ప్రధాన మంత్రి కార్యాలయం
జియో స్పేశల్ డేటా సేకరణ కు, ఉత్పత్తి కి సంబంధించిన విధానాల ను సరళతరం చేయడం ‘ఆత్మనిర్భర్ భారత్’ ను ఆవిష్కరించాలనే మన దార్శనికత లో ఒక పెద్ద ముందంజ గా ఉంది: ప్రధాన మంత్రి
ఈ సంస్కరణ లు నియంత్రణ ల తొలగింపు ద్వారా భారతదేశం లో వ్యాపార నిర్వహణ తాలూకు సౌలభ్యాన్ని మెరుగుపరచాలన్న మన వచనబద్ధత ను చాటిచెప్తున్నాయి: ప్రధాన మంత్రి
Posted On:
15 FEB 2021 1:39PM by PIB Hyderabad
ఫలానా భౌగోళిక ప్రదేశాల తో ప్రత్యక్షం గా ముడిపడి ఉన్న సమాచారాన్ని సేకరించడానికి, ఉత్పత్తి చేయడానికి సంబంధించిన విధానాల ను సరళతరం చేయడం అనేది ‘ఆత్మనిర్భర్ భారత్’ ను ఆవిష్కరించాలన్న మన దార్శనికత లో ఒక పెద్ద ముందంజ గా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సంస్కరణ నూతన ఆవిష్కరణ లకు చోదకం గా ఉంటూ, అనుసరణీయ పరిష్కార మార్గాల ను కనుగొనేందుకు దేశం లోని రైతుల కు, స్టార్ట్-అప్స్ కు, ప్రైవేటు రంగానికి, పబ్లిక్ సెక్టరు కు, పరిశోధన సంస్థల కు ప్రయోజనకరం కాగలుగుతుందని ఆయన అన్నారు.
‘‘డిజిటల్ ఇండియా కు ఒక భారీ ఉత్తేజాన్ని అందించేటటువంటి ఒక నిర్ణయాన్ని మా ప్రభుత్వం తీసుకుంది. జియోస్పేశల్ డాటా సేకరణ కు, ఉత్పత్తి కి సంబంధించిన విధానాల ను సరళతరం చేయడం ఒక ‘ఆత్మనిర్భర్ భారత్’ ను ఆవిష్కరించాలన్న మన దార్శనికత లో ఒక పెద్ద ముందడుగు గా ఉంది.
ఈ సంస్కరణ లు నూతన ఆవిష్కరణల కు చోదకం గా ఉంటూ అనుసరణీయ పరిష్కార మార్గాల ను కనుగొనడానికి మన దేశం లోని స్టార్ట్-అప్స్ కు, ప్రైవేటు రంగానికి, పబ్లిక్ సెక్టరు కు, పరిశోధన సంస్థల కు విస్తృత అవకాశాలను అందిస్తాయి. ఇది ఉద్యోగ కల్పన కు, ఆర్థిక వృద్ధి వేగవంతం కావడానికి కూడా దోహదపడుతుంది.
భారతదేశం లోని రైతులు కూడా జియో స్పేశల్ & రిమోట్ సెన్సింగ్ సంబంధిత సమాచార రాశి ని ఉపయోగించుకోవడం ద్వారా లబ్ధి ని పొందుతారు. డేటా ను ప్రజాస్వామ్యీకరించడం కొత్త సాంకేతికత ల, నూతన వేదికల ఎదుగుదల కు వీలు కల్పిస్తుంది; దీనితో వ్యవసాయ రంగ సామర్థ్యం, వ్యవసాయ రంగం తో సంబంధం ఉన్న ఇతర రంగాల సామర్థ్యం మెరుగుపడుతుంది.
నియంత్రణల ను తొలగించడం ద్వారా భారతదేశం లో వ్యాపార నిర్వహణ తాలూకు సౌలభ్యాన్ని మెరుగుపరచాలన్న మా వచనబద్ధత ను ఈ సంస్కరణ లు చాటి చెప్తున్నాయి’’ అని అనేక ట్వీట్ లలో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
సంస్కరణల వివరాలను https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1698073 లో చూడగలరు.
*****
(Release ID: 1698110)
Visitor Counter : 204
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam