ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో మాట్లాడి, ఆ రాష్ట్రంలో దురదృష్టకర పరిస్థితిని సమీక్షించిన - ప్రధానమంత్రి

Posted On: 07 FEB 2021 2:33PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్‌తో మాట్లాడి, ఆ రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించారు.

ఈ మేరకు, ప్రధానమంత్రి కార్యాలయం, ప్రసారమాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,  "ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM @narendamodi), అస్సాంలో ఉన్నప్పుడు, ఉత్తరాఖండ్ పరిస్థితిని సమీక్షించారు.  ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి టి.ఎస్.రావత్ (CM  @tsrawatbajp) తోనూ, ఇతర ఉన్నతాధికారులతోనూ, ప్రధానమంత్రి మాట్లాడారు. రక్షణ, సహాయ చర్యల గురించి, ఆయన, అడిగి తెలుసుకున్నారు.  బాధితులకు తగిన సహాయ, సహకారాలు అందించడానికి అధికారులు కృషి చేస్తున్నారు." అని పేర్కొంది. 

ఇదే విషయమై, ప్రధానమంత్రి మరొక ట్వీట్ చేస్తూ,  "ఉత్తరాఖండ్ ‌లోని దురదృష్టకర పరిస్థితిని నేను నిరంతరం పర్యవేక్షిస్తున్నాను. భారతదేశం మొత్తం,  ఉత్తరాఖండ్ కు అండగా నిలుస్తుంది.  అక్కడ ప్రతి ఒక్కరి భద్రత కోసం దేశం కృషి చేస్తుంది. సీనియర్ అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నాను. ఎన్.డి.ఆర్.ఎఫ్. వ్యూహం, రక్షణ, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటున్నాను." అని పేర్కొన్నారు. 

*****



(Release ID: 1696044) Visitor Counter : 139