ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తరాఖండ్‌ లోని చమోలీ లో హిమపాతం బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఆమోదం తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 07 FEB 2021 8:45PM by PIB Hyderabad

ఉత్తరాఖండ్ లోని చమోలీ లో మంచుదిబ్బలో చీలిక ఏర్పడిన కారణం గా సంభవించిన హిమపాతం దుర్ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వారి దగ్గర బంధువులకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుండి ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.

అదే ఘటన లో తీవ్రం గా గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున సహాయం అందించడానికి కూడా ప్రధాన మంత్రి ఆమోదం తెలియజేశారు.

‘‘ఉత్తరాఖండ్ ‌లోని చమోలీ లో మంచుదిబ్బ లో చీలిక కారణం గా సంభవించిన విషాదభరితమైనటువంటి హిమపాతం ఘటన లో ప్రాణాలను కోల్పోయిన వారి దగ్గర బంధువులకు పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (PM @narendramodi) ఆమోదం తెలిపారు.  ఇదే ఘటన లో తీవ్రం గా గాయపడిన వారికి 50,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది.’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో తెలిపింది.

 

****



(Release ID: 1696097) Visitor Counter : 113