ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
26 రోజుల్లో 70 లక్షల కోవిడ్ టీకాలు వేసి
అత్యంత వేగవంతమైన దేశంగా నిలిచిన భారత్ గత 24 గంటల్లో ఒక్క కోవిడ్ మరణం కూడా
నమోదు కాని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు భారత్ లో ప్రతి పది లక్షల జనాభాల్లో చికిత్సలో
ఉన్న కోవిడ్ బాధితులు ప్రపంచంలోనే అత్యల్పం
Posted On:
11 FEB 2021 11:37AM by PIB Hyderabad
భారతదేశం కోవిడ్ మీద సాగిస్తున్న పోరులో మరో మైలురాయి చేరుకుంది. ఇప్పటిదాకా 70 లక్షలకు పైగా కోవిడ్ టీకాలు వేసి, తక్కువ రోజుల్లో ఆ ఘనత సాధించిన దేశంగా నిలిచింది. ఇన్ని టీకాలు వేయటానికి భారతదేశానికి 26 రోజులు పట్టగా , అమెరికాకు 27 రోజులు, బ్రిటన్ కు 48 రోజులు పట్టటం గమనార్హం. కొద్ది రోజుల కిందట 60 లక్షల మైలురాయిని చేరుకోవటంలో కూడా భారతదేశమే ముందుంది

2021 ఫిబ్రవరి 11వతేదీ ఉదయం 8 గంటలకు టీకాలు వేయించుకున్నవారి మొత్తం సంఖ్య 79 లక్షలు దాటి 70,17,114 గా నమోదైంది.
క్రమసంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం
|
టీకా లబ్ధిదారులు
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
3,413
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
3,35,268
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
13,480
|
4
|
అస్సాం
|
1,10,977
|
5
|
బీహార్
|
4,30,307
|
6
|
చండీగఢ్
|
6,903
|
7
|
చత్తీస్ గఢ్
|
2,16,784
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
2,326
|
9
|
డామన్, దయ్యూ
|
1,030
|
10
|
ఢిల్లీ
|
1,46,789
|
11
|
గోవా
|
9,961
|
12
|
గుజరాత్
|
6,14,530
|
13
|
హర్యానా
|
1,83,529
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
66,101
|
15
|
జమ్మూ, కశ్మీర్
|
74,219
|
16
|
జార్ఖండ్
|
1,60,492
|
17
|
కర్నాటక
|
4,64,485
|
18
|
కేరళ
|
3,26,246
|
19
|
లద్దాఖ్
|
2,536
|
20
|
లక్షదీవులు
|
920
|
21
|
మధ్య ప్రదేశ్
|
4,31,702
|
22
|
మహారాష్ట్ర
|
5,73,681
|
23
|
మణిపూర్
|
13,747
|
24
|
మేఘాలయ
|
9,760
|
25
|
మిజోరం
|
11,046
|
26
|
నాగాలాండ్
|
7,167
|
27
|
ఒడిశా
|
3,61,623
|
28
|
పుదుచ్చేరి
|
4,770
|
29
|
పంజాబ్
|
91,669
|
30
|
రాజస్థాన్
|
5,59,990
|
31
|
సిక్కిం
|
7,808
|
32
|
తమిళనాడు
|
1,97,392
|
33
|
తెలంగాణ
|
2,58,122
|
34
|
త్రిపుర
|
52,908
|
35
|
ఉత్తరప్రదేశ్
|
6,73,542
|
36
|
ఉత్తరాఖండ్
|
90,483
|
37
|
పశ్చిమ బెంగాల్
|
4,27,042
|
38
|
ఇతరములు
|
74,366
|
మొత్తం
|
70,17,114
|
ఇప్పటివరకు మొత్తం 70,17,114 మందికి టీకాలు వేయగా వారిలో 57,05,228 మంది ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. 13,11,886 మంది కోవిడ్ పోరాట యోధులున్నారు. ఇప్పటివరకు 1,43,056 శిబిరాలు నిర్వహించారు. 26వ రోజైన ఫిబ్రవరి 10 నాడు 4,05,349 మంది టీకాలు వేయించుకున్నారు. వారిలో ఆరోగ్య సిబ్బంది 94,890 మంది, కోవిడ్ యోధులు 3,10,459 ఉన్నారు. వీరి కోసం 8,308 శిబిరాలు నిర్వహించారు. రోజురోజుకూ టీకాలు వేయించుకునేవారి సంఖ్య పెరుగుతోంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో నమోదు చేసుకున్న ఆరోగ్య సిబ్బందిలో 65% మందికి పైగా టీకాలు తీసుకున్నారు. 79% మంది ఆరోగ్య సిబ్బంది టీకాలు పూర్తి చేసుకోవటం ద్వారా బీహార్ ముందంజలో ఉంది.

