ప్రధాన మంత్రి కార్యాలయం
ఈ నెల 10న వరల్డ్ సస్‌టైనబుల్ డెవలప్‌మెంట్ సమిట్ 2021 ని ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
Posted On:
08 FEB 2021 5:34PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘వరల్డ్ సస్‌టేనబుల్ డెవలప్‌మెంట్ సమిట్ 2021’ని ఫిబ్రవరి 10వ తేదీ న సాయంత్రం 6గంటల 30 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఈ శిఖర సమ్మేళనానికి ‘మన భవిష్యత్తు ను పునర్ నిర్వచించుకోవడం: అందరికీ సురక్షితమైన, భద్రమైన పర్యావరణం’ అనే అంశం ఇతివృత్తం గా ఉండనుంది. గుయాన గణతంత్రం అధ్యక్షుడు డాక్టర్ మొహమద్ ఇర్ ఫాన్ అలీ, న్యూ పాపువా గినీ ప్రధాని శ్రీ జేమ్స్ మారపే, మాల్దీవ్స్ గణతంత్రం పీపుల్స్ మజ్ లిస్ స్పీకర్ శ్రీ మొహమ్మద్ నశీద్, ఐక్య రాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ- జనరల్ అమీనా జె. మొహమ్మద్ లతో పాటు భారత ప్రభుత్వం లో పర్యావరణం, అడవులు, జలవాయు పరివర్తన శాఖ కేంద్ర మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు.
శిఖర సమ్మేళనాన్ని గురించి
ది ఎనర్జీ ఎండ్ రిసోర్సెజ్ ఇన్స్ టిట్యూట్ (టిఇఆర్ఐ) కి చెందిన ప్రధాన కార్యక్రమం అయినటువంటి వరల్డ్ సస్‌టేనబుల్ సమిట్ తాలూకు 20వ సంచిక ను 2021వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి12వ తేదీ వరకు ఆన్ లైన్ మాధ్యమం ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఈ శిఖర సమ్మేళనం లో అనేక దేశాల ప్రభుత్వాలు, వ్యాపార రంగ నాయకులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, యువజనులు, సామాజిక సంస్థలు జలవాయు పరివర్తన కు వ్యతిరేకం గా పోరు లో కలసిరానున్నారు. భారతదేశాని కి చెందిన పర్యావరణం, అడవులు, జలవాయు పరివర్తన మంత్రిత్వ శాఖ, నూతన, నవీకరణ యోగ్య శక్తి మంత్రిత్వ శాఖ, పృధ్వీ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఈ శిఖర సమ్మేళనాని కి కీలక భాగస్వాములుగా ఉన్నాయి. శక్తి, పరిశ్రమ పరివర్తన, అనుసరణ మరియు ప్రతిఘాతుకత్వం, ప్రకృతి ఆధారిత పరిష్కార మార్గాలు, క్లయిమేట్ ఫైనాన్స్, చక్రీయ ఆర్థిక వ్యవస్థ, స్వచ్ఛ మహాసాగరాలు, వాయు కాలుష్యం తదితర అంశాలు ఈ శిఖర సమ్మేళనం లో చర్చ కు రానున్నాయి.
***
(Release ID: 1696252)
Visitor Counter : 255
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam