ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డాక్టర్ హర్ష్ వర్ధన్ మూడవ ఇండియా టూరిజం మార్ట్ ప్రారంభోత్సవంలో ప్రసంగించారు.
"మా విస్తారమైన మరియు శక్తివంతమైన ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ పురోగతి ప్రపంచంలోని ఉత్తమమైన వాటితో పోల్చదగినదిగా ఉంది"
"భారతదేశం అతిపెద్ద ఔషధ తయారీదారు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే వ్యాక్సిన్లలో ఎక్కువ భాగాన్ని సరఫరా చేస్తుంది"
Posted On:
18 FEB 2021 1:52PM by PIB Hyderabad
ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియా టూరిజం అండ్ హాస్పిటాలిటీ (ఫెయిత్) నిర్వహించిన మూడవ ఇండియా టూరిజం మార్ట్ ప్రారంభోత్సవంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఫెయిత్‌ను డాక్టర్ హర్ష్ వర్ధన్ అభినందించారు. వర్చువల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 60 దేశాలకు చెందిన 250 మందికి పైగా ప్రతినిధులు పాల్గొనడం పట్ల డాక్టర్ హర్ష్ వర్ధన్ ప్రశంసలు తెలిపారు. అలాగే "ఈ మూడవ భారత పర్యాటక మార్ట్ మరింత ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఎందుకంటే ఇది మహమ్మారి యొక్క చీకటి మేఘాల నుండి ప్రపంచం బయటపడుతున్న సమయంలో జరుగుతోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఆరోగ్య భద్రతా చర్యలు పాటిస్తూప్రయాణ ఆంక్షలను తొలగిస్తున్న క్రమంలో నిర్వహించబడుతోంది" అని చెప్పారు.
కోవిడ్ -19 మహమ్మారిని నియంత్రించడంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ డాక్టర్ వర్ధన్, “భారతదేశం కొవిడ్-19 కు వ్యతిరేకంగా ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని చేపట్టింది. మేము భారతదేశంలో 8.5 మిలియన్ల మందికి టీకాలు వేయడమే కాకుండా, మా సహాయం కోరిన ఇతర దేశాలకు మిలియన్ల టీకాలను పంపించాము. ” అని చెప్పారు.
దేశంలో వైద్య పర్యాటకం పెరగడానికి దారితీసిన భారత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల అభివృద్ధిపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ, “భారతదేశం ఎప్పుడూ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది, కానీ గత కొన్నేళ్లుగా ఇది మెడికల్ టూరిజం కోసం ఒక ప్రముఖ గమ్యస్థానంగా అవతరించింది. మా విస్తారమైన మరియు శక్తివంతమైన ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో పురోగతి ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటితో పోల్చదగినదిగా చేసింది. ప్రపంచ స్థాయి వైద్యులు, నర్సులు మరియు పారామెడికల్ సిబ్బందిని ఉత్పత్తి చేస్తున్న మా విద్యా విధానం ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తించబడింది. తరచుగా ప్రపంచ ఫార్మసీ అని పిలువబడే భారతదేశం అతిపెద్ద ఔషధ తయారీదారులలో ఒకటి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్లను సరఫరా చేస్తుంది. ఈ అన్ని బలాలు మరియు సామర్థ్యాలు వైద్య పర్యాటకానికి సంబంధించినంతవరకు భారతదేశం కీలకమైన ప్రదేశంగా ఎదగడానికి దోహదపడ్డాయి. . ” "దీనిని మరింత ప్రోత్సహించడానికి, మేము ఇప్పటికే వైద్య వీసాలు ఇవ్వడం ప్రారంభించాము మరియు త్వరలో ఇ-టూరిస్ట్ వీసాలతో పాటు షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాలను పునః ప్రారంభించాలని యోచిస్తున్నాము" అని ఆయన అన్నారు.
అంతర్జాతీయ పర్యాటకాన్ని పునరుద్ధరించడంలో పర్యాటక మంత్రిత్వ శాఖ చేసిన ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంలో తన మంత్రిత్వ శాఖ నిబద్దతో పనిచేస్తుందని డాక్టర్ హర్ష్ వర్ధన్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఫెయిత్‌ను మరోసారి అభినందించిన కేంద్రమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులందరికీ తన శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
***
(Release ID: 1699053)
Visitor Counter : 192