ప్రధాన మంత్రి కార్యాలయం
వ్యవసాయానికి, రైతుల సంక్షేమానికి సంబంధించి బడ్జెటు లో ప్రస్తావించిన అంశాలను ప్రభావవంతంగా అమలుపరచడం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
వ్యవసాయ రంగం లో పరిశోధన, అభివృద్ధి దిశ గా ప్రైవేటు రంగం తోడ్పాటు మరింతగా పెరగాలని ఆయన స్పష్టంచేశారు
చిన్న రైతులకు సాధికారిత కల్పన అనేది ప్రభుత్వ దార్శనికత లో కీలకం గా ఉంది: ప్రధాన మంత్రి
శుద్ధిపరచిన ఆహారానికి ప్రపంచంలోనే పేరెన్నిక గన్న బజారు గా మన దేశ వ్యవసాయ రంగాన్ని విస్తరించి తీరాలి: ప్రధాన మంత్రి
Posted On:
01 MAR 2021 12:51PM by PIB Hyderabad
వ్యవసాయానికి, రైతుల సంక్షేమానికి సంబంధించి బడ్జెటు లో ప్రస్తావించిన అంశాలను ప్రభావవంతం గా అమలుపరచడం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ వెబినార్ లో వ్యవసాయ రంగానికి, పాడి రంగానికి, చేపల పెంపకం రంగానికి చెందిన నిపుణుల తో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి సార్వజనిక, ప్రైవేటు, సహార రంగ ప్రతినిధులు, బ్యాంకుల ప్రతినిధులు,కేంద్ర వ్యవసాయ మంత్రి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, చిన్న రైతులను కేంద్ర స్థానంలో నిలుపుకొన్న ప్రభుత్వ దార్శనికత ను గురించి వివరించారు. చిన్న రైతులకు సాధికారిత ను కల్పించడం అనేది భారతదేశంలో వ్యవసాయాన్ని అనేక సమస్యల బారి నుంచి విముక్తం చేయడం లో ఎంతగానో తోడ్పడుతుందని కూడా ఆయన అన్నారు. వ్యవసాయ పరపతి లక్ష్యాన్ని 16,50,000 కోట్ల రూపాయలకు పెంచడం, పశు పోషణ కు, పాడి రంగానికి, చేపల రంగానికి ప్రాధాన్యాన్ని ఇవ్వడం, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన నిధి ని 40,000 కోట్ల రూపాయలకు పెంచడం, సూక్ష్మ సేద్యానికి కేటాయింపులను రెండింతలు చేయడం, త్వరగా పాడైపోతుండే 22 ఉత్పత్తులకు వర్తించే విధం గా ఆపరేశన్ గ్రీన్ స్కీమ్ పరిధి ని విస్తరించడం, 1000కి పైగా మండీల ను ఇ-ఎన్ఎఎమ్ (e-NAM) తో జోడించడం వంటి కేంద్ర బడ్జెటు లో చేసిన ప్రస్తావనల ను గురించి ఆయన ప్రముఖం గా ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తులు అదే పని గా పెరుగుతూ పోతున్న నేపథ్యం లో, పంటకోత ల అనంతర కాలానికి సంబంధించినటువంటి విప్లవం (లేదా ఫూడ్ ప్రోసెసింగ్ రెవలూశన్ ఎండ్ వేల్యూ అడిశన్) భారతదేశం లో చోటు చేసుకోవలసిన అవసరం ఎంతయినా ఉందని ఆయన నొక్కిచెప్పారు. ఈ దిశ లో రెండు మూడు దశాబ్దుల కిందటే కృషి జరిగివుండి ఉంటే అది దేశానికి ఎంతో మేలు ను చేసివుండేది అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆహార ధాన్యాలు, కాయగూరలు, పండ్లు, చేపల వంటి వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్క రంగం లో ప్రోసెసింగు ను అభివృద్ధిపరచవలసి ఉంది అంటూ ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. దీనికోసం, రైతులు వారి గ్రామాల సమీపం లో నిలవ సదుపాయాలను కలిగివుండడం కీలకం అని ఆయన అన్నారు. పంట ను పొలాల నుంచి ప్రోసెసింగ్ యూనిట్ ల దగ్గరకు తీసుకుపోయే వ్యవస్థ మెరుగుపడాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఈ యూనిట్ లకు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ (ఎఫ్ పిఒ స్) చేదోడు గా నిలవాలి అని ఆయన స్పష్టంచేశారు. రైతులు వారి పంట ను అమ్ముకోవడానికి ఉన్న ఐచ్ఛికాలను విస్తరించవలసిన అవసరం ఎంతయినా ఉందని ఆయన అన్నారు. ‘‘ ప్రోసెస్ డ్ ఫూడ్ కు గ్లోబల్ మార్కెట్ గా మనం మన వ్యవసాయ రంగాన్ని విస్తరించుకోవాలి. మనం పల్లెకు దగ్గర గా ఎగ్రో-ఇండస్ట్రీస్ క్లస్టర్ స్ సంఖ్య ను పెంచుకొని తీరాలి. అది జరిగినప్పుడు పల్లె ప్రజలు వ్యవసాయానికి సంబంధించిన ఉపాధి ని పల్లె లోనే పొందగలుగుతారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కార్యం లో ఆర్గానిక్ క్లస్టర్ స్, ఎక్స్ పోర్ట్ క్లస్టర్ స్ కూడా ఒక పెద్ద పాత్ర ను పోషించగలుగుతాయి అని ఆయన అన్నారు.
భారతదేశం ప్రపంచంలో చేపలను ఉత్పత్తి చేసే, చేపలను ఎగుమతి చేసే పెద్ద దేశాలలో ఒక దేశం గా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ బజారు లో ప్రోసెస్ డ్ ఫిశ్ విభాగం లో మన ఉనికి చాలా పరిమితం గానే ఉందని, ఇది విచారకరమని ప్రధాన మంత్రి అన్నారు. ఈ స్థితి ని మార్చడం కోసం సంస్కరణల కు అదనం గా, తినడానికి సిద్ధం గా ఉండే ఉత్పత్తులకు, వండుకోవడానికి సిద్ధం చేసిన ఉత్పత్తులకు, ప్రోసెస్ చేసిన పండ్లకు, కూరగాయలకు, ప్రోసెస్ డ్ సీఫూడ్ కు, మోసరెల్లా జున్ను వంటి ఉత్పత్తులను ప్రోత్సహించడానికి సుమారు 11,000 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించిందని ఆయన అన్నారు. ఆపరేశన్ గ్రీన్స్ లో పండ్లు, కాయగూరల రవాణా కు 50 శాతం తగ్గింపు ను ఇవ్వడం జరుగుతోంది అని ఆయన చెప్పారు. గడచిన 6 నెలల కాలంలో, దాదాపు 350 కిసాన్ రైళ్లను నడపడమైందని, సుమారు 1,00,000 మెట్రిక్ టన్నుల పండ్లను, కాయగూరలను ఈ రైళ్ల ద్వారా చేరవేయడం జరిగిందని తెలిపారు. కిసాన్ రైల్ యావత్తు దేశం లో శీతలీకరణ నిలవ కు ఒక పటిష్టమైన మాధ్యమం గా ఉంది అని ఆయన చెప్పారు.
ఆత్మనిర్భర్ భారత్ ప్రచార ఉద్యమం లో భాగం గా దేశం లో వివిధ జిల్లాల లో పండ్లు, కాయగూరల ప్రోసెసింగు కు క్లస్టర్ స్ ను ఏర్పాటు చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. లక్షల కొద్దీ మైక్రో ఫూడ్ ప్రోసెసింగ్ యూనిట్ లకు ప్రైం మినిస్టర్ మైక్రో ఫూడ్ ప్రోసెసింగ్ ఇంటర్ ప్రైజెజ్ అప్ గ్రెడేశన్ స్కీమ్ లో భాగం గా సాయం అందించడం జరుగుతోందన్నారు. చిన్న రైతులకు గంటల వారీ అద్దె ప్రాతిపదిక న ట్రాక్టర్ లు గాని, స్ట్రా మశీన్ లు గాని, లేదా మరే ఇతర వ్యావసాయిక యంత్ర పరికరాలను గాని సమకూర్చడం వంటి చౌకయినటువంటి, ప్రభావవంతమైనటువంటి ఐచ్ఛికాలను సమకూర్చేందుకు గాను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించవలసివుంది అని ఆయన నొక్కి చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తి ని బజారు కు చేరవేసేందుకు ట్రక్ అగ్రిగిటర్ స్ సేవలను వినియోగించుకోవచ్చని ఆయన అన్నారు. దేశం లో భూ స్వస్థత కార్డు సదుపాయాన్ని మరింత మంది కి కల్పించవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టంచేశారు. రైతులకు వారి భూమి స్వస్థత పట్ల చైతన్యాన్ని మరింత గా పెంచడం వల్ల పంట ఉత్పత్తి మెరుగుపడగలుగుతుంది అని ఆయన అన్నారు.
వ్యవసాయ రంగం లో పరిశోధన, అభివృద్ధి (ఆర్ ఎండ్ డి) దిశ లో ప్రైవేటు రంగం తోడ్పాటు మరింతగా పెరగవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. రైతులు వరిని, గోధుమలను పెంచడానికి మాత్రమే పరిమితం కాకుండా ఉండేటట్లుగా వారికి ఇప్పుడు మనం
ఐచ్ఛికాలను ఇవ్వవలసివుంది అని కూడా ఆయన అన్నారు. సేంద్రియ ఆహారం మొదలుకొని సలాడ్ సంబంధిత కాయగూరల పట్ల ప్రయత్నాలు చేయవచ్చును, అటువంటి పంటలు అనేకం ఉన్నాయి అని ఆయన చెప్పారు. సీవీడ్, బీజ్ వాక్స్ వంటి వాటికి గల బజారు ను ఉపయోగించుకోవాలి అని ఆయన నొక్కి వక్కాణించారు. సీవీడ్ సాగు, బీజ్ వాక్స్ సాగు మన మత్స్య కారులకు, తేనెటీగల పెంపకం దారులకు అదనపు రాబడి ని తెచ్చిపెడతాయి అని ఆయన చెప్పారు. ప్రైవేటు రంగం ప్రాతినిధ్యం పెరిగితే అది రైతు విశ్వాసాన్ని పెంచగలుగుతుంది అని కూడా ఆయన అన్నారు.
భారతదేశం లో ఒప్పంద ప్రాతిపదికన సాగు చేయడం అనేది ఏదో ఒక రూపం లో చాలా కాలం నుంచి ఉందని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. ఒప్పంద ప్రాతిపదికన సాగు చేయడం అనేది కేవలం ఒక వ్యాపార భావన గా మిగిలిపోకుండా భూమి దిశ లోనూ మన బాధ్యత ను మనం నెరవేర్చుకోవాలి అని ఆయన నొక్కిచెప్పారు.
సేద్యం నుంచి విత్తడం వరకు, పంట కోతల నుంచి ఆర్జన వరకు ఒక సమగ్రమైనటువంటి సాంకేతికత నిండిన పరిష్కారం కోసం దేశ సాగు రంగం లో ఉమ్మడి కృషి జరగాలి అని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగానికి అనుబంధం గా ఉండేటటువంటి స్టార్ట్ అప్స్ ను మనం ప్రోత్సహించి, యువత తో జతపరచాలి అని ఆయన అన్నారు. కొన్ని సంవత్సరాలు గా కిసాన్ కార్డు లను చిన్న, సన్నకారు రైతులకు, పశువుల పెంపకందారులకు, చేపలను పట్టుకొనే వారికి వర్తింపచేయడమైందని, కిందటి సంవత్సరం లో 1.80 కోట్లకు పైగా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. పరపతి లభ్యత సైతం 6-7 సంవత్సరాల క్రితం తో పోలిస్తే రెట్టింపు నకు మించిందని ఆయన తెలిపారు. 10,000 ఎఫ్ పిఒలతో ఏర్పాటు లు సహకార సంఘాల ను బలోపేతం చేస్తున్నాయి అని ఆయన అన్నారు.
***
(Release ID: 1701790)
Visitor Counter : 315
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam