ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌ధాన మంత్రి తో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన కెన‌డా ప్ర‌ధాని శ్రీ జ‌స్టిన్ ట్రూడో

Posted On: 10 FEB 2021 11:07PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో కెనడా ప్ర‌ధాని శ్రీ జ‌స్టిన్ ట్రూడో బుధ‌వారం నాడు టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.

భార‌త‌దేశం నుంచి కెన‌డా కు అవ‌స‌ర‌మైన కోవిడ్‌-19 టీకామందు ను గురించి ప్ర‌ధాని శ్రీ ట్రూడో ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ కి తెలిపారు.  ఇప్ప‌టికే చాలా దేశాల కు భార‌త‌దేశం అందించిన మాదిరిగానే, కెన‌డా కు కూడా టీకా మందు విష‌యం లో భార‌త‌దేశం త‌న శాయ‌శ‌క్తులా స‌హాయాన్ని అందిస్తుంద‌ంటూ కెన‌డా ప్ర‌ధాని కి ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ హామీ ని ఇచ్చారు.

ప్ర‌ధాని శ్రీ ట్రూడో భారతదేశాన్ని ప్రశంసిస్తూ, కోవిడ్-19 పై ప్ర‌పంచ దేశాలు విజ‌యాన్ని సాధించ‌గ‌లిగాయి అంటే, అందులో భార‌త‌దేశాని కి ఉన్న గొప్ప‌దైన ఔష‌ధ నిర్మాణ సంబంధిత సామ‌ర్ధ్యం తో పాటు ఆ సామర్థ్యాన్ని ప్రపంచంతో పంచుకోవడం లో ప్రధాన మంత్రి శ్రీ మోదీ నాయకత్వానికి కూడా ప్రముఖస్థానం ఉంటుంది అన్నారు.  ప్ర‌ధాని శ్రీ ట్రూడో వ్య‌క్తం చేసిన ఈ అభిప్రాయానికి గాను శ్రీ ట్రూడో కు ప్ర‌ధాన మంత్రి ధ‌న్య‌వాదాలు తెలిపారు.
 
భౌగోళిక- రాజ‌కీయ అంశాల లో భార‌త‌దేశం, కెన‌డా ల సమాన దృష్టి కోణాన్ని నేత‌లు ఇద్ద‌రూ పున‌రుద్ఘాటించారు.  జ‌లవాయు ప‌రివ‌ర్త‌న, మ‌హ‌మ్మ‌రి క‌లుగ‌జేసే ఆర్థిక ప్ర‌భావాల‌ వంటి ప్రపంచ స‌వాళ్ళ‌ కు ఎదురొడ్డి పోరాడ‌డంలో ఇరు దేశాల మ‌ధ్య స‌న్నిహిత స‌హ‌కారాన్ని కొనసాగించాల‌ని వారు సమ్మతి ని వ్యక్తం చేశారు.  

ఈ సంవ‌త్స‌రం చివర లో వివిధ ప్రముఖ అంత‌ర్జాతీయ వేదిక‌ల లో ఒక‌రి తో మ‌రొక‌రు భేటీ అవుతూ ప‌ర‌స్ప‌ర హితం ముడిప‌డ్డ అన్ని అంశాల పై చ‌ర్చ‌ల‌ ను కొన‌సాగించాల‌న్న ఉత్సుకత ను నేత‌ లు ఇరువురూ వ్యక్తం చేశారు. 

***(Release ID: 1697027) Visitor Counter : 54