ఆర్థిక మంత్రిత్వ శాఖ
కేంద్ర బడ్జెట్ 2021-22లో పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణానుప్రోత్సహించడం
ప్రభుత్వ బస్సు రవాణా సేవలకు తోడ్పడటానికి రూ .18 వేల కోట్ల కొత్తపథకాన్ని ప్రతిపాదించడం
టైర్ -2 మరియు టైర్ -1 నగరాల చుట్టుపక్కల ప్రాంతాలకు 'మెట్రో లైట్' మరియు 'మెట్రో నియో' అనే రెండు కొత్తసాంకేతికతలు.
కొచ్చి, చెన్నై, బెంగళూరు, నాగ్‌పూర్ మరియు నాసిక్ కేంద్రాల మెట్రో ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం
Posted On:
01 FEB 2021 1:48PM by PIB Hyderabad
పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ రవాణా సదుపాయాల వాటా పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మెట్రోరైలు నెట్‌వర్క్ విస్తరణసహా సిటీ బస్సుల సేవలను పెంచాలని నిర్ణయించింది. తదనుగుణంగా ప్రభుత్వ సదుపాయాలు, సిటీ బస్సుల సేవల పెంపు నిమిత్తం రూ. 18,000 కోట్లతో ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనుంది.
దేశంలో ప్రస్తుతం 702 కిలోమీటర్ల మేర సంప్రదాయక మెట్రో రైలు సదుపాయం ఉండగా, మరో 27 నగరాల్లో ఇప్పుడు 1,016 కిలోమీటర్ల మేర మెట్రోసహా ‘ఆర్‌ఆర్‌టీఎస్’ పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. దీంతోపాటు 1వ అంచె నగరాల శివార్లకు, 2వ అంచె నగరాల్లో మరింత తక్కువ ఖర్చుతో ఇదేతరహా ప్రయాణానుభవం కల్పించే మెట్రో రైలు వ్యవస్థలను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ‘మెట్రో లైట్’, ‘మెట్రో నియో’ పేరిట రెండు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగిస్తుంది.
***
(Release ID: 1694249)
Visitor Counter : 277