నమోదు చేసుకున్న ఆరోగ్య సిబ్బందిలో 40 శాతం కంటే తక్కువమంది టీకాలు వేయించుకున్న వారున్న రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏడు. పుదుచ్చేరి లో కేవలం 17.5% మంది ఆరోగ్య సిబ్బంది మాత్రమే టీకాలు వేయించుకోవటంతో అది తక్కువ శాతం టీకాల రాష్ట్రంగా నమోదైంది.

కోవిడ్ మీద పొరులో భారత విజయపరంపర కొనసాగుతూ వస్తోంది. గత 24 గంటలలో 17 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అవి: తెలంగాణ, గుజరాత్, అస్సాం, హర్యానా, ఒడిశా, ఉత్తరాఖండ్, మేఘాలయ, నాగాలాండ్, లక్షదీవులు, లద్దాఖ్, సిక్కిం, మణిపూర్, మిజోరం, అండమాన్, నికోబార్ దీవులు, త్రిపుర, అరుణాచ్ల్ ప్రదేశ్, దాద్రా-నాగర్ హవేలి, డామన్ అండ్ డయ్యూ. దేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 1,42,562 కాగా మొత్తం కోవిడ్ కేసుల్లో వీటి వాటా కేవలం 1.31%. ప్రతి పది లక్షల జనాభాలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య భారత్ లో 104 మాత్రమే. ప్రపంచంలో అతి తక్కువ నమొదైన దేశాల్లో భారత్ ఒకటి.

దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 12,923 మందికి కోవిడ్ సోకినట్టు తేలింది. అదే సమయంలో 11,764 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 97.26% గా నమోదైంది. ఇది అంతర్జాతీయంగా అత్యధిక స్థాయిలో కొనసాగటాన్ని చూపుతోంది. ఇప్పటిదాకా మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,05,73,372. కోలుకున్నవారికీ, చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా కూడా పెరుగుతూ ప్రస్తుతం 1,04,30,810 అయింది. కొత్తగా కోలుకున్నవారిలో 83.20% మంది కేవలం ఆరు రాష్టాల్లో నమోదయ్యారు. కేరళలో అత్యధికంగా ఒక్క రోజులో 5,745 మంది కోలుకోగా, అ తరువాత స్థానాల్లో మహారాష్ట్ర (2,421) గుజరాత్ (495) ఉన్నాయి.

కొత్తగా కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయినవారిలో 85.11% మంది ఆరు రాష్టాలకు చెందినవారే ఉన్నారు. కేరళలో అత్యధికంగా ఒక్క రోజులో 5,980 కేసులు రాగా, ఆ తరువాత స్థానాల్లో ఉన్న మహారాష్ట్రలో 3,451 మంది, తమిళనాడులో 479 మంది కోవిడ్ పాజిటివ్ గా తేలారు.

గత 24 గంటలలో 108 మంది కోవిడ్ బాధితులు మరణించారు. వారిలో 79.63% మంది ఏదు రాష్టాలకు చెందినవారే ఉన్నారు. మహారాష్ట్రలొ అత్యధికంగా 30 మరణాలు నమోదు కాగా కేరళలో 18 మంది చనిపోయారు.

****
(Release ID: 1697101)
Visitor Counter : 288
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Malayalam