ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడులో పెరుగుతున్న కోవిడ్ కేసులు మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలకు ఉన్నతస్థాయి బృందాలను పంపిన కేంద్రం

భారత్ లో 2 కోట్లు దాటిన కోవిడ్ టీకా డోసుల పంపిణీ

గత 24 గంటల్లో 14 లక్షలకు పైగా టీకాల పంపిణీ

Posted On: 07 MAR 2021 11:32AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలలో కోవిడ్ కేసుల పెరుగుదల నమోదవుతోంది. అవి: మహారాష్ట, కేరళ, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడు. గత 24 గంటలలో 18,711కొత్త కోవిడ్ కేసులు రాగా అందులో 84.71% కేసులు ఈ రాష్టాలవే. మహారాష్ట్రలో అత్యధికంగా 10,187 కేసులు రాగా, కేరళలో 2,791, పంజాబ్ లో  1,159 కొత్త కేసులు వచ్చాయి.

ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల విషయంలో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వస్తోంది. మహారాష్ట్ర, పంజాబ్ లో నెలకొన్న పరిస్థితి దృష్ట్యా ఉన్నత స్థాయి బృందాలను కేంద్రం హుటాహుటిన  పంపింది. మొత్తం ఎనిమిది రాష్ట్రాలలో కోవిడ్ కేసుల పెరుగుదల కనబడుతోంది.

 

భారత్ లో చికిత్సలో ఉన్న కేసుల సంఖ్య ఈ రోజుకు  1,84,523కి చేరింది.  దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కెసులలో వీరి వాటా 1.65% . 2021 జనవరి 17 నుంచి మార్చి 7 వరకు రోజు రోజుకూ చికిత్సలో ఉన్నవారి సంఖ్యలో మార్పును ఈ దిగువ చిత్రపటం చూపుతోంది.

 

టీకా డోసుల పంపిణీ ఈరోజుకు 2 కోట్లు పైబడి 2,09,22,344 కు చేరింది.  ఇందుకోసం మొత్తం  3,39,145 శిబిరాలు నిర్వహించారు. ఇందులో  69,82,637 మంది మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, రెండో విడత 35,42,123 డోసులందుకున్న  ఆరోగ్య సిబ్బంది,  65,85,752 మొదటి డోసులందుకున్న కోవిడ్ యోధులు, 2,11,918 రెండో విదత డోసులందుకున్న  కోవిడ్ యోధులు,  45 ఏళ్ళు పైబడి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న 4,76,041 మంది, 60 ఏళ్ళు పైబడిన 31,23,873 మంది మొదటి డోస్ అందుకున్నవారున్నారు. 

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 - 60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్ళు పైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

69,82,637

35,42,123

65,85,752

2,11,918

4,76,041

31,23,873

2,09,22,344

 

టీకాల కార్యక్రమం మొదలైన 50వ రోజైన మార్చి6  నాడు, టీకా డోసుల సంఖ్య 14 లక్షలు దాటి  14,24,693  చేరింది. అందులో  11,71,673 మంది లబ్ధిదారులు 17,654 శిబిరాలలో టీకాలందుకున్న మొదటి డోస్ ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు ఉందగా 2,53,020 మంది కోవిడ్ యోధులు, ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ అందుకున్నవారున్నారు.    

తేదీ: మార్చి 6,  2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 - 60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

1వ డోస్

2వ డోస్

66,976

1,85,293

2,29,763

67,727

1,29,295

7,45,639

11,71,673

2,53,020

 

గత 24 గంతలలో 100 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అందులో 87 శాతం మంది ఆరు రాష్ట్రాలవారే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 47 మంది మరణించగా కేరళలో 16 మంది, పంజాబ్ లో 12 మంది చనిపోయారు.

 

చిత్రపటంలో చూపినవిధంగా గత రెండు వారాల్లో 10 రాష్ట్రాలలో ఒక కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 1నుంచి 10 లోపు మరణాలు నమోదయ్యాయి.  

19 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, ఉత్తరాఖండ్,  గోవా, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, సిక్కిం, లక్షదీవులు, లద్దాఖ్, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, త్రిపుర, మిజోరం, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్  .

****


(Release ID: 1703028) Visitor Counter : 252