ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

363.4 కోట్ల రూపాయల పెట్టుబడితో ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వశాఖ ప్రతిపాదించిన యూనిట్లకు ఆమోదం

Posted On: 17 FEB 2021 11:44AM by PIB Hyderabad

ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద 363.4 కోట్ల రూపాయల పెట్టుబడితో  వ్యవసాయ ప్రాసెసింగ్ కేంద్రాలకు ( ఏపీసి) మౌలిక సదుపాయాలను కల్పించడం / ఫుడ్ ప్రాసెసింగ్ మరియు వాటిని నిల్వ చేసే సౌకర్యాలను ఎక్కువ చేయడానికి నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ అధ్యక్షతన సమావేశం అయిన ఇంటర్ మినిస్టీరియల్ ఆమోదం కమిటీ ( ఐఎంఏసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కమిటీ సమావేశం ప్రతిపాదనలను పరిశీలించి వీటికి ఆమోదం తెలిపింది.  కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిశ్రీ రామేశ్వర్ తేలి, ప్రోజెక్టుల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

  ఐఎంఏసీ ఆమోదించిన ప్రాజెక్టుల వల్ల ఉద్యాన /  వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ ఎక్కువగా జరగడమే కాకుండా వాటి విలువ పెరుగుతుందని భావిస్తున్నారు. దీనివల్ల రైతుల ఆదాయం పెరిగి స్థానిక ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. 

సమావేశంలో ఆమోదం పొందిన ప్రోజెక్టుల వివరాలు:

సీఈఎఫ్ పిపిసీ  కింద : 

* హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మిజోరాం మరియు గుజరాత్ రాష్ట్రాలలో 36.30 కోట్ల రూపాయల గ్రాంట్-ఇన్-ఎయిడ్ తో సహా 113.08 కోట్ల రూపాయల విలువ చేసే 11 ప్రాజెక్టులు.  వీటిలో 76.78 కోట్ల రూపాయల మేరకు ప్రైవేట్ పెట్టుబడులు ఉంటాయి.  వీటివల్ల 3,700 మందికి ఉపాధి కలగడమే కాకుండా 6800 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. 

*  వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ / నిల్వ సామర్ధ్యాలను మెరుగు పరచి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ఆధునీకరించి, సామర్ధ్యాన్ని ఎక్కువ చేయాలన్న లక్ష్యంతో రూపొందిన ఈ పధకానికి  ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద 2017 మే అయిదవ తేదీన ఆమోదం లభించింది.  ప్రాసెసింగ్ చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచి వాటి వృధాను తగ్గించడానికి ఇది దోహదపడుతుంది. 

ఏపీసి ద్వారా మౌలిక సదుపాయాల కల్పన

* మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మరియు రాజస్థాన్ రాష్ట్రాలలో 66.61 కోట్ల రూపాయల గ్రాంట్-ఇన్-ఎయిడ్ తో సహా 250.32 కోట్ల రూపాయల విలువ చేసే తొమ్మిది ప్రాజెక్టులు. వీటిలో183.71 కోట్ల రూపాయల మేర ప్రైవేట్ పెట్టుబడులు ఉంటాయి. వీటివల్ల 8260 మందికి ఉపాధి కలగడమే కాకుండా 36000 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. 

* ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనను ప్రోత్సహించడానికి  ఏపీసి ద్వారా మౌలిక సదుపాయాలను కల్పించాలన్న పధకానికి  ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద 2017 మే మూడవ  తేదీన ఆమోదం లభించింది.

 

***

 


(Release ID: 1698688) Visitor Counter : 195