ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, తమిళనాడు, గుజరాత్ లో పెరుగుతున్న కోవిడ్

కేసులు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సమీక్షాసమావేశాల్లో కోరిన కేంద్రం సమర్థవంతంగా నియంత్రించాలని రాష్ట్రాలకు ఆదేశం

కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు తరలిన ఉన్నత స్థాయి కేంద్ర బృందాలు

Posted On: 28 FEB 2021 11:18AM by PIB Hyderabad

దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు ఈరోజుకు 1,64,511 చేరాయి.  భారత్ లో నమోదైన మొత్తం కోవిడ్ కేసులలో ఇవి 1.48%. గత 24 గంటలలో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్నాటక, తమిళనాడు, గుజరాత్ లో కొత్త కోవిడ్ కేసులు పెరిగితున్నాయి. ఈ ఆరు రాష్ట్రాలనుంచే  86.37% కేసులు వచ్చాయి. గత 24 గంటలలో 16,752 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధిక కేసులు రావటం కొనసాగుతోంది. అత్యధికంగా ఆ రాష్టంలో 8,623 కేసులు రాగా కేరళలో 3,792 పంజాబ్ లో 593 కొత్త కేసులు వచ్చాయి.

రోజువారీ కొత్త కేసుల పెరుగుదల ఎనిమిది రాష్ట్రాలలో కనబడుతోంది.


 

ఎక్కువ కోవిడ్ కేసులు వస్తున్న రాష్టాలతో కేంద్రం క్రమం తప్పకుందా సమాలోచనలు సాగిస్తూ ఉంది.నిన్న కాబినెట్ కార్యదర్శి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిపారు.  కేసులు బాగా పెరుగుతున్న రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో జరిపిన సమీక్షలో తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, జమ్మూ-కశ్మీర్, పశ్చిమ బెంగాల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

కోవిడ్ ను నియంత్రించే వ్యవహారంలో రాష్ట్రాలు కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా కాబినెట్ కార్యదర్శి సూచించారు. ఏడాదిపాటు పడిన కష్టం చేజారకుండా చూడాలన్నారు. కోవిడ్ నియంత్రణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని కచ్చితంగా అనుసరిస్తూ అందరూ జాగ్రత్తలు పాటించేలా చూడాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించి వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

వ్యాధి నిర్థారణ పరీక్షలు సమర్థంగా నిర్వహించటం, పాజిటివ్ గా నిర్థారణ అయిన వారిని ఇసొలేషన్ కు తరలించటం, సమర్థవంతమైన చికిత్స అందించటం, వ్యాధి సోకే అవకాశమున్నవారిని గుర్తించటం లాంటి చర్యలు చేపట్టాలని కోరారు.

కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, చత్తీస్ గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్, జమ్మూ-కశ్మీర్, లో కేసులు ఎక్కువగా వస్తున్న దృష్ట్యా ఉన్నత స్థాయి కేంద్రబృందాలను కేంద్రం అక్కడికి పంపింది. ఒక్క సారిగా కేసుల పెరుగుదలకు కారణాలు అన్వేషించటం, రాష్ట్రాలతో సమన్వయం సాధించి వ్యాధిని నియంత్రించటం మీద ఈ బృందాలు దృష్టిసారిస్తున్నాయి.

కోవిడ్ టీకాల విషయానికొస్తే, ఈరోజు ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారాన్ని బట్టి మొత్తం 1,43,01,266 టీకా డోసులను  2,92,312 శిబిరాల ద్వారా అందించారు.  ఇందులో మొదటో డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది 66,69,985 మంది, రెండో డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది 24,56,191 మంది, మొదటి డోస్ అందుకున్న కోవిడ్ యోధులు  51,75,090 మంది ఉన్నారు.

భారత్ రెండో దశ కోవిడ్ టీకాల కార్యక్రమం మార్చి 1 నుంచి ప్రారంభించటానికి సిద్ధమైంది. 60 ఏళ్ళు పైబడిన వారందరికీ ఈ రెండో దశ టీకాల కార్యక్రమంలో టీకాలు ఇస్తారు. అదే విధంగా 45 ఏళ్ళు పైబడ్డ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు కూడా ఈ దశలోనే ఇస్తారు.  కోవిడ్ టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయటానికి  ఆయుష్మాన్ భారత్ పిఎం జె ఎ వై కింద 10000 ప్రభుత్వ ఆస్పత్రులతోబాటు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ( సి జి హెచ్ ఎస్ ) కింద దాదాపు 600 ప్రైవేట్ ఆస్పత్రులను కూడా సిద్ధం చేశారు.  రాష్ట ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం కింద ఎంపానెల్ అయిన ఇతర ప్రైవేట్ ఆస్పత్రులు కూడా కోవిడ్ టీకాల కార్యక్రమంలో పాల్గొనవచ్చు.

రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వినియోగించుకోదగిన సి జి హెచ్ ఎస్ ఎంపానెల్ అయిన టీకా కేంద్రాల జాబితాను ఈ లింక్ లో చూడవచ్చుhttps://www.mohfw.gov.in/pdf/CGHSEmphospitals.xlsx

ఆయుష్మాన్ భారత్ – పిఎం జె  ఎ వై లో ఎంపానెల్ అయిన టీకా కేంద్రాల జాబితా ఈ లింక్ లో చూడవచ్చు:

https://www.mohfw.gov.in/pdf/PMJAYPRIVATEHOSPITALSCONSOLIDATED.xlsx

ఇప్పటిదాకా కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,07,75,169 కాగా, గత 24 గంటలలో 11,718 మంది కోలుకున్నారు. వీరిలో 84.19% మంది కేవలం ఆరు రాష్ట్రాలకు చెందినవారు.కేరళలో అత్యధికంగా ఒక రోజులో  4,650 మంది కొత్తగా కోలుకున్నారు. మహారాష్ట్రలోనే 3,648 మంది కోలుకోగా తమిళనాడులో  491 మంది కోలుకున్నారు.

గత 24 గంటలలో 113 కోవిడ్ మరణాలు సంభవించగా 84.96% మంది కేవలం ఆరు రాష్టాల్లోనే ఉన్నారు. మహారాష్టలో అత్యధికంగా 51 మంది చనిపోగా కేరళలో 18 మంది, పంజాబ్ లో 11 మంది చనిపోయారు

గత 24 గంటలలో 19 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, ఒడిశా, గోవా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, లక్షదీవులు, మణిపూర్, సిక్కిం, లద్దాఖ్, మిజోరం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, అండమాన్-నికోబార్ దీవులు, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, అరుణాచల్ ప్రదేశ్  

***



(Release ID: 1701544) Visitor Counter : 175