ప్రధాన మంత్రి కార్యాలయం

ఇజ్ రాయిల్ ప్రధాని గౌరవనీయ బెంజామిన్ నెతన్యాహూ తో మాట్లాడిన ప్రధాన మంత్రి

Posted On: 01 FEB 2021 6:46PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇజ్ రాయిల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ తో ఈ రోజు న అంటే 2021వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ న టెలిఫోన్ ద్వారా సంభాషించారు.  

న్యూ ఢిల్లీ లో ఇజ్ రాయిల్ రాయబార కార్యాలయం సమీపం లో 2021వ సంవత్సరం జనవరి 29వ తేదీ న జరిగిన ఉగ్రవాద దాడి ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో తెలిపారు.  ఇజ్ రాయిల్ దౌత్యవేత్త ల, పరిసరాల భద్రత భారతదేశానికి అధిక ప్రాముఖ్యం ఉన్న అంశం అని, అపరాధులను వెదకి పట్టుకొని వారిని శిక్షించడానికి అన్ని ఏర్పాట్లను చేయడమైందని ప్రధాని శ్రీ నెతన్యాహూ కు ఆయన హామీ ని ఇచ్చారు.  ఉభయ నేత లు ఈ సందర్బం లో భారతదేశం, ఇజ్ రాయిల్ ల భద్రత ఏజెన్సీల మధ్య సన్నిహిత సమన్వయం పట్ల సంతోషాన్ని  వ్యక్తం చేశారు.

నేత లు ఇద్దరూ వారి వారి దేశాలలో కోవిడ్-19 మహమ్మారి కి వ్యతిరేకం గా జరుగుతున్నటువంటి పోరాటం తాలూకు ప్రగతి ని ఒకరి దృష్టి కి మరొకరు తీసుకువచ్చారు.  ఈ రంగం లో మున్ముందు సహకరించుకోవడానికి ఉన్న అవకాశాల పై సైతం వారు చర్చించారు.



 

***



(Release ID: 1694263) Visitor Counter : 205