ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌బుద్ధ భార‌త 125వ వార్షిక ఉత్స‌వాల‌లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

ఈ ప‌త్రిక‌ను స్వామి వివేకానంద స్థాపించారు.
పేద‌ల‌కు సాధికార‌త క‌ల్పించ‌డంలో ఇండియా స్వామి వివేకానంద‌ను అనుస‌రిస్తున్న‌ది.
కోవిడ్ మ‌హమ్మారి స‌మ‌యంలో, వాతావ‌ర‌ణ మార్పుల విష‌యంలో ఇండియా వైఖ‌రి స్వామి వివేకానంద విధానానికి అనుగుణంగా ఉంది.: ప‌్ర‌ధాన‌మంత్రి
యువ‌త సంపూర్ణ ఆత్మ‌విశ్వాసం నిర్భ‌యంగా ఉండేందుకు వివేకానందుడి బోధ‌న‌ల‌ను అనుస‌రించాలి : ప‌్ర‌ధాన‌మంత్రి

Posted On: 31 JAN 2021 3:46PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఈరోజు స్వామి వివేకానందుడు ప్రారంభించిన రామ‌కృష్ణ త‌త్వానికి సంబంధించిన ప్ర‌బుద్ధ భార‌త మాస‌ప‌త్రిక 125వ వార్షిక ఉత్స‌వాల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.
ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి, మ‌న దేశ స్పూర్తిని ప్ర‌తిబింబించేలా వివేకానందుడు ఈ ప‌త్రిక‌కు ప్ర‌బుద్ధ భార‌త అని నామ‌క‌ర‌ణం చేశార‌ని ఆయ‌న అన్నారు. స్వామీజీ కేవ‌లం రాజ‌కీయ‌, భౌగోళిక ఇండియా కాక‌ జాగృత‌ ఇండియాను రూపొందించాల‌ని కోరుకున్నార‌ని ఆయ‌న అన్నారు. శ‌తాబ్దాలుగా అనుస‌రిస్తున్న‌, శ్వాసిస్తున్న సాంస్కృతిక చైత‌న్య‌స్ఫూర్తిగా స్వామి వివేకానంద ఇండియాను చూశార‌ని ఆయ‌న అన్నారు.
మైసూరు మ‌హారాజు కు, స్వామి రామ‌కృష్ణానంద‌కు స్వామి వివేకానంద రాసిన ఉత్త‌రాన్ని ప్ర‌స్తావిస్తూ స్వామి వివేకానంద‌, పేద‌ల‌కు సాధికార‌త క‌ల్పించ‌డంలో స్వామీజీ విధానంలోని రెండు ప్ర‌ముఖ ఆలోచ‌న‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు. ఇందులో మొద‌టిది, పేద‌ల‌ను సుల‌భంగా సాధికార‌త వైపు వెళ్ల‌లేకుంటే సాధికార‌తను పేద‌ల వ‌ద్ద‌కే తీసుకువెళ్ళాల‌ని ఆయ‌న అన్నారు. రెండ‌వ‌ది, భార‌త దేశ పేద‌ల గురించి ప్ర‌స్తావిస్తూ, వారికి ఆలోచ‌న‌లివ్వాలి.  ప్ర‌పంచంలో ఏం జ‌రుగుతుందో త‌మ చుట్టుప‌క్కల ఏం జ‌రుగుతున్న‌దో వారికి తెలియ‌జెప్పాలి. అప్పుడు వారు త‌మ స్వంత విముక్తి కోసం వారు ప‌నిచేస్తారు అన్న దానిని ఉటంకించారు. ఈ ర‌క‌మైన విధానంతోనే ప్ర‌స్తుతం ఇండియా ముందుకు సాగిపోతున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి స్ప‌ష్టం చేశారు. జ‌న్‌ధ‌న్ యోజ‌న చేసిన‌ది ఇదే న‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. పేద‌ల‌కు ఇన్సూరెన్సు అందుబాటులో లేకపోతే, ఇన్సూరెన్సే పేద‌ల‌ను చేరాల‌ని అన్నారు. జ‌న్ సుర‌క్ష ప‌థ‌కం దీనిని చేసింద‌ని అన్నారు. పేద‌ల‌కు ఆరోగ్య ప‌థ‌కం అందుబాటులో లేక‌పోతే మ‌నం ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ను పేద‌ల వ‌ద్ద‌కు తీసుకువెళ్లాల‌ని అన్నారు. అందుకే ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం  అదే చేస్తున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.

రోడ్లు, విద్య‌, విద్యుత్ , ఇంట‌ర్నెట్ స‌దుపాయం వంటి వాటిని దేశ న‌లుమూల‌ల‌కూ తీసుకువెళ్ల‌డం జ‌రుగుతున్న‌ద‌ని ప్ర‌త్యేకించి ఈ స‌దుపాయాల‌ను పేద‌ల‌ వ‌ద్ద‌కు తీసుకువెళుతున్నామ‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ఇది పేద‌ల‌లో ఆకాంక్ష‌ల‌ను రేకెత్తిస్తుంద‌ని అన్నారు. ఈ ఆకాంక్ష‌లు దేశ ప్ర‌గ‌తిని ముందుకు తీసుకుపోతున్నాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి స్ప‌ష్టం చేశారు.

కోవిడ్ 19 మ‌హ‌మ్మారి స‌మ‌యంలో ఇండియా తీసుకున్న సానుకూల వైఖ‌రి,
సంక్షోభ స‌మ‌యంలో నిస్స‌హాయ మైన ప‌రిస్థితి ఫీల్ కాకుండా ఉండాల‌న్న  స్వామీజీ విధానానికి అనుగుణ‌మైన‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. అలాగే వాతావ‌ర‌ణ మార్పుల స‌మ‌స్య గురించి ఫిర్యాదు చేయ‌డానికి బ‌దులు ఇండియా అంత‌ర్జాతీయ సౌర కూట‌మి ఏర్పాటు ద్వారా ఒక ప‌రిష్కారానికి ముందుకు  వ‌చ్చింద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.  స్వామీ వివేకానందుడి దార్శ‌నిక‌త అయిన ప్ర‌బుద్ధ భార‌త‌ను నిర్మించ‌డం జ‌రుగుతొంది. ప్ర‌పంచానికి ప‌రిష్కారాలు చూపుతున్న భార‌తావ‌ని ఇది అని ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు.


స్వామి వివేకానంద‌కు భార‌తీయ యువ‌త‌పై అపార‌మైన విశ్వాస‌మ‌ని, ఆయ‌న భారత‌దేశం గురించి స్వామివివేకానంద గొప్ప క‌ల‌లుక‌న్నార‌ని అవి భార‌త వ్యాపార నాయ‌కులు, క్రీడాకారులు, టెక్నోక్రాట్‌లు ప్రొఫెష‌న‌ళ్లు, ఆవిష్క‌ర్త‌లు ఇలా ఎంద‌రిలోనో ప్ర‌తిఫ‌లిస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు.
   స్వామీ వివేకానందుడు త‌మ ప్ర‌సంగాల‌లో ఆచ‌ర‌ణాత్మ‌క వేదాంతం గురించి  చేసిన సూచ‌న‌ల‌ను పాటిస్తూ యువ‌త ముందుకు సాగాల‌ని ప్ర‌ధాన‌మంత్రి దేశ యువ‌త‌కు పిలుపునిచ్చారు. ఈ ప్ర‌సంగాల‌లో స్వామీ వివేకానంద‌, ఎదురుదెబ్బ‌ల‌ను అధిగ‌మించ‌డం గురించి ఆయ‌న తెలియ‌జెప్పార‌ని, వాటిని జీవ‌న పాఠాలుగా స్వీక‌రించాలని అన్నార‌ని తెలిపారు. ఇక ప్ర‌జ‌లలో పాదుకొల్ప‌వ‌ల‌సిన రెండ‌వ అంశం, నిర్భ‌యంగా ఉండ‌డం, ఆత్మ‌విశ్వాసం క‌లిగిఉండేలా చూడ‌డ‌మ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌పంచానికి విలువను అందించ‌డం ద్వారా స్వామీ వివేకానంద శాశ్వ‌త‌త్వం సాధించార‌ని అన్నారు. స్వామీ వివేకానంద ఆథ్యాత్మిక‌త‌, ఆర్ధిక ప్ర‌గ‌తి ప‌ర‌స్ప‌రం వేటిక‌విగా చూడ‌లేద‌ని ఆయ‌న అన్నారు. అత్యంత ప్ర‌ధాన‌మైన‌దేమంటే, పేద‌రికాన్ని రొమాంటిసైజ్‌చేసే విధానానికి ఆయ‌న వ్య‌తిరేక‌మ‌ని ఆయ‌న అన్నారు.స్వామీజీ ఆథ్యాత్మికంగా మ‌హా వ్య‌క్తి అని అంటూ , ఎంతో ఉన్న‌త‌మైన మ‌హ‌నీయుడు స్వామీజీ అని అన్నారు.  పేద‌ల అభ్యున్న‌తి కోరుకుంటూనే , ఆయ‌న ఆర్థిక ప్ర‌గ‌తికి పెద్ద‌పీట వేశార‌న్నారు.

 స్వామీ వివేకానందుడు ప్రారంభించిన ప‌త్రిక ప్ర‌బుద్ధ భార‌త  స్వామీజీ ఆలోచ‌న‌ల‌ను వ్యాప్తి చేయ‌డంలో 125 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. స్వామీజీ దార్శ‌నిక‌త ఆధారంగా యువ‌త‌ను , దేశాన్ని జాగృతం చేయ‌డంపై వారు దీనిని నిర్మంచార‌న్నారు. స్వామీ వివేకానందుడి ఆలోచ‌న‌లకు శాశ్వ‌త‌త్వం క‌ల్పించ‌డానికి ఇది చెప్పుకోద‌గిన కృషి చేసింద‌ని ఆయ‌న అన్నారు.


 

****


(Release ID: 1693836) Visitor Counter : 184