ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా 2400 లాబ్ లలో ఇప్పటిదాకా 21.15 కోట్ల కోవిడ్ పరీక్షలు
దేశమంతటా మొత్తం కోటీ 11 లక్షల డోసులు టీకాల పంపిణీ గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణమూ నమోదు కాని 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గత 24 గంటలలో కొత్త కోవిడ్ కేసులు నమోదు కాని 7 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
Posted On:
22 FEB 2021 1:04PM by PIB Hyderabad
భారత దేశంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 21,15,51,746 కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరిగాయి. గత 24 గంటలలో 6,20,216 పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ నిర్థారణ పరీక్షల కోసం లాబ్ ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతమున్న 2393 లాబ్ లలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 1220 ఉండగా ప్రైవేట్ రంగంలో 1173 ఉన్నాయి. దీంతో రోజువారీ పరీక్షల సామర్థ్యం బాగా పెరిగింది. భారత్ లో ప్రస్తుతం పాజిటివ్ శాతం 5.20% గా నమోదైంది.
ప్రతి పది లక్షల జనాభాలో పరీక్షల సంఖ్య పెరుగుతూ ప్రస్తుతం 1,53,298.4 కి చేరింది.
2021 ఫిబ్రవరి 22 వతేదీ ఉదయం 8 గంటలకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 2,32,317 శిబిరాల ద్వారా 1,11,16,854 టీ కాలు ఇవ్వటం పూర్తయింది. ఇందులో 63,97,849 మంది ఆరోగ్య సిబ్బంది మొదటి డోస్ అందుకోగా 9,67,852 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్, 37,51,153 మంది కొవిడ్ యోధులు మొదటి డోస్ తీసుకున్నారు. మొదటి డోస్ తీసుకొని 28 రోజులు పూర్తయినవారికి రెండో డోస్ కోవిడ్ టీకాలివ్వటం ఫిబ్రవరి 13న మొదలైంది. కోవిడ్ యోధులకు టీకాలివ్వటం ఫిబ్రవరి 2న మొదలైంది.
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం
|
టీకా లబ్ధిదారులు
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
మొత్తం డోసులు
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
4,846
|
1,306
|
6,152
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
4,13,678
|
89,645
|
5,03,323
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
19,702
|
4,041
|
23,743
|
4
|
ఆస్సాం
|
1,54,754
|
11,050
|
1,65,804
|
5
|
బీహార్
|
5,22,811
|
39,046
|
5,61,857
|
6
|
చండీగఢ్
|
12,953
|
795
|
13,748
|
7
|
చత్తీస్ గఢ్
|
3,41,251
|
20,699
|
3,61,950
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
4,939
|
244
|
5,183
|
9
|
డామన్, డయ్యూ
|
1,735
|
213
|
1,948
|
10
|
ఢిల్లీ
|
2,94,081
|
17,329
|
3,11,410
|
11
|
గోవా
|
15,070
|
1,113
|
16,183
|
12
|
గుజరాత్
|
8,22,193
|
60,925
|
8,83,118
|
13
|
హర్యానా
|
2,08,308
|
23,987
|
2,32,295
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
95,105
|
12,092
|
1,07,197
|
15
|
జమ్మూ కశ్మీర్
|
2,00,695
|
6,731
|
2,07,426
|
16
|
జార్ఖండ్
|
2,54,531
|
11,484
|
2,66,015
|
17
|
కర్నాటక
|
5,41,332
|
1,14,043
|
6,55,375
|
18
|
కేరళ
|
3,99,284
|
38,829
|
4,38,113
|
19
|
లద్దాఖ్
|
5,827
|
600
|
6,427
|
20
|
లక్షదీవులు
|
1,809
|
115
|
1,924
|
21
|
మధ్యప్రదేశ్
|
6,40,805
|
3,778
|
6,44,583
|
22
|
మహారాష్ట్ర
|
8,78,829
|
47,637
|
9,26,466
|
23
|
మణిపూర్
|
40,215
|
1,711
|
41,926
|
24
|
మేఘాలయ
|
23,877
|
629
|
24,506
|
25
|
మిజోరం
|
14,627
|
2,241
|
16,868
|
26
|
నాగాలాండ్
|
21,526
|
3,909
|
25,435
|
27
|
ఒడిశా
|
4,38,127
|
94,966
|
5,33,093
|
28
|
పుదుచ్చేరి
|
9,251
|
853
|
10,104
|
29
|
పంజాబ్
|
1,22,527
|
14,269
|
1,36,796
|
30
|
రాజస్థాన్
|
7,82,701
|
38,358
|
8,21,059
|
31
|
సిక్కిం
|
11,865
|
700
|
12,565
|
32
|
తమిళనాడు
|
3,39,686
|
31,160
|
3,70,846
|
33
|
తెలంగాణ
|
2,80,973
|
87,159
|
3,68,132
|
34
|
త్రిపుర
|
82,369
|
11,587
|
93,956
|
35
|
ఉత్తరప్రదేశ్
|
10,66,290
|
85,752
|
11,52,042
|
36
|
ఉత్తరాఖండ్
|
1,31,384
|
7,166
|
1,38,550
|
37
|
పశ్చిమ బెంగాల్
|
6,39,252
|
49,912
|
6,89,164
|
38
|
ఇతరములు
|
3,09,794
|
31,778
|
3,41,572
|
మొత్తం
|
1,01,49,002
|
9,67,852
|
1,11,16,854
|
టీకాల కార్యక్రమం మొదలైన 37 వ రోజైన ఫిబ్రవరి 21న 31,681 టీకా డోసులు ఇచ్చారు. అందులో 24,471 మంది లబ్ధిదారులకు 1,429 శిబిరాల ద్వారా మొదటి డోసు ( ఆరోగ్య సిబ్బందికి, కోవిడ్ యోధులకు) ఇవ్వగా 7,210 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ తీసుకున్నవారున్నారు.
మొత్తం 1,11,16,854 టీకా డోసులలో 1,01,49,002 డోసులు ఆరోగ్య సిబ్బందికి, కోవిడ్ యోధులకు ఇచ్చిన మొదటి డోస్ లు కాగా 9,67,852 డోసుకు ఆరోగ్య సిబ్బంది తీసుకున్న రెండో డోస్.
ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకాలలో 60.17% కేవలం 7 రాష్ట్రాల్లో కేంద్రీకృతమయ్యాయి. ఒక్క కర్నాటకలోనే 11.8% (1,14,043 డోసులు) ఇచ్చారు.
భారత్ లో ఇప్పటివరకు కోవిడ్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 1,06,99,410 కు చేరింది. కోలుకున్నవారి శాతం 97.22%గా నమోదైంది. చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు 1,05,49,355 (71.3 రెట్లు) అధికం. 9,695 మంది గత 24 గంటలలో కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా కోలుకున్నవారిలో 80.86% మంది కేవలం ఐదు రాష్ట్రాలకు చెందినవారే. కేరళలో అత్యధికంగా ఒక రోజులో కోలుకున్నవారు 4,345 మంది ఉండగా మహారాష్ట్రలో 2,417 మంది, తమిళనాడులో 460 మంది నమోదయ్యారు.
దేసంలో ప్రస్తుతం కోవిడ్ చికిత్సపొందుతూ ఉన్న వారి సంఖ్య 1,50,055 కి చేరింది. ఇది భారతదేశపు మొత్తం పాజిటివ్ కేసులలో 1.36%. గత 24 గంటలలో 14,199 మందికి పాజిటివ్ గా నిర్థారణ జరిగింది. ఏడు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అవి: ఉత్తరాఖండ్, లద్దాఖ్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, దాద్రా-నాగర్ హవేలి, దామన్-డయ్యీ, అండమాన్-నికోబార్ దీవులు
కొత్త కేసులలో 86.3% కేవలం ఐదురాష్టాల్లోనే నమోదయ్యాయి. రోజువారీ అత్యధిక కేసులలో మహారాష్ట మొదటి స్థానంలో కొనసాగుతోంది. గత 24 గంటలలో మహారాష్ట్రలో 6,971 కేసులు రాగా, ఆ తరువాత స్థానంలో ఉన్న కేరళలో 4,070 కేసులు, తమిళనాడులో 452 కొత్తకేసులు వచ్చాయి.
గడిచిన 24 గంటలలో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: హర్యానా, ఆంధ్రప్రదేశ్మ్, జమ్మూ-కశ్మీర్, రాజస్థాన్, ఒడిశా, గోవా, చందీగఢ్, అస్సాం, మణిపూర్, సిక్కిం, లక్షదీవులు, త్రిపుర, నాగాలాండ్, లద్దాఖ్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, అందమాన్-నికోబార్ దీవులు
గత 24 గంటలలో 83 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వీటిలో 78.31% కేవలం ఐదు రాష్టాల్లోనే సంభవించాయి. మహారాష్ట్రలో గరిష్టంగా ఒక్క రోజులో 35 కోవిడ్ మరణాలు నమోదు కాగా కేరళలో 15 మంది చనిపోయారు.
****
(Release ID: 1699924)
|