ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో కోలుకున్న కోవిడ్ బాధితులు 97%
గత 24 గంటలలో కోలుకున్నవారు 11,858 మంది
తగ్గుదల బాటలో కొత్త కేసులు, మరణాలు
37.5 లక్షలు దాటిన కోవిడ్ టీకాల లబ్ధిదారులు
Posted On:
01 FEB 2021 12:11PM by PIB Hyderabad
కోవిడ్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య భారీగా పెరుగుతూ ఇప్పుడు 97% చేరుకుంది. ఇది అంతర్జాతీయంగా కూడా ఘన విజయం. ఇప్పుడు ఇంకా కోవిడ్ చికిత్స పొందుతున్నవారి సంఖ్య నేడు 1,68,235 కు తగ్గింది. మొత్తం పాజిటివ్ కేసులలో వీరి వాటా 1,56% మాత్రమే.
ఇప్పటివరకు మొత్తం 1,04,34,983 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. గత 24 గంటలలో 11,858 మంది కోలుకున్నారు. కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో చికిత్సలో ఉన్నవారికీ, కోలుకున్నవారికీ మధ్య తేదా పెరుగుతూ ప్రస్తుతం 1,02,66,748 కు చేరింది..
భారత్ లో నమోదవుతున్న రోజువారీ కొత్త కేసులు కూడా తగ్గుదలబాటలో సాగుతున్నాయి. 2021 సెప్టెంబర్ 11న అత్యధికంగా 96,551 కేసులు నమోదుకాగా 2021 ఫిబ్రవరి 1న ఆ సంఖ్య I 11,427 కు తగ్గిపోయింది.
రోజువారీ కోవిడ్ మరణాలు కూడా బాగా తగ్గుతూ 120 లోపుకు చేరాయి. గత 24 గంటలలో 118 మరణాలు నమోదయ్యాయి.
దేశవ్యాప్త టీకాల కార్యక్రమంలో భాగంగా 2021 ఫిబ్రవరి 1 ఉదయం 8 గంటలవరకు 37,58,843 మంది లబ్ధిదారులు కోవిడ్ టీకాలు తీసుకున్నారు.
గడిచిన 24 గంటలలో 253 శిబిరాలలో 14,509 మంది టీకాలు తీసుకున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం శిబిరాలు 69,215
క్రమ సంఖ్య
|
రాష్టం/కేంద్రపాలితప్రాంతం
|
టీకా లబ్ధిదారులు
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
2,727
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
1,87,252
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
9,651
|
4
|
ఆస్సాం
|
38,106
|
5
|
బీహార్
|
1,48,293
|
6
|
చండీగఢ్
|
3,447
|
7
|
చత్తీస్ గఢ్
|
72,704
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
692
|
9
|
డామన్, డయ్యూ
|
391
|
10
|
ఢిల్లీ
|
56,818
|
11
|
గోవా
|
4,117
|
12
|
గుజరాత్
|
2,47,891
|
13
|
హర్యానా
|
1,25,977
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
27,734
|
15
|
జమ్మూ కశ్మీర్
|
26,634
|
16
|
జార్ల్హండ్
|
40,860
|
17
|
కర్నాటక
|
3,15,370
|
18
|
కేరళ
|
1,65,171
|
19
|
లద్దాఖ్
|
1,128
|
20
|
లక్షదీవులు
|
807
|
21
|
మధ్యప్రదేశ్
|
2,98,376
|
22
|
మహారాష్ట్ర
|
2,69,064
|
23
|
మణిపూర్
|
3,987
|
24
|
మేఘాలయ
|
4,324
|
25
|
మిజోరమ్
|
9,346
|
26
|
నాగాలాండ్
|
3,993
|
27
|
ఒడిశా
|
2,06,424
|
28
|
పుదుచ్చేరి
|
2,736
|
29
|
పంజాబ్
|
57,499
|
30
|
రాజస్థాన్
|
3,30,797
|
31
|
సిక్కిం
|
2,020
|
32
|
తమిళనాదు
|
1,05,821
|
33
|
తెలంగాణ
|
1,68,606
|
34
|
త్రిపుర
|
29,796
|
35
|
ఉత్తరప్రదేశ్
|
4,63,793
|
36
|
ఉత్తరాఖండ్
|
31,228
|
37
|
పశ్చిమ బెంగాల్
|
2,43,143
|
38
|
ఇతరములు
|
52,120
|
మొత్తం
|
37,58,843
|
కొత్తగా కోలుకున్న వారిలో 86.47% మంది 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారు కాగా, కేరలలో అత్యధికంగా ఒక్క రోజులోనే 5,730 కోలుకోగా, మహారాష్ట్రలో 1,670 మంది, తమిళనాడులో 523 మంది కోలుకున్నారు.
గత 24 గంటలలో 11,427 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అందులో 80.48% కేసులు కేవలం 5 రాష్ట్రాల్లో నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా 5,266 కొత్త కేసులు వచ్చాయి. .ఆ తరువాత స్థానంలో ఉన్న మహారాష్ట్రలో 2,585, కర్నాటకలో 522 కొత్త కేసులు వచ్చాయి. మొదటి రెండు స్థానాల్లో ఉన్న కేరళ, మహారాష్ట్రలోనే కొత్త కేసుల్లో 68.71% నమోదయ్యాయి.
గత 24 గంటలలో నమోదైన కోవిడ్ మరణాలలో 76.27% ఆరు రాష్ట్రాలలో నమోదైనవి కాగా మహారాష్టలో అత్యధికంగా 40, ఆ తరువాత కేరళలో 21, పశ్చిమ బెంగాల్ లో 9 మరణాలు నమోదయ్యాయి.
****
(Release ID: 1693867)
Visitor Counter : 162