ఆర్థిక మంత్రిత్వ శాఖ
వచ్చే ఐదేళ్లకు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కోసం రూ .50 వేల కోట్లుకేటాయించాలని ప్రతిపాదించారు
డిజిటల్ చెల్లింపు మార్గాలను ప్రోత్సహించడానికి ఈ పథకం కోసం 1,500కోట్ల రూపాయలు ప్రతిపాదించారు
ప్రధాన భారతీయ భాషలలో పాలన మరియు విధానానికి సంబంధించిన జ్ఞానం యొక్కభాండాగారాన్ని డిజిటలైజ్ చేయడానికి జాతీయ భాషా అనువాద ప్రచారం.
న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన పిఎస్‌ఎల్‌వి-సిఎస్ 51 చేతభారతీయ ఉపగ్రహాలతో బ్రెజిలియన్ అమెజోనియా ఉపగ్రహ ప్రయోగం; డిసెంబర్ 2021నాటికి గగన్యాన్ మిషన్ ను ప్రారంభించేందుకు ప్రణాళిక
ఐదేళ్లపాటు లోతైన మహాసముద్ర యాత్రకు రూ .4,000 కోట్లు
Posted On:
01 FEB 2021 1:41PM by PIB Hyderabad
నవకల్పన, పరిశోధన-అభివృద్ధి
2019 జులై లో ప్రకటించిన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ విధివిధానాలు:
o ఐదేళ్లకు గానురూ. 50,000 కోట్ల కేటాయింపు
o మొత్తంగా జాతీయ ప్రాధాన్యతా రంగాలమీద దృష్టి సారించి పరిశోధన వాతావారణాన్ని బలోపేతం చేయటం
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించటానికి ప్రతిపాదించిన పథకానికి రూ. 1,500 కోట్లు
జాతీయ భాషా అనువాద మిషన్ ( ఎన్ టి ఎల్ ఎం) ద్వారా పాలనకు, విధానాలకు సంబంధిమ్చిన పరిజ్ఞానాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలలో లభ్యమయేట్టు చూడటం
న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ( ఎన్ ఎస్ ఐ ఎల్ ) ప్రయోగించే పి ఎస్ ఎల్ వి – సి ఎస్ 51 ద్వారా బ్రెజిల్ వారి అమెజోనియా, ఉపగ్రహంతోబాటు మరికొన్ని భారతీయ ఉపగ్రహాల ప్రయోగం
గగన్ యాన్ మిషన్ కార్యకలాపాల ద్వారా:
Ø రష్యాలో అంతరిక్ష యానం మీద నలుగురు వ్యోమగాములకు శిక్షణ
Ø 2021 డిసెంబర్ నాటికి మానవరహిత ప్రయోగం
సముద్ర అంతర్భాగంలో జీవ వైవిధ్యాన్ని శోధించి, పరిరక్షించటం కోసం సర్వే జరపటానికి వచ్చే ఐదేళ్ల కాలానికి రూ. 4,000 కోట్లు
(Release ID: 1694168)
Visitor Counter : 261
Read this release in:
Tamil
,
English
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam