ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రధాన నౌకాశ్రయాలలో నిర్వహణ సేవల కు పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య నమూనా


భారతదేశం లో వ్యాపార నౌకల నిర్వహణ ను ప్రోత్సహించడానికి భారతీయ శిప్పింగ్ కంపెనీలకు 1,624 కోట్ల రూపాయల సబ్సిడీ ఊతం

రీసైక్లింగ్ సామర్థ్యం 2024వ సంవత్సరానికల్లా రెట్టింపై, సుమారు 4.5 మిలియన్ ఎల్ డిటి మేరకు చేరుకొంటుంది; దీనితో అదనం గా 1.5 లక్షల ఉద్యోగాల కల్పనకు ఆస్కారం

Posted On: 01 FEB 2021 1:34PM by PIB Hyderabad

ప్రధాన నౌకాశ్రయాలు 2,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ఏడు పథకాల ను 2021-22 ఆర్థిక సంవత్సరం లో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య నమూనా లో ఇవ్వజూపనున్నాయి.  ఆర్థిక‌, కార్పొరేట్ వ్య‌వ‌హారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ‌మ‌తి నిర్మ‌ల సీతార‌మ‌ణ్ కేంద్ర బ‌డ్జెటు ను సోమ‌వారం దిల్లీ లో పార్ల‌మెంటులోప్రవేశపెడుతూ ఈ విషయాన్ని తెలిపారు.  ప్రధాన నౌకాశ్రయాలు వాటి నిర్వహణ సేవలను సొంతంగా చూసుకొంటున్న పద్ధతి నుంచి, ఇకపై ఆ సేవల నిర్వహణ ను ఒక ప్రైవేటు భాగస్వామి చూసుకొనే నమూనా కు మారనున్నాయని ఆమె పేర్కొన్నారు.
 


 
Ports, Shipping, Waterways.jpg



భారతదేశం లో వ్యాపార నౌకలను ప్రోత్సహించడం కోసం మంత్రిత్వ శాఖ లు, సిపిఎస్ఇ లు తాము జారీ చేసే గ్లోబల్ టెండర్ లలో భారతీయ శిప్పింగ్ కంపెనీలకు 5 సంవత్సరాల కాలం లో 1,624 కోట్ల రూపాయల మేరకు సబ్సిడీ మద్దతును అందించే పథకాన్ని కూడా శ్రీమతి సీతారమణ్ ప్రతిపాదించారు.  ఈ కార్యక్రమం ప్రపంచ స్థాయి నౌకా వ్యాపారంలో భారతీయ కంపెనీల వాటా ను పెంపొందింపచేయడం తో పాటు భారతీయ నావికులకు అధిక శిక్షణావకాశాలను, అధిక ఉద్యోగావకాశాలను కూడా వీలు కల్పిస్తుందని ఆమె నొక్కిచెప్పారు.  

శిప్ రీసైక్లింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసి 2024వ సంవత్సరానికల్లా దాదాపు గా 4.5 మిలియన్ లైట్ డిస్ ప్లేస్ మెంట్ టన్ను (ఎల్ డిటి) స్థాయి కి చేర్చేందుకు కూడా శ్రీమతి సీతారమణ్ ప్రతిపాదించారు.  గుజరాత్ లోని అలంగ్ లో ఉన్న సుమారు 90 శిప్ రీసైక్లింగ్ యార్డులు హాంగ్ కాంగ్ ఇంటర్ నేశనల్ కన్ వెన్శన్ (హెచ్ కెసి) నియమపాలన తాలూకు ధ్రువపత్రాలను ఇప్పటికే చేజిక్కించుకొన్నాయని, ఈ నేపథ్యం లో యూరోప్, జపాన్ ల నుంచి మరిన్ని నౌకలను భారతదేశానికి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తామని ఆమె తెలిపారు.  ఇది జరిగితే దేశం లో యువత కు అదనంగా 1.5 లక్షల ఉద్యోగాలు లభించగలవని భావిస్తున్నారు.

 

 

***
 



(Release ID: 1694082) Visitor Counter : 273