్టమ్ ద్వారా టికెట్ రద్దు;  మేల్కొలిపే అలారం సౌకర్యం / గమ్యం తెలియజేసే హెచ్చరిక; చక్రాల కుర్చీ బుకింగ్;  భోజనం బుకింగ్; వంటి సౌకర్యాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. 

*          సాధారణ ఫిర్యాదుల కోసం, ప్రయాణీకులు 4 నెంబరు నొక్కాలి. 

*           విజిలెన్స్ (నిఘా) కు సంబంధిత ఫిర్యాదుల కోసం, ప్రయాణీకులు 5 నెంబరు నొక్కాలి. 

*          పార్సెళ్ళు మరియు వస్తువుల రవాణాకు సంబంధించిన ప్రశ్నల కోసం, ప్రయాణీకులు 6 నెంబరు నొక్కాలి. 

*         ఐ.ఆర్.‌సి.టి.సి.ద్వారా నడిచే రైళ్లకు సంబంధించిన ప్రశ్నల కోసం, ప్రయాణీకులు 7 నెంబరు నొక్కాలి.

*          ఫిర్యాదుల పరిస్థితి తెలుసుకోడానికి, ప్రయాణీకులు 9 నెంబరు నొక్కాలి

*          కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌ తో మాట్లాడటానికి, ప్రయాణీకులు * (నక్షత్రం) నొక్కాలి. 

# వన్-రైల్-వన్-హెల్ప్‌లైన్-139 అందించే సేవలపై ప్రయాణీకులకు సమాచారం ఇవ్వడానికి, అవగాహన కల్పించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా ప్రారంభించింది.

 

****



(Release ID: 1703326) Visitor Counter : 99