ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్థిక వ్యవస్థపై మహమ్మారి ప్రభావం: బలహీన ఆదాయ ప్రవాహాల పై తప్పనిసరిఉపశమనం కోసం అధిక వ్యయం
2020-21 వ్యయానికి సవరించిన అంచనా రూ.34.50 లక్షల కోట్లు 2020-21 లో రూ.30.42 లక్షల కోట్లు2020-21 సవరించిన అంచనాలలో ద్రవ్య లోటు 9.5 శాతానికి పెరిగింది
మూలధన వ్యయం రూ .5.54 లక్షల కోట్లు, రూ .34.83 లక్షల కోట్లతో సహా ఆర్థిక అంచనా 2021-22బడ్జెట్ అంచనా 2021-22, ద్రవ్య లోటుజిడిపిలో 6.8 శాతం
బడ్జెట్ అంచనా 2021-22: మార్కెట్ నుండిమొత్తం రూ .12 లక్షల కోట్లు
ఎఫ్‌ఆర్‌బిఎం చట్టంలో సవరణ: 2025-26 నాటికి ద్రవ్య లోటు స్థాయినిజిడిపిలో 4.5 శాతానికి తగ్గించాలని లక్ష్యం
Posted On:
01 FEB 2021 1:54PM by PIB Hyderabad
రాష్ట్రాలు తీసుకున్న నికర అప్పులు:
15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలు తీసుకోవటానికి వీలున్న నికర రుణాలను 2021-2022 లో స్థూల జాతీయోత్పత్తిలో 4% వరకు అనుమతించారు.
Ø ఇందులో కొంతభాగం మూలధన వ్యయంలో పెంపుకు కేటాయించారు.
Ø పరిస్థితిని బట్టి అవసరమైతే స్థూల జాతీయోత్పత్తిలో అదనంగా 0.5% అదనంగా అప్పు తీసుకోవచ్చు.
Ø 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రాలు 2023-24 నాటికి ద్రవ్యలోటు స్థూల జాతీయోత్పత్తిలో 3% కు చేరవచ్చు.
15వ ఆర్థిక సంఘం:
2021-26 మధ్య కాలానికి సంబంధించిన తుది నివేదిక రాష్ట్రపతికి సమర్పించబడింది. రాష్ట్రాల వాటా 41% కొనసాగుతుంది.
జమ్మూ, కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులను కేంద్రమే అందిస్తుంది.
ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా రెవెన్యూ లోటు గ్రాంటుగా 2021-22 సంవత్సరానికి 17 రాష్ట్రాలకు రూ. 1,18,452 కోట్లు అందించాలని ప్రతిపాదించగా 2020-21 లో అది 14 రాష్ట్రాలకు రూ. 74,340 కోట్లుగా ఉంది.
పన్ను ప్రతిపాదనలు
పెట్టుబడులను ప్రోత్సహించేలా, దేశంలో ఉపాధి పెంచేలా పారదర్శకమైన, సమర్థమైన పన్ను వ్యవస్థ తీర్చిదిద్దటం లక్ష్యం పెట్టుకుంది., అదే సమయంలో పన్ను చెల్లింపుదారులమీద భారం కూడా కనీస స్థాయిలో ఉండాలని భావిస్తోంది.
1. ప్రత్యక్ష పన్నులు
సాధనలు
కార్పొరేట్ పన్నును ప్రపంచంలోనే అతి తక్కువ ఉండేలా తగ్గించబడింది.
రిబేట్లు ఇవ్వటం ద్వారా చిన్న పన్ను చెల్లింపుదారులమీద భారం తగ్గించబడింది.
పన్ను రిటర్న్ ల దాఖలు దాదాపు రెట్టింపైంది. 2014 లో 3.31 కోట్లు ఉండగా 2020 నాటికి 6.48 కోట్లు అయింది.
ప్రత్యక్షంగా హాజరు కానవసరం లేని మదింపు, అప్పీలు ప్రవేశపెట్టబడ్డాయి.
(Release ID: 1694197)
Visitor Counter : 293